2024 లో దేశ రాజకీయాల్లో ఇద్దరి నేతల పేర్లు మార్మోగిపోయాయి. ఒకటి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరొకరు తమిళ్ స్టార్ హీరో విజయ్ దళపతి. సినిమాల్లోనే స్టార్లు రాజకీయాల్లో కాదు అనుకునే వాళ్లకు వీరిద్దరూ 2024 లో ఇచ్చిన సమాధానం చూసి అందరూ నెవ్వరు పోయారు. జనసేన పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని ఆ పార్టీకి కనీసం కార్యకర్తల బలం కూడా లేదని అంచనా వేసిన వారందరికీ పవన్ కళ్యాణ్ చాలా గట్టిగా సమాధానం చెప్పారు. 2024లో తెలుగుదేశం పార్టీతో కలిసి ఎన్నికలకు వెళ్ళిన పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నిక కావడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టారు.
ఇక బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన పనితీరు చూసి జాతీయ మీడియా కూడా షాక్ అయింది. ఏపీ ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ అత్యంత కీలకంగా వ్యవహరించడమే కాకుండా పలు కీలక శాఖల విషయంలో చాలా సీరియస్ గా దృష్టి సారించారు. హోంశాఖ అలాగే పౌరసరఫరాల శాఖ విషయంలో పవన్ కళ్యాణ్ దూకుడు చూసిన చాలామంది అధికారులు భయపడుతున్నారు. హోంశాఖ విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు రెండు నెలల క్రితం తీవ్ర దుమారమే రేపాయి. ఆ తర్వాత పౌరసరఫరాల శాఖ విషయంలో కాకినాడ పర్యటనకు వెళ్లిన సందర్భంగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారాయి.
కాకినాడ నుంచి అక్రమ రేషన్ బియ్యం రవాణా జరుగుతుంది అనే విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్… 38 వేల టన్నుల అక్రమ రేషన్ బియ్యాన్ని కాకినాడ కలెక్టర్ పట్టుకున్న తర్వాత కాకినాడ పర్యటనకు వెళ్లి సీజ్ ది షిప్ అంటూ ఓ డైలాగు వేశారు. ఆ డైలాగ్ దేశవ్యాప్తంగా సంచలనమైంది. ఇక అధికారుల విషయంలో పవన్ కళ్యాణ్ అనుసరిస్తున్న వైఖరి కూడా అధికారులను మరింత కలవరపెడుతోంది. ఒక వైసీపీ కార్యకర్తకు ఎస్పీ సహకరిస్తున్నారు అనే విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద సాక్ష్యాలతో ప్రస్తావించడంతో కడప ఎస్పీగా ఉన్న హర్షవర్ధన్ రాజును చంద్రబాబు నాయుడు బదిలీ చేశారు.
అదే సమయంలో కొంతమంది సిఐలు ఒక డిఎస్పి పై కూడా వేయటు పడింది. ఆ తర్వాత కాకినాడ కలెక్టర్ కాకినాడ ఎస్పీపై కూడా పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. కాకినాడ పర్యటనకు పవన్ కళ్యాణ్ వెళుతుంటే ఎస్పీ సెలవులో ఉండటం పై చంద్రబాబునాయుడుకు పవన్ కళ్యాణ్ ఫిర్యాదు చేశారు. దీనిని సీరియస్ గా తీసుకున్న చంద్రబాబు నాయుడు ఎస్పీని బదిలీ చేసే అవకాశం ఉందనే ప్రచారం జరిగింది. అయితే ఆ బదిలీ కాస్త వాయిదా పడుతూ వచ్చింది. ఇక కాకినాడ కలెక్టర్ పై కూడా పవన్ కళ్యాణ్ సీరియస్ గా ఉన్నట్లు బుధవారం జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో స్పష్టత వచ్చింది.
దీనిపై కూడా చంద్రబాబు నాయుడుకు ఆయన ఫిర్యాదు చేశారు. పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటన తర్వాత కూడా అక్రమ రేషన్ బియ్యం 100 ఆగకపోవడంపై కలెక్టర్ల ను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ సీరియస్ గా వ్యాఖ్యలు చేశారు. దీనితో ఈ వ్యవహారం ఏమలుపు తిరుగుతుందో అనే ఆందోళన రాజకీయ వర్గాల్లో కూడా నెలకొంది. అటు అధికారులు పవన్ కళ్యాణ్ పేరు చెప్తే వణికిపోయే పోయే పరిస్థితి ఏర్పడింది. మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ చేసిన ప్రచారానికి జాతీయ మీడియా కూడా ఫిదా అయిపోయింది. అటు బిజెపి అధిష్టానం కూడా పవన్ విషయంలో చాలా సానుకూలంగా ఉంది. ఐదు నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ ప్రచారం చేయడం… ఆ 5 నియోజకవర్గాల్లో బిజెపి ఘనవిజయం సాధించడం పట్ల బీజేపీ పెద్దలు చాలా సంతోషంగా ఉన్నారు. దీనితో రాబోయే రోజుల్లో కచ్చితంగా పవన్ కళ్యాణ్ కు ఎన్డీఏలో కీలక స్థానం దక్కబోతుంది అనే సంకేతాలు కూడా వచ్చాయి.
ఇక తమిళ స్టార్ హీరో విజయ్ విషయానికి వస్తే సినిమాలకు మాత్రమే పరిమితమైన విజయ్… దాదాపుగా 275 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్న విజయ్ రాజకీయాల్లో అడుగుపెట్టాడు. ఒక భారీ బహిరంగ సభను విల్లుపురంలో నిర్వహించి తమిళనాడు రాజకీయాల్లో సంచలనం అయ్యాడు. ఒకప్పుడు సినిమాలకు కూడా పనికిరాడు అనుకున్న వ్యక్తి భారీగా జన సమీకరణ చేసి రాజకీయ అరంగేట్రాన్ని ప్రకటించడంతో అక్కడి రాజకీయ పార్టీల్లో ఆందోళన మొదలైంది. త్వరలో జరగబోయే తమిళనాడు ఎన్నికల్లో విజయ్ పోటీ చేయడం కాయంగా కనబడుతోంది.
ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక కూడా దాదాపుగా పూర్తయింది. ఏ పార్టీతో పొత్తు పెట్టుకోకుండా సొంతగానే ఎన్నికలకు వెళ్లేందుకు విజయ్ సిద్ధమయ్యాడు. అక్కడ సినిమా హీరోలను ప్రజలు రియల్ లైఫ్ లో కూడా హీరోలు గానే చూస్తూ ఉంటారు. దేవుళ్ళుగా కొలుస్తూ ఉంటారు. దీనితో విజయ్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉండవచ్చు అనే ప్రచారం కూడా జరుగుతుంది. అయితే డీఎంకే పార్టీకి చెక్ పెట్టేందుకు విజయ్ ని రాజకీయాల్లోకి భారతీయ జనతా పార్టీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుందని ప్రచారం కూడా జరుగుతోంది.
అన్నా డీఎంకే క్రమంగా ప్రభావం కోల్పోవడంతో విజయం అడ్డం పెట్టుకొని డీఎంకే ని ఓడించాలనే పట్టుదలలో బిజెపి పెద్దలు ఉన్నారని ప్రచారం కూడా జరుగుతోంది. ఇండియా కూటమిలో డిఎంకె అత్యంత కీలకమైన పార్టీ కావడంతో విజయ్ ద్వారా ఇబ్బంది పెట్టేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యూహాలు సిద్ధం చేశారని వార్తలు వచ్చాయి. ఈ విధంగా ఇద్దరు దేశ రాజకీయాల్లో ఈ ఏడాది సంచలనంగా మిగిలిపోయారు. రాబోయే రోజుల్లో కూడా వీళ్లు సంచలనం కావడం కాయంగా కనబడుతోంది. మరి నూతన సంవత్సరంలో వీరి ప్రభావం ఏ విధంగా ఉంటుంది… ప్రజలను ప్రభుత్వాలను ఏ విధంగా ప్రభావితం చేస్తారనేది చూడాలి.