జితేందర్ రెడ్డి టార్గెట్‌గా విమర్శలు గుప్పించారు. తెలంగాణలో బీజేపీ నాయకత్వంపై మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఓ వివాదాస్పద ట్వీట్ చేశారు. రాష్ట్ర బీజేపీ నాయకత్వానికి ఇలాంటి ట్రీట్ మెంట్ అవసరమంటూ దున్నపోతును తన్నే వీడియోను పోస్ట్ చేశారు. ఈ ట్వీట్‌ను అమిత్ షా, బీఎల్ సంతోష్‌కు ట్యాగ్ చేశారు. ఈ ట్వీట్ మీదే ఈటల స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయ్యారు. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలని.. వయసు పెరిగే కొద్దీ అనుభవం వచ్చిన తర్వాత ఏది పడితే అది చేయడం మంచిది కాదని.. ఎవరి గౌరవానికి, స్వేచ్చకు భంగం కలిగే విధంగా వ్యవహరించకూడదని.. ఆ ట్వీట్ కు అర్ధం ఏంటో ఆయనే చెప్పాలంటూ సెటైర్లు వేశారు ఈటల.
తెలంగాణ బీజేపీలో నేతల మధ్య కొంతకాలంగా విబేధాలు కంటిన్యూ అవుతున్నాయ్. ముఖ్యంగా రాష్ట్ర నాయకత్వం తీరుపై కొందరు అలకతో ఉన్నారని.. దీంతో పార్టీ మారాలనే ఆలోచనలో ఉన్నారనే చర్చ నడిచింది. ఐతే రంగంలోకి దిగిన అధిష్టానం చర్యలకు దిగిందని.. సమస్యల పరిష్కారం దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టిందని తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల మధ్య జితేందర్ రెడ్డి ట్వీట్ చేయడం.. దానికి ఈటల కౌంటర్ ఇవ్వడం.. రాజకీయంగా సెగలు పుట్టిస్తోంది. తెలంగాణ బీజేపీలో భారీ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని.. ఏదో ఒకరోజు లావాలా బ్లాస్ అయ్యే చాన్స్ ఉంటుందనే అంచనాలు వినిపిస్తున్నాయ్.