నాకు బెయిల్ వద్దు: చెవిరెడ్డి సంచలనం

తనపై నమోదు చేసిన కేసులపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్పందించారు. తనపై 11 సేక్షన్లతో కేసు నమోదు చేశారనన్నారు. తన బిడ్డకు అన్యాయం జరిగిందని బిడ్డ తండ్రి కోరితే న్యాయం చేయాలని వెళ్ళానని తెలిపిన ఆయన... బిడ్డకు సరైన వైద్యం అందించాలని తిరుపతి వైద్యులను కోరానని పేర్కొన్నారు.

  • Written By:
  • Publish Date - November 27, 2024 / 07:57 PM IST

తనపై నమోదు చేసిన కేసులపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్పందించారు. తనపై 11 సేక్షన్లతో కేసు నమోదు చేశారనన్నారు. తన బిడ్డకు అన్యాయం జరిగిందని బిడ్డ తండ్రి కోరితే న్యాయం చేయాలని వెళ్ళానని తెలిపిన ఆయన… బిడ్డకు సరైన వైద్యం అందించాలని తిరుపతి వైద్యులను కోరానని పేర్కొన్నారు. ఆ తర్వాత ఈ ఘటనపై నేను ఎక్కడా మాట్లాడలేదని ఆయన స్పష్టం చేసారు. అయినా నాపై పోక్సో సహా 11 సెక్షన్లతో కేసు పెట్టారన్నారు. బాధిత బిడ్డ చేసిన ఫిర్యాదులో, అరెస్టు చేసిన నిందితుడు విచారణ స్టేట్ మెంట్ లో ఎక్కడ వైసీపీ నేతల పేర్లు లేవని పేర్కొన్నారు.

తర్వాత స్టేట్ మెంట్ రాసుకుని వచ్చి పోలిసులకు సంతకాలు పెట్టించుకున్నారన్నారు. గతంలో ఇలాంటి కేసులు అనేకం పెడితే ఎదుర్కొన్నానని ఆయన పేర్కొన్నారు. ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేయనని… నన్ను జైలుకి పంపాలని అనుకుంటే పంపండి సిద్ధంగా ఉన్నానని ఆయన స్పష్టం చేసారు. తప్పుడు కేసులతో జైలుకి పంపాలన్నా అనుకున్నా నేను సిద్ధం అని స్పష్టం చేసారు. బాధిత బిడ్డను ఇబ్బంది పెట్టి రాద్ధాంతం చేసిన పోలీసులపై ఫోక్సో కేసు పెట్టాలని డిమాండ్ చేసారు.