VOTE FOR NOTES: డబ్బులే డబ్బులు.. తెలంగాణలో కట్టలు తెగుతున్న నోట్లు

తెలంగాణలో ఎన్నికల ప్రచారం పూర్తవగానే.. డబ్బులు, మందు పంపిణీ స్టార్ట్ అయింది. ఈసారి ఎన్నికలను బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఓట్లకు నోట్లలో తగ్గేదేలే అంటున్నారు. కొన్నిచోట్ల ప్రతి 100 మందికి ఒకరు చొప్పున తమ అనుచరులను పెట్టుకొని.. అభ్యర్థులు నోట్లు పంచుతున్నారు.

  • Written By:
  • Publish Date - November 29, 2023 / 05:46 PM IST

VOTE FOR NOTES: డబ్బులు.. డబ్బులు.. తెలంగాణలో ఎటు చూసినా డబ్బులే. ఎవరి దగ్గర చూసినా 5 వందల నోట్లే. దేశంలోనే అత్యంత ఖరీదైన ఎన్నికలు తెలంగాణలో జరుగుతున్నాయి. ఓటుకు రూ.2 వేల నుంచి 5 వేల రూపాయలు దాకా ఇస్తున్నారు అభ్యర్థులు. రాష్ట్రంలో 10 నియోజకవర్గాల్లో ఒక్కో అభ్యర్థి ఖర్చు వంద కోట్లకు పైగానే ఉంటోంది. ఖమ్మం జిల్లాలోనే ఓటుకు నోటు విలువ ఎక్కువగా ఉందని చెబుతున్నారు. కొన్నిచోట్లయితే ఓటర్ స్లిప్పులు ఇచ్చారు గానీ.. మరి నోట్లేవి అని రోడ్డుకెక్కిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. తెలంగాణలో ఎన్నికల ప్రచారం పూర్తవగానే.. డబ్బులు, మందు పంపిణీ స్టార్ట్ అయింది. ఈసారి ఎన్నికలను బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఓట్లకు నోట్లలో తగ్గేదేలే అంటున్నారు.

ASSEMBLY ELECTIONS: తెలంగాణ ఎన్నికలపై ఏపీలో బెట్టింగ్‌లు.. ఆ ఇద్దరి మీదే భారీగా పందేలు..

కొన్నిచోట్ల ప్రతి 100 మందికి ఒకరు చొప్పున తమ అనుచరులను పెట్టుకొని.. అభ్యర్థులు నోట్లు పంచుతున్నారు. ఇంకొన్ని చోట్ల కాలనీల వారీగా, కులాల వారీగా, సంఘాల వారీగా, గ్రూపుల వారీగా డబ్బులు పంపిణీ జరుగుతోంది. కొన్ని నియోజకవర్గాల్లో ఒక్కో అభ్యర్థి రూ.100 కోట్ల దాకా పంచుతున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో 10 మంది దాకా అభ్యర్థులు ఈ స్థాయిలోనే తమ నియోజకవర్గాల్లో డబ్బులు ఖర్చుపెడుతున్నారు. పాతిక నుంచి 30 నియోజవర్గాల్లో అయితే అన్ని పార్టీల అభ్యర్థులు కలసి రూ.100 నుంచి రూ.150 కోట్ల దాకా ఒక్కో నియోజకవర్గంలో ఖర్చు చేస్తున్నారు. అయితే ఎన్నికల ప్రచారం దగ్గర నుంచి ఓటర్లకు పంపిణీ దాకా ఇంత మొత్తంలో ఖర్చుపెట్టినట్టు తెలుస్తోంది. ఖమ్మం జిల్లాలో అత్యధికంగా ఓటుకు ఎక్కువ రేటు పలికినట్లు తెలుస్తోంది. ఓ నేత తన నియోజకవర్గంలో ఒక్క మండలంలోనే రూ.5 వేల దాకా పంచినట్టు తెలిసింది. మిగతా మండలాల్లో ఓటుకు రూ.3 వేల దాకా ఇచ్చినట్టు సమాచారం.

PAWAN KALYAN: ఏపీపై ఫోకస్ పెంచిన జనసేన.. డిసెంబర్ 1న జనసేన విస్తృత స్తాయి సమావేశం..

పాలేరులో ప్రధాన పార్టీలకు చెందిన ఇద్దరు నేతలూ బడా కాంట్రాక్టర్లు కావడం.. గెలిచి తీరాలన్న పట్టుదల ఉండటంతో అక్కడ డబ్బుల ప్రవాహం ఏరులై పారుతోంది. కొత్తగూడెం లాంటి చోట కమ్యూనిస్టులు కూడా కాంగ్రెస్ సహకారంతో ఓటుకు వెయ్యి రూపాయలు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. హైదరాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, వరంగల్ జిల్లాల్లో కొన్ని నియోజకవర్గాల్లో ఈ స్థాయిలోనే 5 నుంచి 3 వేల దాకా ఒక్కో ఓటర్‌కు ఖర్చుపెట్టినట్టు సమాచారం. మంచిర్యాలలో డబ్బులే కాదు మహిళా ఓటర్లకు చీరలు కూడా పంపిణీ చేస్తున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు తమ నియోజకవర్గాల్లో కనీసం లక్ష నుంచి 2 లక్షల మందికి డబ్బులు పంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అంటే తమ గెలుపును ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారన్నది అర్థమవుతోంది. కొన్ని నియోజకవర్గాల్లో ముందు రూ.3 వేల దాకా ఇచ్చి.. తర్వాత రెండోదఫా పోలింగ్ రోజున మరో వెయ్యి, రెండు వేలు ఇచ్చేలాగా ప్రిపేర్ చేసుకుంటున్నారు.

కేసీఆర్ పోటీ చేసే గజ్వేల్‌లోనూ ఒక్కొక్కరికి 3 వేల దాకా ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇటు మేడ్చల్, మల్కాజ్‌గిరి, ఉప్పల్ నియోజకవర్గాలతో పాటు జూబ్లీహిల్స్, ఎల్బీ నగర్‌లోనూ డబ్బులున్న అభ్యర్థులు బరిలో ఉండటంతో ధన ప్రవాహానికి అడ్డే లేకుండా పోతోంది. కొన్నిచోట్లయితే ఓ ప్రధాన పార్టీ గతంలో పంపిన డబ్బులు సరిపోకపోవడంతో అభ్యర్థులకి ఒక్కొక్కరికి మళ్లీ రూ.10 కోట్లు పంపినట్లు సమాచారం. పోలింగ్ టైమ్ ముగిసే చివరి నిమిషం దాకా ఓటర్లను ప్రభావితం చేయడంలో పార్టీలు బిజీ బీజీగా ఉన్నాయి. డబ్బుల ప్రవాహాన్ని అడ్డుకోడానికి ఎన్నికల కమిషన్ చేసిన ప్రయత్నాలేవీ ఫలించడం లేదు.