బ్రేకింగ్: పట్నంకు షాక్ ఇచ్చిన హైకోర్ట్

లగచర్ల ఘటనలో బీఆర్ఎస్ మాజీ పట్నం నరేందర్ రెడ్డికి హైకోర్ట్ షాక్ ఇచ్చింది. పట్నం నరేందర్ రెడ్డి పిటిషన్ కొట్టేసింది హైకోర్ట్.

  • Written By:
  • Publish Date - December 4, 2024 / 11:52 AM IST

లగచర్ల ఘటనలో బీఆర్ఎస్ మాజీ పట్నం నరేందర్ రెడ్డికి హైకోర్ట్ షాక్ ఇచ్చింది. పట్నం నరేందర్ రెడ్డి పిటిషన్ కొట్టేసింది హైకోర్ట్. లగచర్ల ఘటన లో రీమాండ్ విధించడాన్ని సవాల్ చేసిన పట్నం నరేందర్ రెడ్డి.. రీమాండ్ ను క్వాష్ చేయాలనీ పిటిషన్ దాఖలు చేసారు. ప్రస్తుతం చర్లపల్లి జైల్లో ఉన్న పట్నం నరేందర్ రెడ్డి మరోవైపు బెయిల్ కోసం కూడా ప్రయత్నాలు చేస్తున్నారు.

పట్నం నరేందర్ రెడ్డి క్వాష్ పిటిషన్ కొట్టేస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది. జిల్లా కోర్టు పట్నం నరేందర్ రెడ్డి బెయిల్ ను పరిశీలించి తీర్పు ప్రకటించాలని హైకోర్టు ఈ సందర్భంగా ఆదేశించింది. లగచర్ల ఘటనకు సంబంధించి కీలకంగా భావిస్తున్న సురేష్ ఇప్పటికే పోలీసుల ముందు లొంగిపోయాడు.