నో డౌట్ అవి కూల్చేస్తాం: రంగనాథ్ క్లారిటీ

కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ క్లారిటీ ఇచ్చారు. హైడ్రా రాక ముందు అనుమతి ఇచ్చిన ఏ కట్టడాలనూ హైడ్రా కూల్చదన్నారు. అనుమతి లేకుండా కట్టిన నివాస గృహాలు జూలై 2024 కి సిద్ధమై, వాటిలో నివాసం ఉంటే హైడ్రా కూల్చదని స్పష్టం చేసారు.

  • Written By:
  • Publish Date - December 18, 2024 / 08:15 PM IST

కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ క్లారిటీ ఇచ్చారు. హైడ్రా రాక ముందు అనుమతి ఇచ్చిన ఏ కట్టడాలనూ హైడ్రా కూల్చదన్నారు. అనుమతి లేకుండా కట్టిన నివాస గృహాలు జూలై 2024 కి సిద్ధమై, వాటిలో నివాసం ఉంటే హైడ్రా కూల్చదని స్పష్టం చేసారు. అనుమతులు లేకుండా కట్టిన వాణిజ్య, వ్యాపార కట్టడాలను మాత్రం ఎప్పుడు కట్టినా FTLలో ఉంటే కూల్చడం జరుగుతుందన్నారు. గతంలో అనుమతులు ఇచ్చి.. తరువాత వాటిని రద్దు చేస్తే.. ఆ కట్టడాలు అక్రమ కట్టడాలు అవుతాయన్నారు.

అవి నివాసాలు అయినా సరే.. జులై తరువాత నిర్మాణం జరుగుతుంటే వాటిని అక్రమ కట్టడాలుగా పరిగణించి కూల్చడం జరుగుతుందన్నారు. పేదలను ముందు పెట్టి.. వెనుకనుండి చక్రం తిప్పుతున్న ల్యాండ్ గ్రాబర్స్ చర్యలను హైడ్రా తీవ్రంగా పరిగణిస్తుందని హెచ్చరించారు. చింతల చెరువు, గాజులరామారం, మాదాపూర్ లోని సున్నం చెరువులో కూల్చివేతలు ఈ కేటగిరీలోకి వస్తాయన్నారు. కోర్టు ఉత్తర్వులుంటే ఎలాంటి కట్టడాలైనా కూల్చడం జరుగుతుందన్నారు. నిజాంపేట్ లోని ఎర్రకుంటలో నిర్మాణంలో ఉన్న అపార్ట్మెంట్స్ కూల్చివేత దీని కిందకే వస్తుంది అన్నారు. హైడ్రా ఆవిర్భావం తర్వాత అనుమతి ఇచ్చి ఉన్నా, లేకున్నా FTL లో వుంటే కూల్చడం జరుగుతుందని స్పష్టం చేసారు. అనుమతులు ఇచ్చిన అధికారులను కూడా బాధ్యులను చేయటం జరుగతుందన్నారు.