HARISH RAO: వెన్నుపోటుకు హరీష్ రెడీ.. బీఆర్ఎస్ నాలుగు ముక్కలు!

అసెంబ్లీ దద్దరిల్లిపోతోంది. మిగతా విషయాల సంగతి ఎలా ఉన్నా.. మేడిగడ్డ వ్యవహారం రేపుతున్న రచ్చ అంతా ఇంతా కాదు. కేసీఆర్ సర్కార్ అవినీతికి ఇదే నిదర్శనం అంటూ కాంగ్రెస్ ఆరోపణలు గుప్పిస్తుండగా.. బీఆర్ఎస్‌ కూడా స్ట్రాంగ్‌గా కౌంటర్ ఇస్తోంది.

  • Written By:
  • Updated On - February 15, 2024 / 04:41 PM IST

HARISH RAO: తెలంగాణ రాజకీయాలు.. ఎప్పుడూ లేనంత ఆసక్తిగా కనిపిస్తున్నాయ్. బీఆర్ఎస్‌ సర్కార్ హయాంలో జరిగిన అవకతవకలను… సీఎం రేవంత్ ఒక్కొక్కటిగా బయటపెడుతున్నారు. దీంతో కాంగ్రెస్‌, కారు పార్టీల మధ్య.. మాటలు తూటాల్లా పేలుతున్నాయ్. అసెంబ్లీ దద్దరిల్లిపోతోంది. మిగతా విషయాల సంగతి ఎలా ఉన్నా.. మేడిగడ్డ వ్యవహారం రేపుతున్న రచ్చ అంతా ఇంతా కాదు. కేసీఆర్ సర్కార్ అవినీతికి ఇదే నిదర్శనం అంటూ కాంగ్రెస్ ఆరోపణలు గుప్పిస్తుండగా.. బీఆర్ఎస్‌ కూడా స్ట్రాంగ్‌గా కౌంటర్ ఇస్తోంది.

Supreme Court on Electoral Bonds : ఎలక్టోరల్ బాండ్స్ రద్దు – డబ్బులు తిరిగి ఇచ్చేయండి: సుప్రీం

ఈ ప్రాసెస్‌లో మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌ చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు కారణం అవుతున్నాయ్. రేవంత్‌ను సీఎంగా తప్పుకోమని సవాల్‌ విసిరిన హరీష్‌.. తాను ముఖ్యమంత్రి అయి మేడిగడ్డను బాగు చేస్తానంటూ చేసిన కామెంట్లు.. తెలంగాణ పొలిటికల్‌ సర్కిల్స్‌లో సెగలు పుట్టిస్తున్నాయ్. ఈ మాటలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి.. అసెంబ్లీ లాబీ చిట్‌చాట్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హరీష్ మాటలు.. కేసీఆర్, కేటీఆర్‌కు వెన్నుపోటు పొడిచేలా ఉన్నాయని.. ఆయన సీఎం కావాలన్న ప్లాన్‌తో కనిపిస్తున్నాడని.. ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌ను వ్యతిరేకించి వస్తే.. సీఎం అయ్యేందుకు హరీష్‌కు సపోర్ట్ చేస్తామంటూ వెంకట్‌రెడ్డి మాట్లాడిన మాటలు మరిన్ని సెగలు పుట్టిస్తున్నాయ్. కేసీఆర్‌కు హరీష్ వెన్నుపోటు పొడిచేలా కనిపిస్తున్నాడని పదేపదే ప్రస్తావించిన కోమటిరెడ్డి.. బీఆర్ఎస్‌ త్వరలో నాలుగు ముక్కలుగా విడిపోతుందని.. ఒక్క పార్టీ నాలుగు పార్టీలుగా మారడం ఖాయం అంటూ జోస్యం చెప్పారు.

ఆ పార్టీ కవిత, కేటీఆర్‌, హరీష్‌ పేర్ల మీద విడిపోతుందంటూ హాట్‌కామెంట్లు చేశారు కోమటిరెడ్డి. హరీష్‌ రావు బీఆర్ఎస్‌లోనే ఉంటే.. కనీసం శాసనసభాపక్ష నేత కూడా కాలేడంటూ కోమటిరెడ్డి మాట్లాడని మాటలకు.. అసెంబ్లీ లాబీల్లో అందరూ అవాక్కయినట్లు తెలుస్తోంది. ఇక అటు కేసీఆర్‌ మీద.. చిట్‌చాట్‌లో మరోసారి విరుచుకుపడ్డారు. కట్టె పట్టుకొని తిరిగే కేసీఆర్‌.. ఎలా పులి అవుతారంటూ సెటైర్లు వేశారు. 60 కిలోలు ఉన్న వ్యక్తి పులి అయితే.. 86 కిలోలు ఉన్న నేనేం కావాలి అంటూ జోకులేశారు. తెలంగాణలో మరో 20ఏళ్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. హరీష్ వ్యవహారంలో కోమటిరెడ్డి మాటలతో.. ఇప్పుడు తెలంగాణ రాజకీయం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
https://youtu.be/gqUlaD1F0WM