BARRELAKKA: బర్రెలక్క గెలిస్తే ఎఫెక్ట్ ఎలా ఉండబోతోంది..? సంచలనం సృష్టిస్తుందా..?

ఐతే తనకు ఎలాంటి ఆలోచన వచ్చిందో, ఏమో తెలియదు కానీ, ఎలాగైనా నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయ్యి తనలాంటి వారిని ఎంతోమందిని ఉత్తేజపరచాలని కోరిక పుట్టింది. కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఈసారి ఎన్నికల్లో నామినేషన్ వేసింది.

  • Written By:
  • Updated On - November 26, 2023 / 07:26 PM IST

BARRELAKKA: తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా బర్రెలక్క పేరే వినిపిస్తోంది. ఒక పేద కుటుంబం నుంచి వచ్చిన బర్రెలక్క అలియాస్ శిరీష.. స్టార్‌గా మారిపోయింది. ఎక్కడో మారుమూలన ఉండే ఈమె సోషల్ మీడియా ద్వారా ఎంతో ఫేమస్ అయింది. ఎన్ని డిగ్రీలు చదివినా జాబులు రాకపోవడంతో ఇలా బర్రెలు కాచుకొని బతుకుతున్నాను అంటూ ఒక వీడియో పెట్టి సోషల్ మీడియాలో ఓవర్ నైట్‌లో స్టార్ అయిపోయింది. దీంతో శిరీష కాస్త బర్రెలక్కగా మారిపోయింది.

PM MODI: ఫాంహౌజ్‌కే పరిమితమయ్యే సీఎం అవసరమా..? బీజేపీతోనే సామాజిక న్యాయం సాధ్యం: ప్రధాని మోదీ

ఐతే తనకు ఎలాంటి ఆలోచన వచ్చిందో, ఏమో తెలియదు కానీ, ఎలాగైనా నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయ్యి తనలాంటి వారిని ఎంతోమందిని ఉత్తేజపరచాలని కోరిక పుట్టింది. కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఈసారి ఎన్నికల్లో నామినేషన్ వేసింది. నామినేషన్ వేసిన తర్వాత ఆమెను చాలామంది అవహేళన చేస్తూ చూశారని తెలుస్తోంది. బర్రెలక్క ఏంటి.. నామినేషన్ వేయడం ఏంటి.. కనీసం వంద ఓట్లైనా వస్తాయా అని అందరూ చాలామంది ఏడిపించారు కూడా. ఐతే అవే నోర్లు వారం రోజుల్లో మారిపోయాయ్. ఆ రేంజ్ ఫాలోయింగ్ వచ్చేసింది మరి. నామినేషన్ వేసిన వారానికే.. ఆమె ప్రచారంలో దూసుకుపోయింది. చాలామంది ఇతర నియోజకవర్గాల జనాలు కూడా ఈమె దగ్గరికి వచ్చి.. ఎన్నికల ప్రచారానికి తమ దగ్గర ఉన్న ఎంతో కొంత డబ్బుని విరాళంగా ఇస్తున్నారు.

ఎన్ఆర్ఐలు, ఇతర రాష్ట్రాల వాళ్లు కూడా ఈమె ధైర్యానికి హ్యాట్సాఫ్ చెప్తున్నారు. అలా చాలామంది ఈమెకు సపోర్ట్ చేస్తూ ఓటు వేయాలి.. ఆమెను గెలిపించాలి.. అని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. బర్రెలక్క కొల్లాపూర్ నియోజక వర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా గెలిస్తే మాత్రం మిగిలిన 118 నియోజకవర్గాల్లో ఎఫెక్ట్ పడుతుంది అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక్కడ బర్రెలక్క గెలిస్తే మిగిలిన 118 నియోజకవర్గాల్లో మండలానికి ఒక బర్రెలక్క పుట్టుకొస్తారు. దీంతో చదువుకున్న వారిలో మార్పు వస్తుందనే చర్చ సోషల్ మీడియా వేదికగా సాగుతోంది.