పవన్ తిక్కకు లెక్కలేదు, హీరోలా వెళ్ళాడు: అంబటి

డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్ పై మాజీ మంత్రి అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. నేను కాకినాడ పోర్ట్ కి వస్తుంటే అధికారులు సహకరించడం లేదు అని పవన్ అనడం ప్రభుత్వం లో ఉన్నారో లేదో అనిపిస్తుందని ఎద్దేవా చేసారు.

  • Written By:
  • Publish Date - November 30, 2024 / 05:52 PM IST

డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్ పై మాజీ మంత్రి అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. నేను కాకినాడ పోర్ట్ కి వస్తుంటే అధికారులు సహకరించడం లేదు అని పవన్ అనడం ప్రభుత్వం లో ఉన్నారో లేదో అనిపిస్తుందని ఎద్దేవా చేసారు. నిన్న పవన్ కల్యాణ్ పట్టుకోవడం ఏం లేదు.. అప్పటికే కలెక్టర్ పీడీఎస్ రైస్ ను పట్టుకున్నారన్నారు. పీడీఎస్ రైస్ సప్లై అనేది అనాతికాలంగా ఉందన్నారు. నాదెళ్ల మనోహర్ పీడీఎస్ రైస్ నీ అరికడత అన్నారు ఏం చేశారు అని నిలదీశారు. వైఎస్ఆర్సీపీ కి అసలు పీడీఎస్ రైస్ సప్లై తో సంబధం లేదు అని స్పష్టం చేసారు.

కూటమి ప్రభుత్వంలో ప్రతి నియోజకవర్గ ఎమ్మెల్యే పిడిఎస్ రైసు సప్లై లో భాగస్వాములు అవుతున్నారన్నారు. పవన్ కల్యాణ్ ఏమో అధికారులపై మండిపడం ఏంటి అని నిలదీశారు. ముఖ్యమంత్రి ఏమైనా అధికారులకు చెప్పారా పవన్ కళ్యాణ్ వెళ్తే సహకరించద్దని.. ప్రభుత్వంలో ఉన్నారా.. ప్రశ్నించే ధోరణిలో ఉన్నారా అనేది పవన్ కళ్యాణ్ ఒకసారి ప్రశ్నించుకోవాలి అని ఆయన సూచించారు. కాకినాడకు వెళ్లి పవన్ కళ్యాణ్ ఒక సినిమా షూటింగ్ చేసినట్లు ఉందన్నారు. కాకినాడ పోర్టులో పిడిఎస్ రైసు స్కాం నిజమైతే ముందు పౌరసరఫరాల శాఖ మంత్రిగా మనోహర్ రాజీనామా చేయాలి ఆ తర్వాత పవన్ కళ్యాణ్ చేయాలని డిమాండ్ చేసారు.

ఇప్పుడు పవన్ కళ్యాణ్ ను చూస్తే లెక్కలేని తిక్క ఉంది అనిపిస్తుందన్నారు. ప్రభుత్వంలో ఉండి అధికారులను విమర్శించటం విడ్డూరంగా ఉందని ఆయన ఎద్దేవా చేసారు. రాష్ట్రంలో దోపిడీ తప్ప ఏమీ లేదన్నారు. కొండబాబు కి మామూలు లేకుండా పిడిఎస్ దందా నడుస్తుందా అని ప్రశ్నించారు. మనోహర్ గారికి తెలియకుండానే అక్రమంగా బియ్యం తరలిస్తూ జరుగుతుందా అని మండిపడ్డారు అంబటి. పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టుకు వెళ్లడంతో.. ఎమ్మెల్యేల కమిషన్ పెరిగిందనన్నారు.