చంద్రబాబు సీఎంగా ప్రమాణం చేసి నేటికి 30 ఏళ్లు

రెండు తెలుగు రాష్ట్రాల్లో సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేత, ప్రతీ సమస్య గురించి అవగాహన ఉన్న నేత ఎవరు అంటే ప్రతీ ఒక్కరు చెప్పే పేరు ఒక్కటే. నారా చంద్రబాబు నాడు. దాదాపు అర్థ శతాబ్ధపు రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు తెలుగు రాష్ట్ర రాజకీయాల్లోనే కురువృద్ధులు.

  • Written By:
  • Publish Date - September 1, 2024 / 04:34 PM IST

రెండు తెలుగు రాష్ట్రాల్లో సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేత, ప్రతీ సమస్య గురించి అవగాహన ఉన్న నేత ఎవరు అంటే ప్రతీ ఒక్కరు చెప్పే పేరు ఒక్కటే. నారా చంద్రబాబు నాడు. దాదాపు అర్థ శతాబ్ధపు రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు తెలుగు రాష్ట్ర రాజకీయాల్లోనే కురువృద్ధులు. అలాంటి చంద్రబాబు జీవితంలో సెప్టెంబర్‌ 1వ తేదీ చాలా స్పెషల్‌. ఎందుకంటే ఆయన మొదటిసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేసింది సెప్టెంబర్‌ 1నే. నేటితో ఆయన సీఎంగా ప్రమాణస్వీకారం చేసి 30 ఏళ్లు గడిచాయి.

1978లో చంద్రగిరి నియోజకవర్గం నుంచి మొదటిసారిగా చంద్రబాబు ఎమ్మెల్యేగా కాంగ్రెస్‌ పార్టీ నుంచి గెలిచారు. గెలిచిన రెండేళ్లలోనే మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. 1980 నుంచి 1982 వరకూ మంత్రిగా పని చేశారు. ఆ తరువాత తెలుగు దేశం పార్టీలో చేరారు. టీడీపీ నుంచి 1989 నుంచి 1995 వరకూ MLAగా పని చేశారు. 1995లో మొదటిసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఓటమి ఎరుగని నాయకుడిగా ఆయన జీవితం రెండు తెలుగు రాష్ట్రాలకు తెరిచిన పుస్తకమే.

దాదాపు 14 ఏళ్ల ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు 2019 ఎన్నికల్లో మాత్రం దారుణంగా ఓడిపోయారు. ఎన్నో అవమానాలు కేసులను భరించి 2024లో మరోసారి చరిత్ర చూడని మెజార్టీతో సీఎం సీట్లో కూర్చున్నారు. ఆయన మొదటిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి 30 ఏళ్ల గడిచిన సందర్భంగా టీడీపీ శ్రేణులు సంబరాలకు సిద్ధం అయ్యారు. ఏపీలోని అన్ని జిల్లాల్లో కార్యక్రమాలు చేపట్టనున్నారు. సమాజానికి సీఎం చంద్రబాబు చేసిన సేవలను ప్రజలకు తెలియజేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహిస్తున్నట్లు టీడీపీ నేతలు చెప్తున్నారు.