Konaipalli Venkanna : కోనాయిపల్లి వెంకన్న ఎందుకు అంత ఫేమస్..?

తెలంగాణలో ఎన్నికల డంఖా మోగితే చాలు.. సీఎం కేసీఆర్ తన నామినేషన్ పత్రాలను వెంకన్న చెంతకు తీసుకెళ్తారు. ఆ స్వామికి ప్రత్యేక పూజలు చేసిన తర్వాతే నామినేషన్ పనులు ప్రారంభిస్తారు. వెంకన్న అంటే సీమ తిరుమల, ఆంధ్రా వాడపల్లి కాదు.. తెలంగాణ కోనాయిపల్లి వేంకటేశ్వరస్వామి. శ్రీనివాసుడు ఎక్కడైనా శ్రీనివాసుడే కానీ సీఎం కేసీఆర్ కు మాత్రం కోనాయిపల్లి వేంకటేశుడంటే చాలా స్పెషల్.

తెలంగాణ ( Telangana election ) లో ఎన్నికల డంఖా మోగితే చాలు.. సీఎం కేసీఆర్ ( CM KCR ) తన నామినేషన్ పత్రాలను వెంకన్న చెంతకు తీసుకెళ్తారు. ఆ స్వామికి ప్రత్యేక పూజలు చేసిన తర్వాతే నామినేషన్ పనులు ప్రారంభిస్తారు. వెంకన్న అంటే సీమ తిరుమల, ఆంధ్రా వాడపల్లి కాదు.. తెలంగాణ కోనాయిపల్లి వేంకటేశ్వరస్వామి. ( Konaipalli Venkanna ) శ్రీనివాసుడు ఎక్కడైనా శ్రీనివాసుడే కానీ సీఎం కేసీఆర్ కు మాత్రం కోనాయిపల్లి వేంకటేశుడంటే చాలా స్పెషల్.

34 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో.. ఎన్నో ఒడిదుడుకులను, మరెన్నో చారిత్రాత్మకం మలుపులు. ఏమైనా ఓ తిరుగులేని నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు సీఎం కేసీఆర్. ఎన్ని అడ్డంకులు ఎదురైనా కోనాయిపల్లి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో వాటినన్నింటిని తట్టుకుని నిలబడ్డానని నమ్మకం ఆయనది. టీఆర్ఎస్ పార్టీని స్థాపించడం మొదలుకుని బంగారు తెలంగాణ సాధించడం వరకు కేసీఆర్ అదే సెంటిమెంట్‌ని ఫాలో అవుతున్నారు. ఇక్కడి వేంకటేశ్వరాలయంలో పూజలు చేస్తే శుభం జరుగుతుందని నమ్మే కేసీఆర్‌.. ఎన్నికలొచ్చిన ప్రతిసారీ స్వామివారి పాదాల చెంత నామినేషన్‌ పత్రాలు ఉంచి ప్రత్యేక పూజలు చేయడం ఆనవాయితీగా మారింది.

Nepal Earthquake: నేపాల్‌లో భూకంపం- 70 మందికి పైగా మృతి

గులాబీ బాస్, బీఆర్‌ఎస్‌ పార్టీ ( BRS Party ) లక్కీ గాడ్ అనిపించుకున్న వేంకటేశ్వరస్వామి ఆలయం సిద్దిపేట జిల్లాలోని నంగునూరు మండలంలోని కోనాయిపల్లి గ్రామంలో ఉంది. ఎన్నికల నామినేషన్‌ సెంటిమెంట్ ను 1985వ సంవత్సరం నుంచి ఫాలో అవుతున్నారు కేసీఆర్. అప్పటినుంచి 1989, 1994, 1999, 2001, 2004, 2009, 2018 ప్రతిసారి ఎన్నికల నామినేషన్‌ పత్రాలకు పూజలు నిర్వహించి, నామినేషన్‌ వేసి విజయం సాధించారు. 2023లో కూడా ఆ శ్రీనివాసుడి కృపతో బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించాలని సంకల్పించారు.

తెలంగాణ ప్రజల సమస్యలు తొలగాలంటే ప్రత్యేక రాష్ట్రం కావాల్సిందే అన్న నినాదంతో ఆనాడు తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వం మొదలు శాసనసభ డిప్యూటీ స్పీకర్‌, ఎమ్మెల్యే పదవులకు 2001 ఏప్రిల్‌ 27న రాజీనామా చేసారు కేసీఆర్. అదేరోజు ఉదయం కోనాయిపల్లి వేంకన్నస్వామి ఆశీర్వాదం తీసుకొని టీఆర్‌ఎస్‌ పార్టీని స్థాపించారు.పార్టీ జెండాతో పాటు, సాహిత్యం, పాటల క్యాసెట్లు దేవుని సన్నిధిలో పెట్టి పూజలు నిర్వహించారు. అనంతరం భారీ కార్ల ర్యాలీతో హైదరాబాద్‌లో పార్టీని ఏర్పాటు చేసి 14 ఏండ్ సుధీర్ఘ పోరాటం తర్వాత తెలంగాణ రాష్టాన్ని సాకారం చేసుకున్నారు.

Bigg Boss 7 Telugu : ఫస్ట్ లేడీ కెప్టెన్ గా శోభా.. గౌతమ్ మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలు

ప్రత్యేక రాష్ట్రం (separate state) ఏర్పడిన తర్వాత 2004లో తెలంగాణ ప్రాంతంలో పోటీ చేస్తున్న టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థుల బీ ఫారాలకు కోయినపల్లి ఆలయంలోనే పూజలు చేయించి వారికి అందజేశారు. ఆ ఏడాది ఎన్నికల్లో కరీంనగర్‌ పార్లమెంట్‌కు, సిద్దిపేట అసెంబ్లీకి పోటీ చేసిన కేసీఆర్‌ రెండు చోట్ల అఖండ విజయం సాధించారు. 2009 ఎన్నికల సమయంలోనూ ఇదే సంప్రదాయాన్ని అనుసరించారు. మహబూబ్‌నగర్‌ పార్లమెంట్ తరపున కేసీఆర్, సిద్దిపేటకు హరీశ్ రావు, సిరిసిల్లకు కేటీఆర్ పోటీచేసినప్పుడు ముందుగా ముగ్గురి నామినేషన్‌ పత్రాలకు కోయినపల్లి ఆలయంలోనే పూజలు చేయించి బరిలోకి దిగారు. ఆ ఎన్నికల్లో సైతం ఘన విజయం సాధించారు. 2014 సాధారణ ఎన్నికల్లో సైతం ఇక్కడ కేసీఆర్‌ పూజలు చేసి గజ్వేల్‌, మెదక్‌ పార్లమెంట్‌ స్థానానికి పోటీ చేసి విజయం సాధించారు. టీఆర్‌ఎస్‌ పార్టీ భారీ మెజార్టీతో విజయం సాధించడంతో కేసీఆర్‌ మెదక్‌ పార్లమెంట్‌ స్థానానికి రాజీనామా చేశారు. 2018 సాధారణ ఎన్నికల్లో సైతం ఇక్కడ పూజలు చేసిన అనంతరం తన నామినేషన్‌ వేసారు. ఇలా ప్రతి ఎన్నికల్లో నామినేషన్‌ వేయడానికి ముందు సీఎం కేసీఆర్‌ మాత్రమే కాదు మంత్రి హరీశ్‌రావు సైతం ఇక్కడికి వచ్చి నామినేషన్‌ పత్రాలకు పూజలు చేయించి అక్కడే సంతకాలు పెట్టి నామినేషన్‌ వేస్తారు. హరీశ్ రావుకు సైతం సెంటిమెంట్‌ గుడిగా మారిన తర్వాత తన నియోజకవర్గంలోని ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులకు ఇక్కడే పూజలు చేయించి వారితో ఎన్నికల్లో నామినేషన్లు వేయించారు.

PM MODI: తెలంగాణకు ప్రధాని మోదీ.. ఎన్నికల ప్రచార సభలకు హాజరుకానున్న ప్రధాని..!

సిద్దిపేట ( Siddipet ) నంగునూరు మండలంలోని కోనాయిపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి పూర్వ చరిత్ర ఉంది. సంకటహరుడిగా, విజయవేంకటేశునిగా స్వామికి పేరుంది. ఇక్కడ దేవాలయ ముఖద్వారం దక్షిణం వైపు ఉంటుంది. ఇలా దక్షిణం వైపు ఉన్న దేవాలయాలు చాలా అరుదు. అది కూడా ఒక ప్రత్యేకత అని చెప్పుకోవచ్చు. ఈ పురాతన ఆలయాన్ని అద్భుతంగా పునరుద్ధరించారు. కేసీఆర్‌ సూచనలతో హరీశ్‌రావు ( Harish Rao ) దేవాలయాన్ని 3 కోట్ల రూపాయలకు పైగా నిధులు ఖర్చుచేసి గుడిని పునర్నిర్మించారు. ప్రధాన ఆలయంతో పాటు కల్యాణ మండపం, రాజమండపం, ధ్వజస్తంభం, స్వామి వారి మూలవిరాట్‌, అమ్మవార్ల విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఉత్తర ద్వారాన్ని నిర్మించారు. ప్రత్యేక పూజలు చేసేందుకు యాగశాలను సిద్ధం చేశారు. 2022 ఫిబ్రవరిలో పునఃప్రతిష్ఠ మహోత్సవాలు నిర్వహించారు. మరో రూ.50 లక్షలతో గ్రామంలో కల్యాణ మండపాన్ని కూడా నిర్మించడం విశేషం.