తెలంగాణాలోనే ఉంటాం ప్లీజ్: కేంద్రానికి ఐఏఎస్ లు

2015లో ను కేటాయింపుల పై క్యాట్‌ను ఆశ్రయించారు అధికారులు. తెలంగాణలోనే కొనసాగించడానికి అవకాశం ఇవ్వాలని కేంద్రాన్ని క్యాట్ ఆదేశించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ 2017లో తెలంగాణ హైకోర్టులో కేంద్రం రిట్‌ పిటిషన్‌ దాఖలు చేయగా దీనిపై ఈ ఏడాది జనవరి 3న హైకోర్టు తీర్పు వెల్లడించింది.

  • Written By:
  • Publish Date - October 14, 2024 / 06:42 PM IST

2015లో ను కేటాయింపుల పై క్యాట్‌ను ఆశ్రయించారు అధికారులు. తెలంగాణలోనే కొనసాగించడానికి అవకాశం ఇవ్వాలని కేంద్రాన్ని క్యాట్ ఆదేశించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ 2017లో తెలంగాణ హైకోర్టులో కేంద్రం రిట్‌ పిటిషన్‌ దాఖలు చేయగా దీనిపై ఈ ఏడాది జనవరి 3న హైకోర్టు తీర్పు వెల్లడించింది. ప్రత్యూష్ సిన్హా కమిటీ మార్గదర్శకాలను తప్పకుండా పాటించాలని ధర్మాసనం ఆదేశించింది.

కమిటీ సిఫారస్సులకు అనుగుణంగా ఐఏఎ్‌సల దరఖాస్తులను పునఃపరిశీలించాలని కోర్టు . ఆదేశించింది. మరోసారి వ్యక్తిగతంగా వినతులు వినడానికి అవకాశం ఇవ్వాలని పేర్కొంది. హైకోర్టు ఆదేశాలతో కేంద్రం డీవోపీటీ మాజీ కార్యదర్శి దీపక్‌ ఖండేల్కర్‌ నేతృత్వంలో ఈ ఏడాది మార్చి 21న కమిటీ వేయగా తెలంగాణలోనే కొనసాగాలని నిర్ణయించుకుంటున్న అధికారుల నుంచి విజ్ఙప్తులను పంపించాలని డీవోపీటీ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది.

గత జూన్‌లో ఖండేల్కర్‌ ముందు హాజరై.. కేడర్‌ కేటాయింపులో హేతుబద్ధత లేద ని, తమ వాదనలు డీవోపీటీ వినలేదని, విభజన మార్గదర్శకాలు సరిగ్గా లేవని, తెలంగాణలోనే కొనసాగించాలని అధికారులు కోరారు. ప్రత్యూష్‌ సిన్హా కమిటీ మార్గదర్శకాలను పరిశీలించిన ఖండేల్కర్‌ కమిటీ.. విజ్ఙప్తులను తోసిపుచ్చింది. ఖండేల్కర్‌ నివేదికను ఆమోదిస్తూ డీవోపీటీ నిర్ణయం తీసుకుంది.

ఈ నేపధ్యంలో కేంద్ర పరిపాలన ట్రెబ్యూనల్ ను ఆశ్రయించిన ఐఏఎస్ ల… క్యాట్ లో పిటీషన్లు దాఖలు చేసారు. దాఖలు చేసిన వారిలో వాకాటి కరుణ, వాణి ప్రసాద్, ఆమ్రపాలి, సృజన ఉన్నారు. డిఓపిటి ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని పిటిషన్ లో ఐఏఎస్ లు కోరగా తెలంగాణలోనే కొనసాగేలా మద్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని పిటీషన్ లో విజ్ఞప్తి చేసారు. వేరువేరుగా నలుగురు ఐఏఎస్ లు పిటీషన్ లు దాఖలు చేసారు. రేపు ఈ పిటిషన్లపై కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ విచారణ చేపట్టనుంది.