Telangana Congress : కాంగ్రెస్‌ సెకండ్ లిస్ట్ మరింత ఆలస్యం.. ఆ నేతల వ్యవహారమే కారణమా.. ?

తెలంగాణ కాంగ్రెస్‌లో టికెట్ల హడావుడి మాములుగా లేదు. 55మందితో ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేసింది కాంగ్రెస్. ఐతే రెండవ జాబితా వెంటనే విడుదల అవుతుందని అంతా భావించినా.. అది ఆలస్యం అవుతూ వస్తోంది. ఐతే ఎట్టకేలకు ముహూర్తం ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఈ నెల 21న రెండో లిస్టును రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. రాహుల్‌ తెలంగాణ పర్యటన వేళ.. 21న జాబితాను ప్రకటించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

సెకండ్ లిస్ట్ రెడీ..?

తెలంగాణ కాంగ్రెస్‌లో టికెట్ల హడావుడి మాములుగా లేదు. 55మందితో ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేసింది కాంగ్రెస్. ఐతే రెండవ జాబితా వెంటనే విడుదల అవుతుందని అంతా భావించినా.. అది ఆలస్యం అవుతూ వస్తోంది. ఐతే ఎట్టకేలకు ముహూర్తం ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఈ నెల 21న రెండో లిస్టును రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. రాహుల్‌ తెలంగాణ పర్యటన వేళ.. 21న జాబితాను ప్రకటించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. సెకండ్‌ లిస్ట్‌ కోసం టీకాంగ్రెస్‌ నేతలు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు, సెకండ్‌ లిస్ట్‌ ప్రకటన లోపు పలువురు నేతల చేరికకు కాంగ్రెస్‌ ప్లాన్‌ చేస్తోంది. ఐతే ఆ రోజు రిలీజ్ అవుతుందా.. మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉందా అనే చర్చ కూడా నడుస్తోంది.

మొదటి జాబితాలో బీసీ కులాలకు పెద్దగా ప్రాధాన్యం దక్కకపోవడంతో.. రెండవ జాబితాలో వారికి ఎక్కువ సీట్లు కేటాయించే అవకాశం కనిపిస్తోంది. ఎస్సీ, ఎస్టీలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వబోతున్నట్లు సమాచారం. ఫస్ట్ లిస్ట్ అనౌన్స్ చేసిన తర్వాత.. చాలామంది నేతలు తిరుగుబాటు చేశారు. రేవంత్ టికెట్లు అమ్ము కున్నారంటూ.. కొందరైతే బహిరంగంగానే ఆరోపణలు గుప్పించారు. దీంతో ఎప్పుడో రావాల్సిన సెకండ్ లిస్ట్ రోజురోజుకు ఆలస్యం అవుతోంది. మరి 21లోపు అన్ని సర్దుకుంటాయా.. ఆ రోజు లిస్ట్ రిలీజ్ అవుతుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఫస్ట్ లిస్ట్ తర్వాత అసంతృప్తికి గురైన పార్టీ నాయకులు పార్టీ రాష్ట్ర కార్యాలయానికి వెళ్లి.. ధర్నాలు, ఆందోళనలు చేయడం.. ఫ్లెక్సీలు చింపడంలాటి వ్యవహారాలకు పాల్పడుతూ రచ్చ చేస్తున్నారు. కొంతమంది అయితే.. ఓ అడుగు ముందుకేసి గాంధీభవన్‌కు తాళాలు వేశారు. సోమశేఖర్ రెడ్డి, రాగిడి లక్ష్మారెడ్డి , నాగం జనార్ధన్‌ రెడ్డిలాంటి నాయకులు.. రేవంత్‌ మీద బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు.

మేడ్చల్ టికెట్ ఆశించి భంగపడిన హరివర్ధన్ రెడ్డిలాంటి వారు.. రేవంత్‌పై సంచలన విమర్శలు చేస్తున్నారు. పార్టీ సీనియర్ నాయకులు చెప్పినా.. అసంతృప్తి నాయకులు మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. కాంగ్రెస్ బీసీ నేతల్లో కీలకమైన మధుయాష్కీ గౌడ్, పొన్నం ప్రభాకర్ గౌడ్ , మహేష్ కుమార్ గౌడ్‌లాంటి వారికి మొదటి జాబితాలో టికెట్లు కేటాయించలేదు. పైగా దీనికి సంబందించి వారికి కనీసం సమాచారం కూడా అందలేదు. దీంతో వారు పార్టీ హైకమాండ్‌ను ప్రశ్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. వీరితోపాటు పార్లమెంట్ మాజీ సభ్యుడు రాజయ్య, బలరాం నాయక్‌లాంటి వారు కూడా.. మధుయాష్కీ నివాసంలో ప్రత్యేకంగా భేటీ అయి బీసీల సీట్లు, మొదటి జాబితాలో ప్రాధాన్యం ఇవ్వకపోవడం వంటి విషయాలపై చర్చించినట్లు సమాచారం. కొత్తగా పార్టీలో చేరిన వారికి టికెట్లు ఇవ్వడం పై వారి మధ్య చర్చకు వచ్చిందని తెలుస్తోంది. కమ్యూనిస్టులు, తెలంగాణ జన సమితి పార్టీతో పొత్తు కారణంగా.. వారికి సీట్లు ఏ విధంగా సర్దుబాటు చేయాలనే విషయంపై కాంగ్రెస్‌లో తర్జనభర్జనలు జరుగుతున్నాయి. దీంతో సెకండ్ లిస్ట్ మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయనే గుసగుసలు వినిపిస్తున్నాయి.