సీమరాజా తిట్టకురా ప్లీజ్, అంబటి రిక్వస్ట్

నేడు గుంటూరు పట్టాభిపురం పోలీస్ స్టేషన్ లో రెండు కంప్లైంట్స్ ఇచ్చిన మాజీ మంత్రి అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేసారు. నామీద, వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద టిడిపి ఆఫీసల్ ట్విట్టర్ ద్వారా అసభ్యకర పోస్టులు పెడుతున్నారని... జై టిడిపి అనే ట్విట్టర్ పేజీ లో జగన్ గారి మీద మార్ఫింగ్ చేసిన ఫోటోలు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసారు.

  • Written By:
  • Publish Date - December 6, 2024 / 03:10 PM IST

నేడు గుంటూరు పట్టాభిపురం పోలీస్ స్టేషన్ లో రెండు కంప్లైంట్స్ ఇచ్చిన మాజీ మంత్రి అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేసారు. నామీద, వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద టిడిపి ఆఫీసల్ ట్విట్టర్ ద్వారా అసభ్యకర పోస్టులు పెడుతున్నారని… జై టిడిపి అనే ట్విట్టర్ పేజీ లో జగన్ గారి మీద మార్ఫింగ్ చేసిన ఫోటోలు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. మా నాయకుడిని అవమానించే విధంగా టిడిపి పేజీలలో పోస్ట్ చేస్తున్నారని మండిపడ్డారు. సీమరాజు అనే వ్యక్తి మా వైఎస్ఆర్సిపి కండువా వేసుకొని మమ్ములను పచ్చి బూతులు తిడుతూ వీడియోలు చేస్తున్నాడన్నారు.

ఈ పోస్టింగులపై యాక్షన్ తీసుకోవాలని ఫిర్యాదు చేసామని మా మనోభావాలు దెబ్బతింటున్నాయన్నారు. డిజిపి నుండి ఎస్ఐ వరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై అక్రమ కేసులు పెడుతున్నారన్నారు. సీమరాజు ఇకనైనా రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానుకోవాలని కోరారు అంబటి. నారా లోకేష్ సృష్టించిన రోబో సీమరాజ అంటూ అంబటి మండిపడ్డారు. నారా లోకేష్ ఆధ్వర్యంలోనే సీమరాజు ఇండస్ట్రీ మాదిరిగా స్టూడియో పెట్టుకొని సోషల్ మీడియాలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై రెచ్చగొట్టే పోస్టులు పెడుతున్నారన్నారు.

వైఎస్ జగన్ గారు వారి సతీమణి భారతి గారు మీద కూడా అసభ్యంగా పోస్టులు పెడుతున్నారని మండిపడ్డారు. తక్షణమే సీమరాజు మీద యాక్షన్ తీసుకోకుంటే కోర్టుకు వెళ్తామన్నారు అంబటి. 14 రోజుల అనంతరం ప్రైవేట్ కేసులు వేస్తామని హెచ్చరించారు. హైకోర్టు, అక్కడ న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టుకు వెళ్తామన్నారు. భయపడి వెనకడుగు వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేసారు. డిజిపి గారికి చట్ట ప్రకారం వ్యవహరించాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. చట్టాలు వాటి పని అవి చేసుకునే విధంగా పనిచేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.