బిఆర్ఎస్ మెదక్ జిల్లా కార్యాలయంలో మాజీ మంత్రి హరీష్ రావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేసారు. మెదక్ జిల్లాలో ఏ ఊరు కైనా వెళ్లి రుణ మాఫీ అయిందా అని వెళ్దాం.. రుణమాఫీ అయితే నేను ముక్కు నేలకు రాస్తా.. ఇవ్వకుంటే నువ్వు రాస్తావా అని సవాల్ చేసారు. ఏం ముఖం పెట్టుకొని సిగ్గులేకుండా మెదక్ కు వస్తున్నావ్ అని నిలదీశారు. అసెంబ్లీ లో రేవంత్ అన్ని అబద్దాలు మాట్లాడుతున్నారని అసెంబ్లీని అపవిత్రం చేశాడని మండిపడ్డారు.
రాష్ట్రంలో క్రైమ్ రేట్ 41శాతం పెరిగింది..కెసిఆర్ ఏడాది పాలనలో 25వేల కేసులయితే రేవంత్ పాలనలో 35వేల కేసులు పెరిగాయన్నారు. పరిపాలనలో సీఎం గా, హోమ్ మినిస్టర్ గా ఫెయిల్ అని మండిపడ్డారు. ఏడాదిలో తొమ్మిది మత కల్లోలాలు జరిగాయని అసెంబ్లీలో ఆరు గ్యారెంటీల గురించి సీఎం చేతులెత్తెశారన్నారు. నమ్మి ఓట్లేస్తే ప్రజలకు గాడిద గుడ్డు మిగిలిచ్చిండు అని ఎద్దేవా చేసారు. ఏడాది లో రూ 1.25 లక్షల కోట్లు అప్పుచేసి కాంట్రాక్టర్ల కు బిల్లులిచ్చి కమిషన్లు తీసుకున్నాడన్నారు. కొత్త పథకాలు ఏమి ఇయ్యలే.. ఉన్న పథకాలు బంద్ పెట్టిండని మండిపడ్డారు.
రైతు భరోసా ఎప్పుడూ ఇస్తావని అడిగితె .. రెండు గంటల ఉపన్యాసమంతా చెత్త అని ఏడాది పాలన లో రైతు బంధు ఇయ్యలే.. యాసంగి రైతుబంధు ఎప్పుడు ఇస్తావో చెప్పు అని నిలదీశారు. రైతులందరికి ఎకరాకు రూ 15 వేల రైతు బందు ఇయ్యాలి అని డిమాండ్ చేసారు. సీఎం, మంత్రులకు కో ఆర్డినేషన్ లేదని ఎకరంలోపు భూమి ఉన్న వారిని రైతు కూలీలుగా గుర్తించాలని డిమాండ్ చేసారు. ఉపాధి హామీ కి వెళ్లే కూలీ రైతు కూలే అని ఎలాంటి కోతలు లేకుండా రైతు బంధు ఇవ్వాలని డిమాండ్ చేసారు. తిండి పెట్టె రైతులకు తొండి చేసి రైతు బందు ను ఎగొట్టేందుకు కుట్రచేస్తున్నారని కాంగ్రెస్ మంత్రులను, ఎమ్మెల్యే లను, లీడర్లను నిలదీయాలని పిలుపునిచ్చారు.