ASSEMBLY ELECTIONS: అసెంబ్లీ ఎన్నికలకు భారీ బందోబస్తు.. ఖర్చు ఎన్ని కోట్లంటే..

ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చూడటం ప్రభుత్వం, ఈసీ బాధ్యత. అందువల్లే ఎలాంటి ఉద్రిక్తతలకు తావు లేకుండా.. భద్రతకు ఈసీ ప్రాధాన్యమిస్తుంది. తెలంగాణలో ఈ అసెంబ్లీ ఎన్నికల బందోబస్తు కోసం 375 కంపెనీలకు చెందిన కేంద్ర సాయుధ బలగాలు పని చేస్తున్నాయి.

  • Written By:
  • Publish Date - November 29, 2023 / 02:31 PM IST

ASSEMBLY ELECTIONS: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు మరికొన్ని గంటలే గడువుంది. ఈ నేపథ్యంలో ఎన్నికలకు రాష్ట్రవ్యాప్తంగా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసు శాఖ, ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహణ కొనసాగుతోంది. ఈ ఎన్నికల బందోబస్తు కోసం రూ.150 కోట్ల వరకు ఖర్చు కానున్నట్లు అంచనా. ఎంత ఖర్చైనప్పటికీ గట్టి భద్రత ఏర్పాటు చేయాలని ఈసీ నిర్ణయించింది. సహజంగానే ఎన్నికలంటే ఘర్షణ, ఉద్రిక్తతలతో కూడిన వాతావరణం ఉంటుంది.

JD Lakshminarayana: ఏపీలో జేడీ కొత్త పార్టీ ! పోటీ ఎక్కడి నుంచంటే.

శాంతి భద్రతల సమస్య ఉంటుంది. ఉగ్రవాదుల దాడుల్ని కొట్టిపారేయలేం. అందుకే ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చూడటం ప్రభుత్వం, ఈసీ బాధ్యత. అందువల్లే ఎలాంటి ఉద్రిక్తతలకు తావు లేకుండా.. భద్రతకు ఈసీ ప్రాధాన్యమిస్తుంది. తెలంగాణలో ఈ అసెంబ్లీ ఎన్నికల బందోబస్తు కోసం 375 కంపెనీలకు చెందిన కేంద్ర సాయుధ బలగాలు పని చేస్తున్నాయి. అలాగే రాష్ట్రానికి చెందిన దాదాపు 50 వేల మంది ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్నారు. భద్రతా సిబ్బందికి సంబంధించి చెల్లించాల్సిన అలవెన్సులు, రవాణా, ఆహారం వంటి సదుపాయాలు కల్పించాల్సి ఉంటుంది. దీని కోసం ఈ సారి రూ.150 కోట్లు ఖర్చవుతాయని అంచనా. వీటిని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది. గత ఎన్నికల సందర్భంగా రూ.100 కోట్లకుపైగా ఖర్చుకాగా.. ఈ సారి భద్రత కోసం రూ.150 కోట్లు ఖర్చవుతున్నాయి. తెలంగాణలో మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి.

వీటిలో సమస్యాత్మకమైనవిగా 106 నియోజకవర్గాలను గుర్తించారు. మొత్తం పోలింగ్ కేంద్రాలు 35,655. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద భద్రత కల్పించాల్సి ఉంటుంది. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన అక్టోబర్ 9 నుంచి భద్రతా బలగాలు విధుల్లో పాల్గొంటున్నాయి. తనిఖీల కోసం 373 ఫ్లైయింగ్ స్క్వాడ్‌లు, 374 స్టాటిక్ సర్వైలెన్స్ బృందాలు, 95 అంతరాష్ట్ర చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు.