Ganta Srinivasa Rao: అందుకే రాలేదు.. గంటాకు టిక్కెట్ ఎందుకు ఇవ్వలేదంటే..

గంటా శ్రీనివాసరావు మొదటి నుంచీ తనకు పట్టున్న విశాఖ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే పోటీచేయాలని నిర్ణయించారు. అందుకే చంద్రబాబు చీపురుపల్లి వెళ్ళమన్నా వెళ్ళడం లేదు. పైగా మంత్రి బొత్స మీద పోటీ అంటే.. గెలవడం కష్టమే అని భావించారు.

  • Written By:
  • Publish Date - March 27, 2024 / 02:27 PM IST

Ganta Srinivasa Rao: మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఇంకా టీడీపీ టిక్కెట్టుపై ఆశలు పెట్టుకున్నారు. చీపురుపల్లిలో మంత్రి బొత్సా సత్యనారాయణపై పోటీ చేయించాలని చంద్రబాబు గట్టి పట్టుదలగా ఉన్నారు. అందుకు గంటా ఏ మాత్రం ఒప్పుకోవట్లేదు. చివరకు ఆయన కోరుకున్నట్టే భీమిలీ టిక్కెట్ ఇస్తారన్న టాక్ టీడీపీలో నడుస్తోంది. టీడీపీ ఫస్ట్ లిస్టులోనే గంటా పేరు ఉండాల్సింది. అయినా ఎందుకు ఆలస్యమైంది అంటే.. ఆయన వ్యవహార శైలే అంటున్నారు టీడీపీ నేతలు.

Siddharth: ఒక్కటయ్యారు.. హీరోయిన్‌తో సిద్దార్థ్ సీక్రెట్ మ్యారేజ్..

గంటా శ్రీనివాసరావు మొదటి నుంచీ తనకు పట్టున్న విశాఖ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే పోటీచేయాలని నిర్ణయించారు. అందుకే చంద్రబాబు చీపురుపల్లి వెళ్ళమన్నా వెళ్ళడం లేదు. పైగా మంత్రి బొత్స మీద పోటీ అంటే.. గెలవడం కష్టమే అని భావించారు. తనను బలిపశువు చేయాలనే అక్కడి పంపుతున్నారని అనుచరులతో కామెంట్ కూడా చేశారు. గంటా శ్రీనివాసరావు ఆశిస్తున్న భీమిలీ సీటుకు కూడా టీడీపీలో విపరీతమైన కాంపిటేషన్ ఉంది. అయితే గంటాకు సీటు పెండింగ్ వెనక అనేక కారణాలు ఉన్నాయంటున్నారు. 2019లో ఎన్నికల్లో గెలిచిన తర్వాత గంటా శ్రీనివాసరావు చాలా కాలం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. కొన్ని రోజుల క్రితం ఆయన వైసీపీలోకి వెళ్తారన్న టాక్ కూడా నడిచింది. చంద్రబాబు విశాఖ వచ్చినప్పుడు.. లోకేష్ యువగళం టైమ్‌లో కూడా గంటా పాల్గొనలేదు. అందుకే ఆయనకు సీటు కేటాయించడానికి తెలుగుదేశం ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.

పైగా విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం టీడీపీ హైకమాండ్ నిర్ణయంతో సంబంధం లేకుండా.. గంటా శ్రీనివాసరావు రాజీనామా చేయడం పార్టీలో కొంత ఇబ్బందిగా మారింది. ప్రస్తుతం మాత్రం భీమిలీ, చీపురుపల్లి సీట్లు అయితే టీడీపీ ఎవరికీ కేటాయించలేదు. చీపురుపల్లిలో పోటీకి గంటాను చంద్రబాబు నాయుడు మరోసారి ఒప్పించే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఒకవేళ ఒప్పుకోకపోతే.. భీమిలీయే కేటాయిస్తారన్న టాక్ టీడీపీలో నడుస్తోంది.