CM Jagan: వివేకా హత్య కేసులో రోజుకో ట్విస్ట్, గంటకో కొత్త కోణం వెలుగులోకి వస్తోంది. నిన్నటి వరకూ ఎంపీ అవినాష్ రెడ్డి మాత్రమే ఈ కేసులో కీలకంగా ఉన్నారు. కానీ ఇప్పడు ఈ కేసులో ఏపీ సీఎం జగన్ పేరును ప్రస్తావించి ప్రకంపనలు సృష్టించింది సీబీఐ. ఈ హత్య విషయం జగన్‌కు ముందే తెలుసని సంచలన ఆరోపణలు చేసింది.
హత్య గురించి ఎవరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వకముందే ఎంవీ రామకృష్ణారెడ్డి జగన్‌కు సమాచారం ఇచ్చారని సీబీఐ అఫిడవిట్ దాఖలు చేసింది. హైకోర్టులో సబ్మిట్ చేసిన అఫిడవిట్‌లో జగన్ పేరును మెన్షన్ చేసింది. వివేకా హత్యకేసు గురించి సీఎం వైఎస్ జగన్‌కు అవినాష్ రెడ్డే చెప్పారా అనే విషయం దర్యాప్తు చేయాల్సి ఉందని సీబీఐ వాదిస్తోంది. కానీ అవినాష్ రెడ్డి మాత్రం విచారణకు సహకరించడంలేదని తెలిపింది. అవినాష్ రెడ్డిని కస్టోడియల్ ఇంటరాగేషన్ చేయాల్సి ఉందనేది సీబీఐ పాయింట్. హత్య జరిగిన రాత్రి 12 గంటల 27 నిమిషాల నుంచి ఒంటిగంటా 10 నిమిషాల వరకు అవినాష్ వాట్సప్ కాల్స్ మాట్లాడారని సీబీఐ అఫిడవిట్‌లో మెన్షన్ చేసింది. ఈనెల 15 నుంచి విచారణకు రాకుండా అవినాష్ రెడ్డి కారణాలు చెప్తున్నారంటూ కోర్టుకు వివరించింది. అరెస్ట్ చేసేందుకు కర్నూలు వెళ్తే.. అవినాష్ రెడ్డి అనుచరులు అధికారులను అడ్డుకుంటున్నారని సీబీఐ సీరియస్ అయ్యింది. మరోవైపు జూన్ 30లోగా ఈ కేసు దర్యాప్తు పూర్తి చేయాల్సి ఉంది.
కానీ అవినాష్ రెడ్డి విచారణకు సహకరించకుండా ఉద్దేశపూర్వకంగా కేసును సాగదీస్తున్నరంటూ సీబీఐ చెప్తోంది. ప్రస్తుతం కస్టోడియల్ ఇంటరాగేషన్ తప్ప వేరే ఆప్షన్ లేదని సీబీఐ క్లియర్‌గా చెప్తోంది. అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ ఇవ్వొద్దంటూ హైకోర్టులో అడిషనల్ అఫిడవిట్ దాఖలు చేసింది. అయితే ఇప్పుడు జగన్ పేరును అఫిడవిట్‌లో మెన్షన్ చేయడం సంచలనంగా మారింది. అవినాష్ రెడ్డి నోరు విప్పితేనే జగన్ ఇన్వాల్వ్‌మెంట్ గురించి.. కేసు గురించి ఓ క్లారిటీ వస్తుందని సీబీఐ పాయింట్ రేస్ చేసింది. అయితే ఈ కేసులో జగన్ పేరు రావడం ఇదే మొదటి సారి. కానీ వైసీపీ నుంచి ఎలాంటి రియాక్షన్ లేదు. జస్ట్ కోర్టులో అవినాష్ తరుఫు లాయర్లు మాత్రం దీన్ని ఖండించారు. ప్రస్తంతం సీఎం జగన్ ఢిల్లీలో ఉన్నారు. అక్కడి నుంచి జగన్ టీం ఏపీకి రాగానే ఈ అఫిడవిట్‌పై ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. మొత్తానికి జగన్ పేరు ప్రస్తావించడంతో ఈ కేసు కీలక మలుపు తిరగబోతున్నట్టుగా తెలుస్తోంది.