President’s rule in Delhi : కేజ్రీ జైలు పాలన సాధ్యమా ? ఆ రోజు నుంచే రాష్ట్రపతి పాలన

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన సీఎం కేజ్రీవాల్ ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్నారు. ఆయన PMLA కేసులో అరెస్ట్ అయ్యారు కాబట్టి... ఈనెల 28 తర్వాత మళ్ళీ కస్టడీ లేదంటే తిహార్ జైలుకెళ్ళడం ఖాయం.

 

ఢిల్లీ లిక్కర్ స్కామ్ (Delhi Liquor Scam) కేసులో అరెస్ట్ అయిన సీఎం కేజ్రీవాల్ (CM Kejriwal) ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్నారు. ఆయన PMLA కేసులో అరెస్ట్ అయ్యారు కాబట్టి… ఈనెల 28 తర్వాత మళ్ళీ కస్టడీ లేదంటే తిహార్ జైలుకెళ్ళడం ఖాయం. జైలు నుంచే ఢిల్లీ రాష్ట్ర పాలన చేస్తారని ఆప్ చెబుతోంది. సీఎంగా ఉన్న వ్యక్తి అరెస్టయితే రిజైన్ చేయాలని చట్టంలో లేదు. శిక్ష పడితే మాత్రం పదవి నుంచి తప్పుకోవాలి. కానీ సీఎం అందుబాటులో లేకుండా ఓ రాష్ట్ర పాలన ఎలా సాధ్యమవుతుంది. తిహార్ జైలుకు వెళ్ళాక వారంలో రెండు సార్లు మాత్రమే ములాఖత్ ఉంటుంది. ఈ టైమ్ లో అధికారులు ఎన్ని ఫైళ్ళ మీద సంతకాలు తీసుకోగలుగుతారు.

ఇదే లిక్కర్ కేసులో ఆప్ కీలక నేతలు మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్, సంజయ్ సింగ్ చాలాకాలంగా జైల్లో ఉన్నారు. వాళ్ళెవరూ ఇప్పట్లో బయటకు వచ్చే ఛాన్సే లేదు. ఏడు రోజుల ఈడీ కస్టడీ తర్వాత… కేజ్రీవాల్ కూడా తిహార్ జైలుకు వెళ్ళే అవకాశముంది. అప్పటిదాకా ఢిల్లీకి సీఎం లేకపోతే కష్టం. ఈ పరిస్థితుల్లో ఆర్థికమంత్రిగా ఉన్న అతిషి, రాఘవ్ చద్దా, సౌరభ్ భరద్వాజ్ లో ఎవరికో ఒకరికి ముఖ్యమంత్రి పదవి అప్పగించాల్సిందే. లేదంటే కేజ్రీవాల్ భార్య సునీతను అయినా కూర్చోబెట్టాలి.

ఈడీ కస్టడీలో ఉన్న కేజ్రీవాల్ ట్రయల్ కోర్టులో బెయిల్ కోసం అప్లయ్ చేస్తున్నారు. బెయిల్ ఇవ్వడానికి కోర్టు నిరాకరిస్తే… ఢిల్లీ సీఎం పదవిలో మరొకరిని కూర్చోబెట్టాలి. లేకపోతే లెఫ్టినెంట్ గవర్నర్ రాష్ట్రపతిపాలనకు సిఫార్సు చేసే అవకాశాలు ఉన్నాయి. ఆప్ ప్రభుత్వ పదవీకాలం 2025 ఫ్రిబవరి దాకా ఉంది. అప్పటిదాకా ప్రెసిడెన్షియల్ రూల్ అమల్లో ఉంటుంది. ఇప్పటికే ఢిల్లీ పరిస్థితులపై గవర్నర్ ఓ నివేదికను కేంద్ర హోంశాఖకు పంపారు. ప్రస్తుతం కస్టడీలో ఉన్న కేజ్రీవాల్ ను ఈనెల 28న తిరిగి రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెడతారు ఈడీ అధికారులు. అప్పటివరకూ కేజ్రీవాల్ కి కోర్టు రిలీఫ్ ఇవ్వకపోతే మాత్రం ఢిల్లీలో రాష్ట్రపతి పాలన తప్పేలా లేదు.