ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం ఉదయం 11 గంటలకు తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ అభ్యర్థులతో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో అందరికి బీ ఫామ్ లు ఇస్తారనే ప్రచారం జరిగింది గానీ కేవలం 51 భీఫామ్ మాత్రమే పూర్తి అయ్యాయిని.. మిగతా వారికి పూర్తి కాగానే వారికి బీ ఫామ్ లు అందిస్తామని కేసీఆర్ వెల్లడించారు. పార్టీ తరఫున తెలంగాణ భవన్ లో అభ్యర్థులకు ఎన్నికల ప్రచార ఖర్చు చెక్కులు కూడా మహాన్నం 2 గంటలకు అందజేయనున్నారు.
2023 బీఆర్ఎస్ మేనిఫెస్టో లో ఎక్కువగా.. రైతులు, మధ్యతరగతి, యువత, మహిళలు, టార్గెట్ గా కేసీఆర్ గురి పెట్టినట్లు సమాచారం. ముఖ్యంగా కాంగ్రెస్ గ్యారెంటీలను తలదన్నేలా బీఆర్ఎస్ మేనిఫెస్టో తయారైందని తెలుస్తోంది.
బీఆర్ఎస్ 2023 మేనిఫెస్టో ఇదేనా..?
ఈ నెల 15 నుంచి.. నేటి నుంచే బీఆర్‌ఎస్ సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచార సభల్లో అధికారికంగా పాల్గొని.. సమర శంఖారావం పూరించనున్నారు. పూర్తిగా ఎన్నికల ప్రచారంలో 17 రోజులు, 42 సభలతో ప్రచారం నిర్వహించనున్నారు. ఇదే సభలో గత పథకాల అమలు గురించి.. నూతన మేనిఫెస్టో కూడా కేసీఆర్ ప్రకటించనున్నారు.
S.SURESH