TDP Over Confidence: ఓవర్‌ కాన్ఫిడెన్స్‌లో టీడీపీ… వైసీపీ కొట్టడం అంత ఈజీ కాదా?

కళ్ల ముందు కనిపిస్తున్న జనాన్ని చూసి.. ప్రభంజనం రాబోతోందని.. అధికారం తమదే అనే ఓవర్‌ కాన్ఫిడెన్స్‌లో లెక్కలు వేసుకుంటే.. పార్టీని నిండా మునగక తప్పదు.

  • Written By:
  • Publish Date - March 6, 2023 / 02:14 PM IST

మనం గెలుస్తామనుకోవడం విశ్వాసం.. మనమే గెలుస్తామనుకోవడం అతివిశ్వాసం… కాస్త అటుఇటుగా టీడీపీ పరిస్థితి ఇలానే కనిపిస్తోందిప్పుడు ! వైసీపీ పాలన మీద, జగన్ మీద జనాల్లో వ్యతిరేకత పెరిగిందని.. అదే తమను గెలిపిస్తుందని సైకిల్ పార్టీ నేతలు ధీమాగా కనిపిస్తున్నారు. చంద్రబాబు సభలకు వచ్చిన జనాలను చూసో.. లోకేశ్‌ పాదయత్ర రెస్పాన్స్‌ చూసో.. ఇలాంటి నమ్మకం కలగడంలో తప్పు లేదు. ఏం చేయకపోయినా గెలిచేస్తాం.. అధికారం దక్కించుకుంటామంటే దాన్ని మించి ఓవర్‌ కాన్ఫిడెన్స్ ఉండదు.

అవుతుందా లేదా అన్న సంగతి పక్కనపెడితే.. క్లీన్‌స్వీప్ టార్గెట్‌గా వైసీపీ అడుగులు వేస్తుందంటే.. అర్థం చేసుకోవచ్చు.. వాళ్ల కాన్ఫిడెన్స్ ఏంటో! కొన్ని వర్గాల్లో వైసీపీ పాలన మీద వ్యతిరేకత రావొచ్చు.. చాలా జిల్లాల్లో విభేదాలు, అసంతృప్తులు వెంటాడుతూ ఉండొచ్చు.. అవి అధికారం మీద ప్రభావం చూపించే స్థాయిలో లేదు అన్న విషయం టీడీపీ గ్రహించాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ వదిలేస్తే.. పోల్‌ మేనేజ్‌మెంట్‌లో వైసీపీ టాప్‌. ఎన్నికలు అనగానే గెలిచి తీరాలని పూనకం వచ్చినట్లు కనిపిస్తుంటుంది వైసీపీలో తీరు! ఓటు బ్యాంక్‌ను కాపాడుకోవడంలో.. ఆ ఓట్లను అధికారం కోసం వాడుకోవడంలో వైసీపీ తర్వాతే ఎవరైనా! పైగా మొత్తం ఓటర్లలో 50శాతం మందికి పైగా ఏదో రకంగా సంక్షేమం అందింది. అందులో మొత్తానికి మొత్తం కాకపోయినా.. మెజారిటీ ఓటు బ్యాంక్‌ వైసీపీతోనే ఉంటుంది. ఇలా ఎలా చూసినా.. వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్‌ పార్టీని ఢీకొట్టడం టీడీపీకి అంత ఈజీ కాదు. పైగా అన్ని పార్టీలు పొత్తుగా వెళ్తే.. సానుభూతిపరంగా కూడా ఎండ్ ఆఫ్ ది డే అది వైసీపీకి ప్లస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని టీడీపీ అడుగులు వేయాల్సిన అవసరం ఉంది.

కళ్ల ముందు కనిపిస్తున్న జనాన్ని చూసి.. ప్రభంజనం రాబోతోందని.. అధికారం తమదే అనే ఓవర్‌ కాన్ఫిడెన్స్‌లో లెక్కలు వేసుకుంటే.. పార్టీని నిండా మునగక తప్పదు. 2024 ఎన్నికలు టీడీపీకి చాలా కీలకం. బలం భారీగా పెంచుకోకపోయినా.. అధికారం దక్కించుకోకపోయినా.. పార్టీ ఉనికి కూడా ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉంటుంది. ఈ విషయాలన్నీ దృష్టి పెట్టుకొని.. టీడీపీ అప్రమత్తం కావాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్.