జగన్ దమ్ముంటే పిల్లల మీద ప్రమాణం చెయ్: షర్మిల

అదాని వ్యవహారంలో వైఎస్ జగన్ తప్పు చేయకపోతే ఆయన పిల్లలపై ప్రమాణం చేయాలని... ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్ చేసారు. ఏపీ గవర్నర్ ను కలిసిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ..

  • Written By:
  • Publish Date - November 27, 2024 / 05:37 PM IST

అదాని వ్యవహారంలో వైఎస్ జగన్ తప్పు చేయకపోతే ఆయన పిల్లలపై ప్రమాణం చేయాలని… ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్ చేసారు. ఏపీ గవర్నర్ ను కలిసిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ… జగన్ మధ్య అవినీతి డీల్ మీద గవర్నర్ కి ఫిర్యాదు చేసామని… ఈ డీల్ వల్ల ఆంధ్రకు తీవ్ర నష్టం జరుగుతుందని… ఈ డీల్ ను రద్దు చేయాలని కోరినట్టు… దర్యాప్తు జరిపించాలని కోరామని తెలిపారు.

అమెరికా ద్వారా ముడుపుల వ్యవహారం ప్రపంచానికి తెలిసిందన్న ఆమె ఇది సిగ్గుచేటన్నారు. అంతర్జాతీయ స్థాయిలో మన పరువు పోయిందన్న ఆమె వీళ్ళ అవినీతి గురించి ప్రపంచం చర్చ చేస్తుందని వ్యాఖ్యలు చేసారు. అదానీ దేశం పరువు తీశాడన్న షర్మిల జగన్ రాష్ట్రం పరువు తీశాడని మండిపడ్డారు. అమెరికాలో చర్యలకు అక్కడ కోర్టులు సిద్ధం అయ్యాయన్నారు. అరెస్టు లకు సిద్ధం అవుతున్నారన్నారు.

జగన్ ముడుపులు తీసుకున్నాడు అని అన్ని ఆధారాలు ఉన్నాయన్న షర్మిల… అదానీ తో నేరుగా ముడుపులు మాట్లాడుకున్నారు అని ఆధారాలు ఉన్నాయని వ్యాఖ్యలు చేసారు. అదానీ కలిసిన వెంటనే సోలార్ విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు జరిగాయన్నారు. లంచాల కోసమే జగన్ ఆ ఒప్పందాలకు సంతకాలు పెట్టారు… జగన్ అవినీతి పరుడు కాకపోతే బిడ్డల మీద ప్రమాణం చేయండి అని షర్మిల డిమాండ్ చేసారు.