NEGGEDEVARU- HINDUPUR : బాలయ్య హ్యాట్రిక్ కొట్టేనా… హిందూపురంలో నెగ్గేదెవరు ?

ఏపీలో ఆసక్తి రేపుతున్న నియోజకవర్గాల్లో హిందూపురం ఒకటి. బాలయ్య హ్యాట్రిక్‌కు బ్రేక్‌ వేయాలని వైసీపీ పట్టు మీద కనిపించింది. మరి హిందూపురంలో బాలకృష్ణ పరిస్థితి ఏంటి? ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్‌గా మారింది.

ఏపీలో ఆసక్తి రేపుతున్న నియోజకవర్గాల్లో హిందూపురం ఒకటి. బాలయ్య హ్యాట్రిక్‌కు బ్రేక్‌ వేయాలని వైసీపీ పట్టు మీద కనిపించింది. మరి హిందూపురంలో బాలకృష్ణ పరిస్థితి ఏంటి? ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్‌గా మారింది. పోలింగ్ జరిగిన సరళి చూసిన తర్వాత బాలకృష్ణ ఈసారి హ్యాట్రిక్ కొడతారా? లేదంటే మొదటిసారి పరాజయాన్ని మూటగట్టుకుంటారా ? రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం ఇదే అంశంపై చర్చ. అసలు బాలయ్య పాజిటివ్ పాయింట్స్ ఏంటి…? నెగిటివ్ పాయింట్స్ ఏంటి.. నెగ్గేదెవరు స్పెషల్‌లో చూడండి..

అసెంబ్లీ ఎన్నికల ముగిశాయ్‌. ఫలితాలు ఎలా ఉండబోతున్నాయన్న దానిపై.. టెన్షన్‌ పీక్స్‌కు చేరింది రాష్ట్రవ్యాప్తంగా. రాష్ట్రంలో 175నియోజకవర్గాలు ఉన్నా.. కొన్ని స్థానాలపై మాత్రం స్పెషల్ ఫోకస్ ఉంది. అలాంటి నియోజకవర్గాల్లో ఒకటి హిందూపురం. హిందూపురం ప్రత్యేకంగా మారడానికి.. రెండు కారణాలు ఉన్నాయ్. ఒకటి పార్టీ ఆవిర్భావం నుంచి… ఆ నియోజకవర్గంలో టీడీపీకి ఓటమి అన్నదే లేదు. మరో కారణం అక్కడ నందమూరి బాలకృష్ణ… ముచ్చటగా మూడోసారి పోటీ చేయడం. టీడీపీ పుట్టినప్పటి నుంచి హిందూపురం.. ఆ పార్టీకి కంచుకోటగా మారింది. ఇప్పటి వరకు… మరోపార్టీ గెలుపు దరిదాపులకు కూడా రాలేదు. ఎన్టీఆర్, హరికృష్ణ ఇక్కడ నుంచి గెలిచి అసెంబ్లీకి వెళ్లారు.

ఇక బాలయ్య రాజకీయ అరంగేట్రం కూడా హిందూపురం నుంచే జరిగింది. ఇక్కడి నుంచి వరుసగా రెండుసార్లు గెలిచి అసెంబ్లీలో ఇప్పుడు ముచ్చటగా మూడోసారి విజయం సాధించాలన్న పట్టుదలతో హిందూపురం నియోజకవర్గం నుంచి బరిలో దిగారు బాలయ్య. హిందూపురంలో అభ్యర్థి ఎవరన్నది ఇక్కడ జనాలు చూడరు. టీడీపీ జెండా కనబడితే చాలు అన్న అభిప్రాయం స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. ఐతే ఈసారి మాత్రం అలాంటి పరిస్థితి లేదన్న టాక్ నడుస్తోంది. గతంలో ఎప్పుడూ లేనివిధంగా బాలకృష్ణ తీవ్రమైన పోటీ ఎదుర్కొన్నారు. వైసీపీ మాత్రం పక్కగా గురిపెట్టి ఈ స్థానంపై విజయం సాధించాలని టార్గెట్ పెట్టుకుంది. అందుకే సామాజికవర్గ సమీకరణాల్లో భాగంగా దీపికను ఇక్కడ నుంచి రంగంలోకి దింపింది. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు మొదటి నుంచి హిందూపురం పట్టణం ప్రధాన బలంగా ఉంది. లేపాక్షి, చిలమత్తూరు ప్రాంతాల్లోనూ ఆయనకు మంచి గ్రిప్ ఉంది. అయితే ఈసారి హిందూపురం పట్టణంలో పరిస్థితి ఎవరికీ మొగ్గు చూపిందో అర్థం కాని పరిస్థితి. 2024 ఎన్నికలు జరిగిన తీరు చూస్తే ఇది క్లియర్‌గా అర్థమవుతోంది. ఎమ్మెల్యే బాలకృష్ణకు ప్రధానమైన బలం… సినీ గ్లామర్‌తో పాటు హిందూపురం కంచుకోట కావడమే.

గతంలో ఉన్న నేతల కంటే… బాలకృష్ణ కొంత మేర అభివృద్ధి కూడా చేసినట్లు జనాలు చెప్తున్నారు. ఐతే చుట్టపు చూపుగా మూడు నెలలకు ఓసారి నియోజకవర్గంలో కనిపిస్తుంటారని వైసీపీ నేతల ప్రధాన ఆరోపణ. వైసీపీ విషయానికి వస్తే కురుబ దీపిక… కొత్త అభ్యర్థి అయినా ఆమె భర్త పార్టీలో కీలకంగా ఉన్నారు. గతంలో హిందూపురం వైసీపీలో చాలా వరకు విభేదాలు ఉన్నాయ్‌. ఈసారి మాత్రం ఈ స్థానంపై వైసీపీ స్పెషల్‌ ఫోకస్‌ పెట్టింది. ఇందులో భాగంగా నేతల మధ్య విభేదాలను సెట్ చేసింది. మంత్రి పెద్దిరెడ్డి స్వయంగా రంగంలోకి దిగి.. పక్కా ప్రణాళికలతో ఎన్నికలకు వెళ్లారు. మరోవైపు హిందూపురంలో మైనార్టీల ఓట్లతోపాటు రెడ్డి సామాజికవర్గ ఓట్లు ఎక్కువ. రెడ్డి సామాజికవర్గం ఎటు చూసినా వైసీపీకి ఫేవర్‌గా ఉంటుంది. ఇక మైనారిటీలు మాత్రం గతంలో బాలకృష్ణ వైపు ఎక్కువగా ఉండేవారు. కానీ ఈసారి అలాంటి పరిస్థితి కనిపించలేదని వైసీపీ నేతలు అంటున్నారు.

హిందూపురంలో 2009లో 69.63 శాతం, 2014లో 76.57 శాతం, 2019లో 77.64 శాతం పోలింగ్‌ నమోదైంది. ఈసారి పోలింగ్ శాతం భారీగా పెరిగింది. నియోజకవర్గంలో రెండు లక్షల 49వేల 174 మంది ఓటర్లు ఉంటే… లక్షా 93వేల 906 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 2014లో బాలకృష్ణ 16వేల 196 ఓట్ల మెజార్టీతో గెలిచారు. 2019 ఎన్నికల్లో 18వేల 28 ఓట్ల తేడాతో ఇక్బాల్‌ను ఓడించారు. అంటే బాలకృష్ణ గ్రాఫ్ ప్రతీసారి పెరుగుతోంది. దీనికి ప్రధానమైన కారణం హిందూపురం పట్టణంలో ఓటర్లు. ఈసారి మాత్రం మైనార్టీలు వైసీపీ వైపు మొగ్గు చూపినట్లు స్పష్టంగా అర్థం అవుతోంది. ఇక చిలమత్తూరు లేపాక్షి మండలాల్లో మాత్రం బాలకృష్ణకు కొంత ఫేవర్ గా ఉన్నట్లు తెలుస్తోంది.

హిందూపురం రూరల్‌ మండలంలోని ఓటర్లు.. ఇటు వైసీపీ, అటు టీడీపీ వైపు మొగ్గు చూపారనే ప్రచారం జరుగుతోంది. టీడీపీ మాత్రం బాలకృష్ణ ఈసారి హ్యాట్రిక్ కొట్టబోతున్నారని ధీమాగా ఉంది. ఇక్కడ గెలుపు అంత ఈజీగా ఉండే అవకాశం లేదని విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు. ఏం జరుగుతుందో తెలియాలంటే… జూన్‌ 4వరకు ఆగాల్సిందే..