బిడ్డా వదలను, పోలీసులకు హరీష్ మాస్ వార్నింగ్

ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా మాజీ మంత్రి హరీష్ రావు... చింతకాని మండలం ప్రొద్దుటూరులో.. నియోజక వర్గ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన హరీష్ తీవ్ర వ్యాఖ్యలు చేసారు.

  • Written By:
  • Publish Date - November 22, 2024 / 06:23 PM IST

ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా మాజీ మంత్రి హరీష్ రావు… చింతకాని మండలం ప్రొద్దుటూరులో.. నియోజక వర్గ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన హరీష్ తీవ్ర వ్యాఖ్యలు చేసారు. మార్పు అన్నారు ఏమి మార్పు వచ్చింది అని నిలదీశారు. రైతు బందు, కేసీఆర్ కిట్, దళిత బందు, 24 గంటల కరెంటు బందు అయ్యిందన్నారు. ఇక్కడ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హామీలు అమలు చేస్తామని బాండ్ పేపర్ ఇచ్చాడని మండిపడ్డారు. బస్సు తప్ప వీళ్ళ హామీలన్నీ తుస్సు అని ఎద్దేవా చేసారు.

అదానీ పై ఢిల్లీ రాహుల్ గాంధీ ది ఒక మాట..ఇక్కడ రేవంత్ రెడ్డి ది మరో మాట అని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి కి అదానీ ఏమి ఇచ్చాడో విచారణ చేయించాలి అని డిమాండ్ చేసారు. కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం కారణంగా ఇక్కడ రైతులు ఆత్మహత్య చేసుకున్నారు అని ఆయన ఆరోపించారు. కొందరు పోలీసులు మా కార్యకర్త లపై కేసులు పెడుతున్నారు అని విమర్శించారు. బిడ్డా వదిలి పెట్టేది లేదు..అక్రమ కేసులు పెట్టిన పోలేసులుకు తగిన శాస్తి జరుగుతుందని హెచ్చరించారు.