హీరోయిన్ కాదంబరి జత్వానిని వేధించిన వ్యవహారానికి సంబంధించి ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది. ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు సహా మరో ఇద్దరినీ సస్పెండ్ చేసింది ప్రభుత్వం. విజయవాడ మాజీ సీపీ కాంతిరాణా తాతాను సస్పెండ్ చేసారు. ఐపీఎస్ అధికారి విశాల్‌గున్నిని సస్పెన్షన్ చేస్తూ ప్రభుత్వ ఉత్వర్వులు జారీ చేసింది.
ముంబయి నటి వ్యవహారంతో పాటు ముగ్గురిపై పలు అభియోగాలు మోపారు. మరి కొందరు అధికారుల పాత్ర పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముగ్గురు ఐపీఎస్‌ల సస్పెన్షన్ ఫైల్‌పై సీఎం చంద్రబాబు సంతకం చేసారు. జీవో నెంబర్లు 1590, 1591, 1592 విడుదల చేసారు. కాన్ఫిడెన్షియల్ అని ప్రభుత్వ వెబ్‌సైట్ లో పేర్కొన్నారు. డీజీపీ నివేదిక ఆధారంగా ముగ్గురు ఐపీఎస్‌లపై వేటు వేసారు. ముగ్గురు ఐపీఎస్‌లను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు అధికారికంగా జారీ చేసారు. ఇప్పటికే ఏసీపీ హనుమంతరావు, ఇబ్రహీంపట్నం సీఐ సత్యనారాయణను సస్పెండ్ చేసారు డీజీపీ.