Mahesh Babu:ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో మరోసారి సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ మెంబర్స్ బరిలోకి దిగబోతున్నట్టు తెలుస్తోంది. గుంటూరు ఎంపీగా రెండు సార్లు టీడీపీ నుంచి పోటీచేసి ఎన్నికైన గల్లా జయదేవ్.. కృష్ణ అల్లుడు అనే సంగతి తెలిసిందే. ఇప్పుడాయన రాజకీయాలకు గుడ్ బై చెప్పడంతో ఆ ప్లేసును కృష్ణ ఫ్యామిలీ మెంబర్‌తోనే భర్తీ చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయించినట్టు తెలుస్తోంది. కృష్ణ సోదరుడు, ప్రిన్స్ మహేష్ బాబాయ్ ఆదిశేషగిరిరావును ఎన్నికల్లోకి దించుతున్నట్టు సమాచారం. మరి మహేష్ బాబు.. బాబాయ్ తరపున టీడీపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారా అని ప్రశ్నలు వస్తున్నాయి.
YS JAGAN HELICOPTERS: జనం సొమ్ముతో సోకులు.. 4 కోట్లతో రెండు హెలికాప్టర్లు.. జగన్‌పై ఈసీకి కంప్లయింట్
సూపర్ స్టార్ కృష్ణ.. కాంగ్రెస్ అభిమాని. ఎన్టీఆర్‌తో విభేదించి కాంగ్రెస్‌లో కొనసాగారు. చనిపోయే దాకా వేరే పార్టీ మారలేదు. పైగా వైఎస్ రాజశేఖర్ రెడ్డితోనూ కృష్ణకు మంచి సంబంధాలు ఉండేవి. కొన్నిచోట్ల కాంగ్రెస్ ప్రచారంలో కూడా పాల్గొన్నారాయన. కృష్ణ అల్లుడు గల్లా జయదేవ్.. గుంటూరు ఎంపీగా టీడీపీ నుంచి పోటీ చేసి రెండు సార్లు గెలిచారు. ఈమధ్యే ఆయన పాలిటిక్స్ నుంచి తప్పుకున్నారు. లోక్ సభలో ఓ ప్రసంగంలో కూడా తన ఆవేదన వెలిబుచ్చారు. ఇక కృష్ణ తమ్ముడు.. మహేశ్ బాబు బాబాయ్ ఆదిశేషగిరి రావు సంగతి చూస్తే.. ఆయన ప్రస్తుతం టీడీపీలోనే ఉన్నారు. వైసీపీ పెట్టినప్పుడు ఆ పార్టీలోనే ఉన్నా.. ఆ తర్వాత జగన్ పట్టించుకోకపోవడంతో టీడీపీలో చేరారు. గత ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయాక ఆదిశేషగిరిరావు ఏ పార్టీలో చేరలేదు. కానీ సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు జరగబోతున్నాయి. గల్లా జయదేవ్ తప్పుకోవడంతో.. సూపర్ స్టార్ కృష్ణ కుటుంబం నుంచి మరొకరికి ఛాన్స్ ఇవ్వాలని చంద్రబాబు డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. గుంటూరు ఎంపీ స్థానం కోసం కొందరు NRIలు ప్రయత్నిస్తున్నారు.
దాంతో ఆదిశేషగిరి రావుకి పెనమలూరు అసెంబ్లీ స్థానం టిక్కెట్ ఇచ్చే ఆలోచన చేస్తున్నారు. ఈ నియోజకవర్గానికి చెందిన కొలను పార్థసారధి వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చారు. ఆయన్ని నూజివీడు నియోజకవర్గ ఇంఛార్జ్‌గా చంద్రబాబు నియమించారు. పోరమలూరులో కమ్మ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువే. అందుకే ఆదిశేషగిరి రావు అయితే గెలుపు గ్యారంటీ అని టీడీపీ అధిష్టానం నమ్ముతోంది. మరి బాబాయ్‌కి టిక్కెట్ ఇస్తే… ప్రిన్స్ మహేష్ బాబు వచ్చి ప్రచారం చేస్తారా.. టీడీపీకి పరోక్షంగా ఆయన ఆశీస్సులు అందుతాయా అన్నది చూడాలి.