డాలర్ల కట్టలు, బంగారం గుట్టలు హెజ్బొల్లా బంకర్లు చూసి ఇజ్రాయెల్‌ షాక్‌

యుద్ధంలో ఒక దేశాన్ని దెబ్బ కొట్టాలి అంటే ఆ దేశం యొక్క ఆర్థిక వనరులను మందు దెబ్బ కొట్టాలి. దీంతో ఆటోమేటిక్‌గా ప్రత్యర్థి సైన్యం విచ్ఛిన్నమవుతుంది. ప్రత్యర్థి దేశం మన ముందు ఖచ్చితంగా తల వంచాల్సిన పరిస్థితి వస్తుంది. సరిగ్గా ఇదే స్టాటజీని ఫాలో అవుతోంది ఇజ్రాయెల్‌.

  • Written By:
  • Publish Date - October 23, 2024 / 08:05 PM IST

యుద్ధంలో ఒక దేశాన్ని దెబ్బ కొట్టాలి అంటే ఆ దేశం యొక్క ఆర్థిక వనరులను మందు దెబ్బ కొట్టాలి. దీంతో ఆటోమేటిక్‌గా ప్రత్యర్థి సైన్యం విచ్ఛిన్నమవుతుంది. ప్రత్యర్థి దేశం మన ముందు ఖచ్చితంగా తల వంచాల్సిన పరిస్థితి వస్తుంది. సరిగ్గా ఇదే స్టాటజీని ఫాలో అవుతోంది ఇజ్రాయెల్‌. లెబనాన్‌లోని హిజ్బుల్లాపై విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్.. ఆ సంస్థ ఆర్థిక మూలాలను టార్గెట్ చేసింది. ఇందులో భాగంగా ఓ రహస్య బంకర్‌ను గుర్తించింది. ఓ ఆసుపత్రి కింద ఉన్న ఈ బంకర్‌లో నోట్లు, బంగారం గుట్టలుగా ఉన్నట్టు తమకు సమాచారం ఉందని పేర్కొంటూ ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్.. ఐడీఎఫ్.. ఓ వీడియోను విడుదల చేసింది.

ఐడీఎఫ్ అధికార ప్రతినిధి డేనియల్ హగారీ ఈ వీడియో షూట్‌ చేశారు. హిజ్బుల్లా ఆర్థిక మూలాలపై వరుసగా దాడులు చేస్తున్నట్టు చెప్పారు. ఆదివారం రాత్రి జరిపిన దాడుల్లో ఓ బంకర్‌ను ధ్వంసం చేసినట్టు చెప్పారు. అందులో వేల డాలర్ల నగదు, బంగారాన్ని గుర్తించినట్టు తెలిపారు. ఇజ్రాయెల్‌ మీద దాడికి కావాల్సిన వనరులను సమకూర్చుకునేందుకు ఈ డబ్బును ఇక్కడ దాచిపెట్టినట్టు చెప్పారు. బీరుట్ నడిబొడ్డున అల్-సాహెల్ ఆసుపత్రి కింద ఉన్న బంకర్‌లో వందల మిలియన్ల కొద్దీ డాలర్లు, బంగారం గుట్టలను గుర్తించినట్టు తెలిపారు. దాని మీద కూడా త్వరలోనే దాడులు చేసి ధ్వంసం చేస్తామని వార్నింగ్‌ కూడా ఇచ్చారు. ఆ బంకర్‌లో ఉన్న డబ్బు 500 బిలియన్‌ డాలర్లు.. అంటే భారత కరెన్సీ ప్రకారం దాదాపుగా 4 వేల 200.. ఇవే కాకుండా బంగారం కూడా గుట్టలు ఉందని అంచనా వేస్తున్నట్టు హగారీ తెలిపారు.

తమ యుద్ధం హిజ్బుల్లాతోనే తప్ప లెబనాన్ పౌరులతో కాదని మరోసారి స్పష్టం చేశారు. ఎవరికీ ఎలాంటి నష్టం కలగకుండా ఉండేందుకు ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నామన్నారు. ఏం బంకర్‌లో ఐతే బంగారం, డబ్బును గుర్తించారో.. ఆ బంకర్‌ మీద ఓ హాస్పిటల్‌ ఉంది. హాస్పిటల్‌కు అందులో ఉన్న సివిలియన్స్‌కు ఎలాంటి నష్టం జరగకుండా బంకర్‌ మీద దాడి చేస్తామని హామీ ఇచ్చారు. ఐడీఎఫ్ హెచ్చరికల నేపథ్యంలో లెబనాన్ అధికారులు అప్రమత్తమయ్యారు. తమ ఆర్థిక వనరులను దెబ్బతీస్తున్న ప్రత్యర్థి వర్గాన్ని ఎదుర్కునేందుకు రెడీ అయ్యారు. ఇప్పటికే ఆ హాస్పిటల్‌ను ఖాళీ చేయించినట్టు సమాచారం. బంకర్‌ మీద దాడి చేస్తామని ముందే చెప్పిన ఇజ్రాయెల్‌ నిజంగా సవాల్‌ను నిజం చేస్తుందా చూడాలి.