పక్కవాడు సీఎం కావాలని పార్టీ పెట్టిన వాళ్ళు దేశంలో ఎక్కడా ఉండరని పవన్ కల్యాణ్ పై మండిపడ్డారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో జగనన్న విద్యాదీవెన కింద 584 కోట్ల రూపాయలను విడుదల చేశారు. ఈ సందర్భంగా పవన్ తో పాటు చంద్రబాబుపైనా తీవ్ర విమర్శలు చేశారు. బాబు సీఎం అవ్వాలని కోరుకుంటూ, ఇష్టం లేని వాళ్ళు వెళ్లిపోవచ్చు అని చెప్పేవారు ఎక్కడ ఉండరు పవన్ తప్ప అన్నారు.
ఎన్ని సీట్లు ఇచ్చినా ఓకే, ఇవ్వకపోయినా ఓకే… చిత్తం ప్రభు అనడమే త్యాగాల త్యాగ రాజుకి తెలిసిందిని విమర్శించారు జగన్. విలువలు, విశ్వసనీయత అసలు లేకుండా పరిపాలన చేసిన వాళ్ల గురించి ప్రజలు ఆలోచించాలని అన్నారు.
భీమవరం ప్రజలు తిరస్కరించిన దత్తపుత్రుడు పక్క రాష్ట్రంలో ఉంటాడు.. నాన్ లోకల్.. అని ఆరోపించారు. రియల్ లైఫ్ లో ఏ భార్యతో కూడా మూడు నాలుగేళ్ళకు మించి ఉండడు… ఇప్పటికే ముగ్గురు భార్యాలను మార్చాడు. మ్యారేజ్ స్టార్ పెళ్ళి సంప్రదాయాన్ని మంటగలిపాడు. అలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉంటే మన ఆడ బిడ్డలకు రక్షణ ఉండదని మండిపడ్డారు సీఎం జగన్. ఇలాంటి వారికి ఓట్లేయడం అవసరమా అని ప్రశ్నించారు.
SAHIL CASE : సాహిల్ ను తప్పించడానికి 30 లక్షలు..?
14యేళ్ళు పాలించిన వ్యక్తి తాను చేసిన మంచి చెప్పి ఓట్లు అడగాలి. కానీ 14యేళ్ళల్లో ఎవరికీ మంచి చేయలేదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై మండపడ్డారు సీఎం జగన్మోహన్ రెడ్డి. కుప్పం నుంచి ఇచ్చాపురం దాకా ఏ గ్రామమైనా తీసుకోండి… గ్రామ సచివాలయాలను తీసుకొచ్చి పౌరసేవలను ప్రజల దగ్గరకు తీసుకొచ్చాను అన్నారు జగన్. తనపై ఒంటరిగా పోటీ చేసే సత్తా లేకనే చంద్రబాబు, పవన్ కలసి పోటీ చేస్తున్నారని అన్నారు. అన్ని వర్గాల వారిని ముంచిన చంద్రబాబు ఇప్పుడు ఇంటికి కిలో బంగారం, బెంజ్ కారు ఇస్తామంటూ వస్తున్నాడని జగన్ విమర్శించారు. ప్రజలకు చేసిందేమీ లేదు… మోసాలు, వంచనలనే నమ్ముకున్నారు… అధికారం కోసం ఎన్ని మోసాలైనా చేస్తాని సీఎం జగన్ మండిపడ్డారు.