TELANGANA ASSEMBLY ELECTIONS: తెలంగాణలో హంగ్‌!? సంచలనం రేపుతున్న ఏబీపీ ఓటర్‌ సర్వే..

ఏబీపీ ఓటర్‌ సర్వే రిపోర్ట్‌ తెలంగాణలో రాజకీయాలను ఒక్కసారిగా షేక్‌ చేస్తోంది. ప్రతీ ఎన్నికల్లో దాదాపు పూర్తి స్థాయి ఖచ్చితత్వంలో రిపోర్ట్‌ ఇచ్చే ఏబీపీ ఓటర్‌ సర్వే.. ఈ సారి తెలంగాణలో హంగ్‌ వస్తుందని తేల్చింది. తెలంగాణలో మొత్తం 119 నియోజకవర్గాలు ఉన్నాయి.

  • Written By:
  • Publish Date - November 4, 2023 / 07:29 PM IST

TELANGANA ASSEMBLY ELECTIONS: తెలంగాణలో ఎలక్షన్‌ హీట్‌ రోజు రోజుకూ పెరిగిపోతోంది. రాజకీయ నాయకుల పార్టీ మార్పుతో ఎప్పుడు, ఏ పార్టీ లీడింగ్‌లో ఉందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. మొన్నటి వరకూ బీఆర్‌ఎస్‌కు స్పస్టమైన గెలుపు సంకేతాలు కనిపించినా.. అనూహ్యంగా కాంగ్రెస్‌ పార్టీ పుంజుకుంది. ఈ క్రమంలో ఏబీపీ ఓటర్‌ సర్వే రిపోర్ట్‌ తెలంగాణలో రాజకీయాలను ఒక్కసారిగా షేక్‌ చేస్తోంది. ప్రతీ ఎన్నికల్లో దాదాపు పూర్తి స్థాయి ఖచ్చితత్వంలో రిపోర్ట్‌ ఇచ్చే ఏబీపీ ఓటర్‌ సర్వే.. ఈ సారి తెలంగాణలో హంగ్‌ వస్తుందని తేల్చింది.

తెలంగాణలో మొత్తం 119 నియోజకవర్గాలు ఉన్నాయి. స్పష్టమైన అధిక్యత వచ్చి అధికారాన్ని చేజిక్కించుకోవాలంటే 61 సీట్లు కావాల్సి ఉంటుంది. కానీ ఏబీపీ నిర్వహించిన సర్వేలో కాంగ్రెస్‌ భారీగా సీట్లు గెలుచుకునే అవకాశం ఉన్నట్టు తెలిసింది. ఏబీపీ సర్వే ప్రకారం బీఆర్‌ఎస్‌ పార్టీకి 49 నుంచి 61 సీట్లు వచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్‌ పార్టీకి 43 నుంచి 55 సీట్లు వచ్చే అవకాశముంది. ఇక బీజేపీకి 5 నుంచి 11 సీట్లు, ఎంఐఎం పార్టీకి 6 నుంచి 8 సీట్లు వచ్చే చాన్స్‌ ఉంది. మొత్తంగా ఏబీపీ ఇచ్చిన రిపోర్ట్‌ ప్రకారం ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యత వచ్చే చాన్స్‌ లేదు. ఎంఐఎం పార్టీ బీఆర్‌ఎస్‌తో ఉంది కాబట్టి ఆ పార్టీ సీట్లు కొన్ని పెరిగే చాన్స్‌ ఉంది. కానీ కాంగ్రెస్‌ పార్టీ మాత్రం రోజు రోజుకూ బలం పెంచుకుంటూ ముందుకు వెళుతోంది. కాంగ్రెస్‌ పార్టీని కంట్రోల్‌ చేసేందుకు బీఆర్‌ఎస్‌ చేస్తున్న వ్యూహాలు పెద్దగా పని చేయడంలేదని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.

ఇవన్నీ చూస్తే ఖచ్చితంగా తెలంగాణలో హంగ్‌ వచ్చే అవకాశముందంటున్నారు. ప్రస్తుతం తెలంగాణలో ఉన్న మూడు ప్రధాన పార్టీలు ఒకరితో ఒకరు కలిసే పరిస్థితి లేదు. రెండు పార్టీలు కలవకపోతే ప్రభుత్వం ఏర్పాటు చేసే బలం ఏ పార్టీకి కనిపించడంలేదు. దీంతో తెలంగాణలో అధికారం ఎవరిది అనే విషయం తెలియాలంటే కౌంటింగ్‌ పూర్తయ్యే వరకూ ఆగాల్సిందే.