GUDIVADA AMARNATH: ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ సీటుపై సస్పెన్స్ వీడిపోనుంది. పెందుర్తి నుంచి బరిలోకి దించాలని వైసీపీ హైకమాండ్ డిసైడ్ అయింది. జనసేన, టీడీపీ కూటమి బలంగా ఉన్న చోట కాపు సామాజికవర్గానికి చెందిన అమర్నాథ్‌ను దించి పొలిటికల్ చాలెంజ్ విసరనుంది వైసీపీ. పెందుర్తి నుంచి మంత్రి పోటీ చేయడంపై అధికారిక ప్రకటన వస్తుందని అంటున్నారు. మంత్రి గుడివాడ అమర్నాథ్.. వచ్చే ఎన్నికల్లో పోటీకి నియోజకవర్గం లేకుండా పోయిందనే విమర్శలకు వైసీపీ చెక్ పెట్టనుంది. ఊహించినట్టే మంత్రికి కీలక స్ధానాన్ని అధిష్టానం రిజర్వ్ చేసింది. వైసీపీ సిట్టింగ్ సీట్ అయిన పెందుర్తిని గుడివాడ అమర్నాథ్‌కు కేటాయించాలని నిర్ణయించింది.
TELANGANA BJP: లోక్‌సభ ఎన్నికలపై బీజేపీ ఫోకస్.. పార్లమెంట్ స్థానాలకు ఇంచార్జిల నియామకం..
దాంతో గ్రేటర్ విశాఖలో నాయకత్వాన్ని మరింత పటిష్టం చేయబోతోంది. సీఎం జగన్‌కు అత్యంత సన్నిహితుడైన అమర్నాథ్‌కు వైసీపీ వర్గాల్లో గుర్తింపు వుంది. తొలిసారి ఎమ్మెల్యే అయినా.. కేబినెట్లో చోటిచ్చిన జగన్.. కీలక శాఖలను అప్పగించారు. జగన్ సైనికుడిని అని గర్వంగా చెప్పుకునే మంత్రి.. రాజకీయ ప్రత్యర్ధులపై ఎదురుదాడిలోనూ దూకుడుగా వ్యవహరిస్తారు. దాంతో తెలుగుదేశం, జనసేనకు అమర్నాథ్ ఉమ్మడి టార్గెట్ అయ్యారు. పొత్తులు ఖరాయ్యాక మంత్రి పోటీ చేసే చోట మరింత ఫోకస్ పెంచాలని ప్రతిపక్షాలు నిర్ణయించాయి. ఈ పరిస్థితుల్లో రాజకీయంగా మంత్రికి ఊహించని దెబ్బ తగిలింది. అంతర్గత కుమ్ములాటలతో.. వైసీపీ సెకండ్ లిస్టులో అనకాపల్లి నుంచి మంత్రి పేరు గల్లంతైంది. కొత్త ఇంఛార్జ్‌గా మలసాల భరత్‌ను నియమించింది వైసీపీ. మరి మంత్రి ఎక్కడ నుంచి పోటీ చేస్తారనేది హైకమాండ్ క్లారిటీ ఇవ్వలేదు. దీంతో సీటు కోల్పోయిన మొదటి మంత్రిగా అమర్నాథ్ పేరు మారుమోగింది. అనకాపల్లిని వీడేటప్పుడు మంత్రి అమర్ నాథ్ కన్నీళ్ళు పెట్టుకోవడాన్ని ప్రతిపక్షాలు విమర్శల కోణంలోనే చూశాయి. పార్టీ అంతర్గత పరిణామాలపై అవగాహన ఉన్న మంత్రి, తన సీటుపై ధీమాగానే కనిపించారు. కానీ కేడర్‌తో పాటు కమ్యూనిటీలోనూ విస్త్రతమైన చర్చ జరిగింది. నెగెటివ్ సంకేతాలు కూడా వెళ్ళాయి. అమర్నాథ్ మాత్రం మొదటి నుంచి తాను ఎక్కడ పోటీ చేయాలో అధిష్టానం నిర్ణయిస్తుందని చెబుతూ వచ్చారు.
VIRAT KOHLI: రోహిత్, కోహ్లీ వచ్చేశారు.. టీ ట్వంటీల్లోకి రీ ఎంట్రీ
జగన్మోహన్ రెడ్డి ఆదేశిస్తే జెండా పట్టుకుని కార్యకర్తగా తిరుగుతానన్నారు. ఇప్పుడు మూడో జాబితాపై కసరత్తు జరుగుతుండటంతో ఉమ్మడి విశాఖ జిల్లాలో మరోసారి మార్పులు జరుగుతున్నాయి. ఇప్పటికే పాడేరు, అరకు, పాయకరావుపేట, గాజువాక స్ధానాల్లో కొత్త ఇంఛార్జులను నియమించింది వైసీపీ. తూర్పులో ఎంపీ ఎంవీవీ సత్యన్నారాయణ, సౌత్ నుంచి ఎమ్మెల్యే వాసుపల్లి, నార్త్ కేకే రాజు పోటీ ఖరారైంది. భీమిలిలో మాజీమంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ లేదా ఆయన కుటుంబ సభ్యుల్లో ఒకరికి టికెట్ ఖాయం. మంత్రి అమర్నాథ్ పోటీ చేసే స్ధానంపైనా క్లారిటీకి వచ్చింది వైసీపీ అధిష్టానం. మంత్రికి పెందుర్తి సేఫ్ జోన్‍గా నిర్ధరించింది. ఇక్కడ నుంచి అమర్నాథ్‌ను బరిలోకి దించడానికి చాలా అంశాలను అధిష్టానం పరిశీలించింది. వీటిల్లో ప్రధానమైనది టీడీపీ, జనసేన కూటమి. కాపు, వెలమ సామాజిక వర్గం ఓట్లు అధికంగా వుండే పెందుర్తి.. అర్బన్, సెమీ అర్బన్ ఓటర్లతో కలసి వుంటుంది. పెందుర్తి, సబ్బవరం, పరవాడ మండలాలు ఇక్కడ వున్నాయి. వీటిల్లో కాపు ఓట్ బ్యాంక్ పొందాలంటే స్ధానిక నాయకత్వాన్ని బరిలోకి దింపాలి. అమర్నాథ్ తాత అప్పన్న, తండ్రి గుర్నాథరావు పెందుర్తి నుంచి ఎమ్మెల్యేలుగా పనిచేశారు. ఇక్కడ ఎమ్మెల్యేగా వుండగానే గుర్నాథరావుకు మంత్రి చాన్స్ వచ్చింది. అలా చూస్తే అమర్నాథ్ రాజకీయంగా పెందుర్తికి లోకల్.
అదే సమయంలో వైసీపీ అధిష్టానం టీడీపీ ముఖ్యనేత, మాజీమంత్రి బండారు సత్యన్నారాయణ మూర్తిపై గుర్రుగా వుంది. టీడీపీ ఆవిర్భావం నుంచి కీలకంగా ఎదిగిన బండారు.. ఈమధ్య వైసీపీతో ఢీ అంటే ఢీ అంటున్నారు. ఆయన రాజకీయ విమర్శలు, ఆరోపణలు సంచలనం అవుతున్నాయి. మంత్రి రోజాను వ్యక్తిగతంగా తిట్టడంతో ప్రభుత్వం అరెస్ట్ చేసింది. అప్పటి నుంచి బండారును ఓడించడానికి పెందుర్తిలో పటిష్టమైన నాయకత్వం కోసం ఎదురు చూస్తొంది వైసీపీ. సిట్టింగ్ ఎమ్మెల్యే అదీప్ రాజ్ ఉన్నా.. ఆయనకు టిక్కెట్ ఇవ్వట్లేదని ఇప్పటీకే హైకమాండ్ చెప్పింది. అదీప్ స్ధానంలో మంత్రి అమర్నాథ్‌ను పోటీకి పెడుతుండటంతో పెందుర్తి పాలిటిక్స్ రంజుగా మారనున్నాయి. అనకాపల్లి నుంచి అమర్నాథ్‌ను మార్చేటప్పుడు యలమంచిలి లేదా చోడవరం పంపించాలని అధినాయకత్వం ఆలోచించింది. అయితే, సీనియర్ ఎమ్మెల్యేలు, క్యాస్ట్ ఈక్వేషన్లను లెక్కలోకి తీసుకున్నాక.. ఆ ప్రయత్నం విరమించుకుంది. అన్ని విధాలా అమర్నాథ్‌కు సేఫ్ జోన్‌గా భావిస్తున్న పెందుర్తి నుంచి పోటీకి సిద్ధం చేస్తోంది. ఒకట్రెండు రోజుల్లో దీనిపై అధికారిక ప్రకటన వెలువడుతుందని అమర్నాథ్ వర్గం ఎదురు చూస్తోంది.