TDP RICHEST : దేశంలో ఈయనే పెద్ద క్యాష్ పార్టీ.. పెమ్మసానికి 6 వేల కోట్ల ఆస్తులు

ఏపీలో గుంటూరు లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్థి, NRI డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ దేశంలో రిచెస్ట్ కేండిడేట్ గా నిలిచారు..

ఏపీలో గుంటూరు లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్థి, NRI డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ దేశంలో రిచెస్ట్ కేండిడేట్ గా నిలిచారు.. రాజకీయ నాయకుడిగా మారిన ఈ NRI డాక్టర్ తన ఆస్తులను 5 వేల 7 వందల 85 కోట్లుగా డిక్లేర్ చేస్తూ అఫిడవిట్ ఇచ్చారు. ఇప్పటిదాకా దేశంలో అఫిడవిట్స్ సమర్పించిన లోక్ సభ అభ్యర్థుల్లో పెమ్మసానియే అత్యంత ధనవంతుడు.

గుంటూరు జిల్లాలోని బుర్రిపాలెం గ్రామానికి చెందిన పెమ్మసాని చంద్ర శేఖర్…. ఎమ్ సెట్ లో 27 వ ర్యాంక్ సాధించి ఉస్మానియాలో MBBS చేశారు. ఆ తర్వాత అమెరికాలో మాస్టర్స్ చేశారు. అక్కడ మెడికల్ లైసెన్స్ సాధించి డాక్టర్ వృత్తి చేపట్టారు. అక్కడ విద్యార్థులకు కోచింగ్ ఇచ్చే ఎడ్యు టెక్ కంపెనీ కూడా ఉంది. 2023-23 లో పెమ్మసానికి ఇండియా నుంచి 3 లక్షల 68 వేల ఆదాయం మాత్రమే వచ్చింది. చంద్రశేఖర్ కంపెనీలో ఆయన భార్య శ్రీరత్నకు 50శాతానికి పైగా వాటా ఉంది.

చంద్రశేఖర్ కి చరాస్తులు 5 వేల 5 వందల 99 కోట్లు ఉన్నాయి. స్థిరాస్తులు 187 కోట్ల రూపాయలు ఉన్నాయి. చంద్రశేఖర్ కార్లు లిస్ట్ చూస్తే మతి పోవాల్సిందే… రోల్స్ రాయ్స్ ఘోస్ట్, టెస్లా మోడల్ X, మెర్సిడెజ్ S క్లాస్ మేబాష్, మెర్సిడెస్ సీ క్లాస్… ఇవన్నీ అమెరికాలో రిజిస్టర్ అయిన కార్లు. ఇండియాలో మాత్రం టయోటా ఫార్చునర్ ఒక్కటే ఉంది.

2014 నుంచి గుంటూరు లోక్ సభ సీటుకు పోటీ చేయాలని పెమ్మసాని చంద్రశేఖర్ ఎదురు చూస్తున్నారు. ఈసారి సిట్టింగ్ ఎంపీ గల్లా జయదేవ్ పోటీ నుంచి తప్పుకోవడంతో పెమ్మసానికి అవకాశం దక్కింది.