మంచు గొడవలకు జగన్ కారణమా…? యూనివర్సిటీపై కన్ను…?

మంచు కుటుంబంలో వైయస్ ఫ్యామిలీ చిచ్చు పెట్టిందా...? మోహన్ బాబు యూనివర్సిటీ పై కొంతమంది పెద్దలు కళ్ళు పడ్డాయా...? భూమా అఖిలప్రియ పై ఉన్న కోపాన్ని కొంతమంది భూమా మౌనిక, మంచు మనోజ్ పై చూపిస్తున్నారా...? అంటే అవుననే సమాధానాలు వినపడుతున్నాయి.

  • Written By:
  • Publish Date - December 10, 2024 / 04:08 PM IST

మంచు కుటుంబంలో వైయస్ ఫ్యామిలీ చిచ్చు పెట్టిందా…? మోహన్ బాబు యూనివర్సిటీ పై కొంతమంది పెద్దలు కళ్ళు పడ్డాయా…? భూమా అఖిలప్రియ పై ఉన్న కోపాన్ని కొంతమంది భూమా మౌనిక, మంచు మనోజ్ పై చూపిస్తున్నారా…? అంటే అవుననే సమాధానాలు వినపడుతున్నాయి. ఇప్పుడు దీనిపై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. 2008లో మంచు విష్ణుకు విరోనికా తో వివాహం జరిగింది. మంచు కుటుంబానికి వైయస్ ఫ్యామిలీకి అక్కడ బంధుత్వం ఏర్పడింది.

ఇక అక్కడి నుంచి మంచు మోహన్ బాబు… వైయస్ కుటుంబానికి మరింత దగ్గర అయ్యారు. 2019 ఎన్నికల్లో ఏకంగా చంద్రబాబుపై తీవ్ర ఆరోపణలు చేయడమే కాకుండా వైఎస్ జగన్ కు మద్దతుగా ఎన్నికల్లో ప్రచారం కూడా నిర్వహించారు. అలాగే 2014 నుంచి 19 వరకు చంద్రబాబుని ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా వేదికగా పలుమార్లు మంచు మోహన్ బాబు తిట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాగే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను తమ కాలేజీకి చెల్లించడం లేదంటూ చంద్రబాబు లక్ష్యంగా అప్పట్లో ఆయన పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా చేశారు.

ఇక వైయస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల విషయంలో ఏ స్పష్టత లేకపోయినా మోహన్ బాబు మాత్రం ఏమీ మాట్లాడలేదు. ఇక మంచు విష్ణు మాత్రం వైయస్ జగన్ వద్దకు పలుమార్లు చాలా స్వేచ్ఛగా వెళ్లేవారు. జగన్ కు మంచు విష్ణుకు మధ్య మంచి స్నేహం ఉందని అంటారు. అయితే ఈ స్నేహానికి కారణం తిరుపతి మోహన్ బాబు యూనివర్సిటీ కి ఉన్న ఆస్తులు అనేది చాలామంది అభిప్రాయం. ఈ ఆస్తులు వల్లనే వైఎస్ కుటుంబంలో మంచు విష్ణుకు కాస్త ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది అనే కామెంట్స్ కూడా వస్తున్నాయి.

అయితే ఇప్పుడు మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించిన ఆస్తుల్లో మంచు మనోజ్ వాటా అడగటం తోనే విభేదాలు పెద్ద ఎత్తున తలెత్తయని… ఆ ఆస్తులను మంచు మనోజ్ కు ఇవ్వకుండా వైఎస్ కుటుంబంలోని కొంతమంది పెద్దలు అడ్డుపడుతున్నారని… సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. భూమ కుటుంబం విషయంలో వైయస్ జగన్ తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో అఖిలప్రియను అనేక విధాలుగా వేధించిన సంగతి కూడా తెలిసిందే.

అలాగే ఆ కుటుంబంలో ఆస్తి తగాదాలు కూడా ఉన్నాయి అంటూ అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. భూమా విఖ్యాత్ రెడ్డికి ఆస్తులు ఇవ్వటాన్ని అఖిలప్రియ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని ప్రచారం చేశారు. అలాగే పలు హత్య కేసులు కూడా భూమా అఖిలప్రియపై అప్పట్లో నమోదు కావడం సంచలనమయింది. ఆ తర్వాత భూమా మౌనిక, మంచు మనోజ్ ను ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే మోహన్ బాబు యూనివర్సిటీ కి సంబంధించిన ఆస్తులపై మౌనిక కూడా మోహన్ బాబును ప్రశ్నించినట్లు సమాచారం. తన భర్తకు రావాల్సిన ఆస్తులు ఇవ్వాల్సిందిగా ఆమె డిమాండ్ చేశారని నిన్నటి నుంచి వార్తలు వస్తున్నాయి.

అందుకే ఆమెపై కూడా దాడి చేసినట్లుగా మంచు మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇక ఇప్పుడు ఆ ఆస్తులు ఎలా అయినా సరే మంచు మనోజ్ కు దక్కనీయకుండా చేయడానికి వైయస్ కుటుంబంలోని కొంతమంది ప్రయత్నం చేస్తున్నారని… భూమా అఖిల ప్రియపై ఉన్న కోపాన్ని ఆమె చెల్లెలిపై అలాగే మంచు మనోజ్ పై తీర్చుకుంటున్నారని ప్రచారం జరుగుతుంది. అసలు వీరోనికా… మంచు విష్ణు వివాహానికి వైఎస్ కుటుంబ పెద్దలు అంగీకరించడం వెనక ప్రధాన కారణం మోహన్ బాబు యూనివర్సిటీ ఆస్తులు అనేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్న కొంతమంది అభిప్రాయం.

కామెంట్స్ మంచు మనోజ్ పై దాడి చేసిన వారిలో కొంతమంది రాయలసీమకు చెందిన వ్యక్తులు కూడా ఉన్నారని పోలీసులకు సమాచారం అందింది. మోహన్ బాబు యూనివర్సిటీలో పనిచేసే కొంతమంది వ్యక్తులు మంచు మనోజ్ పై దాడి చేయగా దానికి సంబంధించిన సీసీ ఫుటేజ్ హార్డ్ డిస్క్ ను కూడా మంచు విష్ణు వ్యాపార పార్టనర్ విజయ్ స్వాధీనం చేసుకున్నాడు. ఇక మంచు మనోజ్ ఇంటి బయట కొంతమంది మనుషులు కూడా కాపలా కాసినట్టు మీడియాకు వార్తలు వచ్చాయి. అటు మనోజ్ కూడా ఈ విషయంలో కాస్త జాగ్రత్త పడినట్లు సమాచారం. కొంతమంది బౌన్సర్లను కూడా మనోజ్ తన ఇంటికి పిలిపించుకున్నాడు.