Top story: హమాస్ కల్లాస్.. ముసాద్ దెబ్బకి గిల గిల

ముసాద్ దెబ్బ కి హమాస్‌కు హమాస్ గిల గిల లాడుతోంది. గాజా యుద్ధంలో ఇజ్రాయెల్‌ అతి పెద్ద విజయం సాధించింది. అక్టోబరు 7 దాడుల సూత్రధారి.. హమాస్‌ మిలిటెంట్‌ గ్రూపు అధినేత యాహ్యా సిన్వర్‌ను విజయవంతంగా లేపేసింది. హమాస్ కి ఇది కోలుకోలేని దెబ్బ.ఇది ఇజ్రాయెల్‌కు సైనికంగా, నైతికంగా ఘనవిజయం.

  • Written By:
  • Publish Date - October 18, 2024 / 05:37 PM IST

ముసాద్ దెబ్బ కి హమాస్‌కు హమాస్ గిల గిల లాడుతోంది. గాజా యుద్ధంలో ఇజ్రాయెల్‌ అతి పెద్ద విజయం సాధించింది. అక్టోబరు 7 దాడుల సూత్రధారి.. హమాస్‌ మిలిటెంట్‌ గ్రూపు అధినేత యాహ్యా సిన్వర్‌ను విజయవంతంగా లేపేసింది. హమాస్ కి ఇది కోలుకోలేని దెబ్బ.ఇది ఇజ్రాయెల్‌కు సైనికంగా, నైతికంగా ఘనవిజయం.సిన్వర్‌ ఏరివేతతో తక్షణ కాల్పుల విరమణకు, బందీల విడుదలకు మార్గం సుగమం కానుంది అని అన్నారు. సిన్వర్‌ను హతమార్చి, లెక్కను సరిచేశామని.. అయితే యుద్ధం మాత్రం ఆగదని ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు ప్రకటించారు.

అయితే.. తమ నాయకుడి మరణంపై హమాస్ ఇంకా స్పందించలేదు. కీలక నేతలంతా హతమైన వేళ.. సిన్వర్ మృతి హమాస్‌కు భారీ దెబ్బగానే విశ్లేషకులు భావిస్తున్నారు. సౌత్ గాజాలో బుధవారం ముగ్గురు హమాస్ మిలిటెంట్లను ఇజ్రాయెల్ సైన్యం హతమార్చింది. అందులో ఒకరికి సిన్వరే పోలికలు ఉన్నాయని సైన్యం అనుమానించింది. అతడి చేతి వేళ్లను కట్ చేసి ఫోరెన్సిక్, డీఎన్‌ఏ ల్యాబ్‌కు పంపించారు. రిపోర్ట్స్ ఆధారంగా సిన్వర్ ని గుర్తించారు.
గాజా యుద్ధానికి కారణమైన అక్టోబరు 7 మారణహోమానికి సిన్వరే సూత్రధారి అని ఇజ్రాయెల్‌ తెలిపింది. గతేడాది ఇజ్రాయెల్‌ సరిహద్దులపై హమాస్‌ జరిపిన దాడిలో 12 వందల మంది మృతి చెందారు. 250 మందిని బందీలుగా గాజాకు తీసుకువెళ్లింది. ఇంకా హమాస్‌ దగ్గర 100 మంది బందీలు ఉన్నారు. సిన్వర్‌ కోసం గాజా సొరంగాల్లో ఐడీఎఫ్‌ వేట కొనసాగించింది. తాజాగా సిన్వారే హతమార్చినట్టు ప్రకటించింది.

ఈ ఆపరేషన్‌లో ఇజ్రాయెల్‌కు చెందిన యువ సైనికులు హతమార్చారు. వారందరూ 9 నెలల క్రితమే ఇజ్రాయెల్‌ డిఫెన్స్ ఫోర్సెస్‌లో చేరారు. గతేడాది హమాస్ మిలిటెంట్లు దాడి చేసినప్పుడు వారు సైన్యంలో లేరు. కానీ, ఆ తర్వాత జరిగిన ఆపరేషన్‌లను సక్సెస్ చేశారు. వారందరి వయసు 19-21 ఏళ్ల మధ్యే ఉంటుందని తెలుస్తోంది.
సిన్వర్‌ చివరి క్షణాలకు సంబంధించిన ఓ వీడియో వైరల్‌గా మారింది. ఇజ్రాయెల్ సైన్యం మొదటిసారి దాడి చేసినప్పుడు ఆయన తీవ్ర గాయాలతో కుర్చిలో కూర్చొని ఉన్నారు. ఇజ్రాయెన్‌ సైన్యం డ్రోన్‌తో షూట్ చేసింది. డ్రోన్ పై కర్రలతో దాడి చేశాడు సిన్వర్. ఆ తర్వాత రెండోసారి జరిపిన దాడిలో సిన్వర్ చనిపోయాడు.
గతేడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్ సరిహద్దులపై హమాస్ జరిపిన దాడిలో 1200 మంది మరణించారు. 250 మందిని బందీలుగా గాజాకు తీసుకెళ్లారు. దీంతో గాజాపై యుద్ధం ప్రకటించిన ఇజ్రాయెల్ హమాస్ అగ్రనేతలందరినీ చంపుతామని ప్రతిజ్ఞ చేసింది. అప్పటి నుంచి ఒక్కొక్కరిని వేటాడుతూ మట్టుబెట్టింది. మహమ్మద్ డైఫ్, ఇస్మాయిల్ హనియే, మర్వాన్ ఇస్సా, రాద్ సాద్, సలేహ్ అల్-అరౌరీ, యాహ్యా సిన్వార్ ఇలా టాప్ కమాండర్లందరినీ చంపేసింది.