తెలంగాణ ఎన్నికలు ఇక అంతి ఘట్టానికి వచ్చేశాయి. రేపటితో మైలకులన్ని కూడా ముగబోతాయి. ఏం జరగిని నేడు, రేపు మాత్రమే.. ప్రచారం చేయలన్న, ఓట్లు ఆకర్షిచాలన్న, డబ్బులు పంచలన్నా..ఒక్క రోజే. ఈ సారి గెలుపు కోసం ఎంత ఖర్చు పెట్టేందుకునైనా వెనకడుగు వేయ్యడం లేదు. ఇందులో ప్రధాన పార్టీలు తేగ కుస్తీ చేస్తున్నాయి. ఎన్ని చెక్ పోస్టులు పెట్టిన.. ఎలగైన నాయకులు ప్రజలకు డబ్బులు పంచుతునే ఉన్నారు. ఎన్నికల కోడ్ పడ్డపట్టి నుంచి నాయకులకు సరిగ్గ కంటినిండ నిద్ర కరువైంది. సభలు, సమావేశాలతో, రోడ్ షోలతో ఎన్నికల ప్రచారంను హోరేత్తించారు.
ఈ క్రమంలో నేడు తెలంగాణలో పలు ప్రాంతాల్లో ఐటీ అధికారులు దాడులు జరిపారు. ఐటీ అధికారులు, జిల్లా పోలీసులు, ఈసీ అధికారులు చేపట్టిన తనిఖీల్లో భారీగా నగదు పట్టుబడుతోంది. తాజాగా ఖమ్మం, పెద్దపల్లిలో మొత్తం తనిఖీల్లో రూ. 11 కోట్లకు పైగా నగదపట్టుబడింది. ముత్తగూడెంలో 6 కోట్ల నగదును అధికారులు పట్టుకున్నారు. పాలేరులో చేపట్టినతనిఖీల్లో రూ, 3.5 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు, ఐటీ, ఈసీ ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు. కాంగ్రెస్ అభ్యర్థిగా చెందిన డబ్బుగా ఐటీ అధికారులు భావిస్తున్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలో 2 కోట్ల 18 లక్షల రూపాయలను ఎన్నికల అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్టీపీసీ కృష్ణానగర్‌లో కాంగ్రెస్ సంబంధిత ప్రచార కార్యాలయంలో నిల్వ ఉంచిన ఈ నగదును ఎస్ఎస్టీ, ఎలక్షన్స్ స్క్వాడ్ సీజ్ చేశారు. పట్టుబడిన నగదు రామగుండం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి చెందిన నగదుగా అనుమానిస్తున్నారు.