బ్లాక్ మెయిల్ ఆపి దమ్ముంటే రా: రేవంత్ కు హరీష్ సవాల్

అందోల్ మండలం మాసాన్ పల్లీ గ్రామంలో పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ సిఎం రేవంత్ రెడ్డి లక్ష్యంగా తీవ్ర వ్యాఖ్యలు చేసారు.

  • Written By:
  • Publish Date - November 21, 2024 / 01:48 PM IST

అందోల్ మండలం మాసాన్ పల్లీ గ్రామంలో పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ సిఎం రేవంత్ రెడ్డి లక్ష్యంగా తీవ్ర వ్యాఖ్యలు చేసారు. వరంగల్ రైతు డిక్లరేషన్ సభలో రేవంత్ రెడ్డి రైతులకు తొమ్మిది హామీలను అమలు చేస్తామని ప్రకటించారని… ఇందులో ఏ ఒక్క హామీనైనా నెరవేర్చగలిగాడా అంటూ హరీష్ రావు నిలదీశారు. ఏకకాలంలో రైతు రుణమాఫీ చేయడంలో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం… రాష్ట్రంలో వడ్ల కొనుగోలు లో పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు.

రైతులకు మద్దతు ధర కల్పించడంలో, పెట్టుబడి సాయం అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం చెందిందని ఆరోపించారు. రాష్ట్రంలో 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తామని సివిల్ సప్లై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారని మరోపక్క సివిల్ సప్లై కమిషనర్ 70 లక్షల మెట్రిట్ టన్నుల ధాన్యాన్ని కొంటామని ప్రకటించడ పట్ల ఆంతర్యమేమిటని నిలదీశారు. మధ్యలో 20 లక్షల మెట్రో టన్నుల ధాన్యం ఎక్కడికి పోయిందో చెప్పాలని ప్రశ్నించారు. రైతులు పండించిన సగం ధాన్యం దళారుల పాలయిందన్నారు.

ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రైతులు ఇబ్బందులకు గురవుతున్నారని ఆరోపించారు. దళిత గిరిజన అసైన్డ్ భూములకు పట్టాలు ఇస్తామని చెప్పి ఆ భూములను రాష్ట్ర ప్రభుత్వం కొల్లగొడుతోందన్నారు. కంపెనీ నిర్మాణాల కోసం ఆ భూములను తమ అనుయాయులకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నాడు సీఎం రేవంత్ రెడ్డి అని మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న కేటీఆర్ పై అక్రమ కేసులు నమోదు చేస్తున్నారన్నారు. బ్లాక్మెయిల్ రాజకీయాలకు తెరలేపుతున్న సీఎం రేవంత్ రెడ్డి… అంటూ మండిపడ్డారు. రంగనాయక సాగర్ దగ్గర ఇరిగేషన్ భూములను కబ్జా చేశానని నాపై రేవంత్ రెడ్డి తప్పుడు ఆరోపణ చేశాడు.పచ్చకామర్రునికి లోకమంతా పచ్చగా అన్నట్లు కబ్జాలు చేసే చరిత్ర రేవంత్ ది అని మండిపడ్డారు. ఏ భూమిని అయితే నేను రిజిస్ట్రేషన్ చేసుకున్నానో ఆ భూమిలోనే నేను ఉన్నాను. నువ్వు ఎప్పుడు వస్తావు రా రేవంత్ రెడ్డి. నీ సమక్షంలోనే సర్వే చేద్దాం అంటూ హరీష్ రావు సవాల్ చేసారు.