PAWAN KALYAN: తిరుపతి నుంచి పవన్‌ కల్యాణ్‌ పోటీ.. షాకింగ్‌ నిర్ణయం వెనక మైండ్‌బ్లోయింగ్ స్ట్రాటజీ..!

తెలంగాణలో ఎన్నికల హడావుడి మొదలైంది. నవంబర్‌ 30న ఎన్నికలు జరగనున్నాయ్. దీంతో పార్టీలన్నీ బిజీబిజీ అయ్యాయ్.. నేతలంతా జనాల్లోనే కనిపిస్తున్నారు ఇప్పుడు. తెలంగాణ సంగతి ఎలా ఉన్నా.. ఏపీలో ఎన్నికలకు మరో ఆరు నెలల సమయం ఉంది. ఐతే తెలంగాణతో పాటే ఎన్నికలు అనే రేంజ్‌లో అక్కడి రాజకీయం కనిపిస్తోంది. వైనాట్‌ 175 అంటున్న జగన్‌.. వరుస సభలతో స్పీడ్‌ పెంచారు.

PAWAN KALYAN: తెలంగాణలో ఎన్నికల హడావుడి మొదలైంది. నవంబర్‌ 30న ఎన్నికలు జరగనున్నాయ్. దీంతో పార్టీలన్నీ బిజీబిజీ అయ్యాయ్.. నేతలంతా జనాల్లోనే కనిపిస్తున్నారు ఇప్పుడు. తెలంగాణ సంగతి ఎలా ఉన్నా.. ఏపీలో ఎన్నికలకు మరో ఆరు నెలల సమయం ఉంది. ఐతే తెలంగాణతో పాటే ఎన్నికలు అనే రేంజ్‌లో అక్కడి రాజకీయం కనిపిస్తోంది. వైనాట్‌ 175 అంటున్న జగన్‌.. వరుస సభలతో స్పీడ్‌ పెంచారు. అటు పవన్ వారాహి యాత్ర కొనసాగిస్తున్నాయ్. చంద్రబాబు అరెస్ట్ తర్వాత టీడీపీ స్పీడ్ తగ్గినా.. క్షేత్రస్థాయిలో మాత్రం సైకిల్ పార్టీ జోరుగా పావులు కదుపుతోంది. దీంతో ఏపీ రాజకీయం రోజురోజుకు ఆసక్తికరంగా మారుతోంది.

ఇక అటు వైసీపీని ఎదుర్కొనేందుకు టీడీపీ, జనసేన కూటమిగా ఏర్పడ్డాయ్‌. దీంతో జగన్‌ మళ్లీ గెలుస్తారా.. జనసేన, టీడీపీ గ్రాండ్ విక్టరీ కొడుతుందా అన్న సంగతి ఎలా ఉన్నా.. పవన్ కల్యాణ్‌ ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న దానిపై ఇప్పుడు రాజకీయవర్గాల్లో కొత్త చర్చ మొదలైంది. నిన్న మొన్నటి వరకు భీమవరం నుంచి పవన్ పోటీ చేస్తారు అని ప్రచారం జరిగింది. గతంలో భీమవరంతో పాటు గాజువాక నుంచి పోటీ చేసిన పవన్.. రెండు స్థానాల్లో ఓడిపోయారు. ఇది ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలను తీవ్ర నిరుత్సాహానికి గురి చేసింది. తనను రెండు చోట్ల ఓడించినా.. పవన్ ఏ మాత్రం డిస్కరేజ్ అవ్వలేదు. జనాల్లోనే కనిపించారు. జనాల సమస్యలు తెలుసుకున్నారు. ఐతే పోయిన చోటే గెలుస్తారని.. గత ఎన్నికల్లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంటారని.. భీమవరం నుంచి మళ్లీ పోటీ చేస్తారని అంతా అనుకున్నారు.

భీమవరం జనాలు కూడా.. మా ఫుల్ సపోర్ట్‌ పవన్‌కే అని ఫ్లెక్సీలు పెట్టి మరీ ప్రూవ్‌ చేయాలి అనుకున్నారు. దీంతో పవన్ కూడా భీమవరం నుంచి పోటీకే సిద్ధం అయినట్లు ప్రచారం జరిగింది. కట్‌ చేస్తే.. ఇప్పుడు సేనాని తన మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. తిరుపతి నుంచి పోటీ చేసే ఆలోచనలో ఉన్నారనే చర్చ నడుస్తోంది. దీనికి సంబంధించి జనసేన నాయకులతోనూ చర్చలు కూడా జరిపారట పవన్‌. కోస్తాంధ్ర మొత్తం జనసేన బలంగానే ఉంది. రాయలసీమలో మాత్రం వీక్‌గా ఉంది. అక్కడ ఓట్ షేర్ ఉంది కానీ.. నాయకత్వం లేదు. తాను తిరుపతి నుంచి పోటీ చేస్తే… రాయలసీమలో మిగిలిన స్థానాల్లో కూడా ప్రభావితం చేయొచ్చు అన్నది పవన్ ప్లాన్‌ అని తెలుస్తోంది. పైగా తిరుపతి మెగా ఫ్యామిలీకి అచ్చొచ్చిన స్థానం కూడా ! గతంలో ప్రజారాజ్యం నుంచి చిరంజీవి ఇక్కడి నుండే పోటీ చేసి అసెంబ్లీలో అడుగు పెట్టారు.