Revanth Reddy: రేవంత్ రెడ్డి ఆర్మూర్ నుంచి పోటీ చేయబోతున్నారా.. జీవన్ రెడ్డి రియాక్షన్ ఏంటి?

తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఆ క్రెడిట్ సాధించడంలో కాంగ్రెస్ ఫెయిల్ అయింది. రెండుసార్లు అధికారానికి దూరం అయింది. దీంతో ఈసారి ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రావాలని డిసైడ్ అయింది. పక్క వ్యూహంతో ముందుకు వెళ్తోంది. దీనికోసం సర్వశక్తులూ ఒడ్డుతోంది. వరుసగా రెండుసార్లు అధికారంలో ఉన్న పార్టీగా బీఆర్ఎస్ మీద ఉన్న వ్యతిరేకతని క్యాష్ చేసుకోవాలని ఫిక్స్ అయింది. జిల్లాల వారీగా పార్టీ బలం, బలహీనతల లెక్కలు వేసుకుంటూ జాగ్రత్తగా అడుగులు వేస్తోంది.

  • Written By:
  • Publish Date - July 7, 2023 / 01:17 PM IST

దక్షిణ తెలంగాణ జిల్లాల్లో పార్టీ బలంగా ఉండడంతో పాటు ఇటీవల ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేరిక.. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన జూపల్లి కృష్ణారావు తదితరులు చేరనుండడంతో పార్టీ శ్రేణుల్లో తిరుగులేని ఉత్సాహం కనిపిస్తోంది. దక్షిణ తెలంగాణ విషయమై పార్టీ అధినాయకత్వం పూర్తి భరోసాతో ఉంది. ఖమ్మం సభ నుంచే ఎన్నికల శంఖారావాన్ని పార్టీ పూరించింది. ఇప్పుడు ఉత్తర తెలంగాణ జిల్లాలపై నాయకత్వం ఫోకస్‌ పెట్టింది. ఇందులో భాగంగా బలహీనంగా ఉన్న నిజామాబాద్‌ జిల్లా నుంచి పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని బరిలోకి దించేందుకు ఏఐసీసీ నాయకులు ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.. ఆర్మూర్‌ నుంచి రేవంత్‌ పోటీ చేస్తారనే విషయమై జిల్లాలోని సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

కాంగ్రెస్‌ పార్టీ వరంగల్‌ రైతు డిక్లరేషన్‌ తో రైతుల్లో పార్టీపై అనుకూలత పెరిగింది. ధరణి రద్దు చేస్తామని ప్రకటనతో కాంగ్రెస్‌కు మరింత మద్దతు పెరుగుతోంది. ఈ క్రమంలో రైతుల్లోకి మరింతగా చొచ్చుకెళ్లేందుకు వ్యవసాయపరంగా ముందంజలో ఉన్న ఆర్మూర్‌ నుంచి రేవంత్‌ను పోటీ చేయించనున్నట్లు పార్టీ వర్గాలు అనుకుంటున్నట్లు తెలుస్తోంది.. దక్షిణ తెలంగాణలో అత్యంత ప్రభావం చూపించే నాయకులు కాంగ్రెస్ లో ఉన్నారు. ఉత్తర తెలంగాణలో కుడాట్ఆ స్థాయిలో ప్రభావం చూపించే విధంగా పావులు కదుపుతోంది. పైగా ఉత్తర తెలంగాణలో బీజేపీ ప్రభావం ఉండడంతో పకడ్బందీగా వ్యవహరించేందుకు అధిష్టానం వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో తిరుగులేని ప్రజాదరణ ఉన్న రేవంత్‌రెడ్డిని ఆర్మూర్‌ నియోజకవర్గం నుంచి బరిలోకి దించేందుకు ఏఐసీసీ నాయకులు సూచించినట్లు తెలిసింది.

మరి ఇదే నిజం అయితే.. సిట్టింగ్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి రియాక్షన్ ఎలా ఉంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది. ఇక అటు ఇదే ఆర్మూర్ మీద బీజేపీ కూడా ఫోకస్ పెట్టింది. ఎంపీ ధర్మపురి అరవింద్ పోటీకి సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ సారి ఆర్మూర్ రాజకీయం ఆసక్తికరంగా మారడం ఖాయం అనిపిస్తోంది.