Smita Sabharwal: టైం బ్యాడ్‌.. లండన్‌ అధికారులతో అమ్రాపాలి.. క్విజ్‌ పోటీలకు గెస్ట్‌గా స్మిత..

ఇరిగేషన్‌ శాఖలో కీలక బాధ్యతలు చేపట్టినప్పటికీ.. సీఎంవో సెక్రెటరీగానే స్మిత సబర్వాల్‌కు ఎక్కువ పేరుంది. కేసీఆర్‌కు చాలా దగ్గరి మనిషి అనే వాదన కూడా ఉంది. ఆ అధికారాన్ని అడ్డు పెట్టుకుని చాలా పనులు తన స్వార్థానికి చేయించుకుంది అనే అపవాదు, ఆరోపణలు కూడా ఉన్నాయి.

  • Written By:
  • Publish Date - January 19, 2024 / 06:13 PM IST

Smita Sabharwal: ఎన్నికల్లో ప్రభుత్వాలు మారిపోతే రాజకీయ నాయకుల తలరాతలు మారిపోతుంటాయి. ఇది ప్రతీ రాష్ట్రంలో జరిగేదే. కానీ కొన్నిసార్లు పొలిటీషియన్స్‌కే కాకుండా.. అధికారుల జీవితాలు కూడా తలకిందులు అవుతుంటాయి. ఐఏఎస్‌ అధికారిని స్మిత సబర్వాల్‌ ఇందుకు బెస్ట్‌ ఎగ్జాంపుల్‌. తెలంగాణలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు స్మిత రేంజ్‌ వేరు. ఏ పని కావాలన్నా మేడం డైరెక్ట్‌ రిపోర్టింగ్‌ టు సీఎం కేసీఆర్‌. ఇరిగేషన్‌ శాఖలో కీలక బాధ్యతలు చేపట్టినప్పటికీ.. సీఎంవో సెక్రెటరీగానే స్మిత సబర్వాల్‌కు ఎక్కువ పేరుంది. కేసీఆర్‌కు చాలా దగ్గరి మనిషి అనే వాదన కూడా ఉంది. ఆ అధికారాన్ని అడ్డు పెట్టుకుని చాలా పనులు తన స్వార్థానికి చేయించుకుంది అనే అపవాదు, ఆరోపణలు కూడా ఉన్నాయి.

Amrapali Kata: మేడం రేంజ్‌ మారిపోయింది.. సీఎంతో కలిసి లండన్‌లో అధికారులతో అమ్రాపాలి భేటి..

ఒక అధికారిని మీద ఇన్ని ఉన్నాక తరువాత కొత్త ప్రభుత్వంలో కొత్త మంత్రులు, ముఖ్యమంత్రి ఊరుకుంటారా..? అసలే అధికారానికి పదేళ్లు దూరంగా ఉన్నారు. ఇప్పుడు గెలిచి కేసీఆర్‌ను ఇక రాజకీయంగా అంతం చేయాలనే కసితో ఉన్నారు. ఆయనకు సహాయ సహకారాలందించిన అధికారులను మాత్రం ఎందుకు వదిలి పెడతారు. అందుకే అనుకుంటా.. రేవంత్‌ సీఎంగా కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత స్మితను ఆర్థిక శాఖలోని ఎలాంటి ప్రాధాన్యం లేని ఓ పోస్ట్‌లో నియమించారు. నిజానికి ఓ ఐఏఎస్‌ అధికారి పని చేయాల్సిన స్థానం కాదది. కానీ స్మితను అక్కడే నియమించారు. అయితే ఇక్కడ విషయం స్మితా సబర్వాల్‌ ఉద్యోగం గురించి కాదు. రీసెంట్‌గా జరిగిన ఓ ఇన్సిడెంట్‌ గురించి. మూసీ రివర్‌ డెవలప్‌మెంట్‌ గ్రౌండ్‌ వర్క్‌లో భాగంగా ఆ బోర్డ్‌ మేనేజర్‌ ఐఏఎస్‌ అమ్రాపాలి లండన్‌ వెళ్లారు. సీఎం రేవంత్‌తో కలిసి లండన్‌ అధికారులతో భేటీ అయ్యారు. అదే సమయంతో స్మిత.. హైదరాబాద్‌లోని ఓ స్కూల్‌లో నిర్వహించిన క్విజ్‌ పోటీలకు గెస్ట్‌గా వెళ్లారు. దీంతో.. ఒక్క ఎలక్షన్‌తో జీవితాలు ఎలా మారిపోయాయంటూ సోషల్‌ మీడియాలో అంతా చర్చించుకుంటున్నారు.

బీఆర్ఎస్‌ ప్రభుత్వంలో అమ్రాపాలికి అంతగా గుర్తింపు లేదు. ఆమె వరంగల్‌ కలెక్టర్‌గా ఉన్న సమయంలో ఓ అభివృద్ధి పనిలో జాప్యం కారణంగా అందరి ముందూ కేటీఆర్‌ అమ్రాపాలికి క్లాస్‌ తీసుకున్నారు. అప్పట్లో దీనిపై చిన్న డిబేట్‌ కూడా నడిచింది. ఈ ఇన్సిడెంట్‌ తరువాత అమ్రాపాలి పెళ్లి చేసుకుని కేంద్ర సర్వీసులకు ఢిల్లీ వెళ్లిపోయారు. అదే సమయంలో సీఎంవో సెక్రెటరీగా ఉన్న స్మిత ఓ రేంజ్‌ పాలన కొనసాగిస్తున్నారు. కట్‌ చేస్తే ఐదేళ్లలో ప్రభుత్వం మారిపోయింది. ఒకప్పుడు సీఎంవోను రూల్‌ చేసిన స్మిత.. ఇప్పుడు క్విజ్‌ పోటీలకు అంకితమయ్యారు. కేటీఆర్‌తో మాటలు తిన్న అమ్రాపాలి ఇప్పుడు ఇదే తెలంగాణ ప్రభుత్వం తరఫున విదేశాల్లో భేటీలు నిర్విహిస్తున్నారు. దీంతో.. ఎలా ఉండేవాళ్లు ఎలా ఐపోయారు మేడం అంటూ బాధపడుతున్నారు స్మితా సబర్వాల్‌ ఫ్యాన్స్‌. ఓడలు బళ్లు.. బళ్లు ఓడలు అవుతాయంటే ఇదేనేమో అనుకుంటూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారు నెటిజన్లు.