రజనీతో బాలినేనికి రాయబారమా.. జగన్‌కు ఫ్యూజ్‌ కొట్టేసిందా….

బాలినేని వివాదం.. రచ్చ రేపుతోంది. ఈ లొల్లి ఇప్పుడు స్టార్ట్ అయింది కాదు. ఎన్నికల ముందు నుంచే రగడ మొదలైంది. ఎన్నికల ప్రచారానికి 4 నెలలు ముందు మొదలైన వివాదం.. ఎన్నికల ఫలితాలు వచ్చి 4 నెలలకు అయినా.. ఇంకా సాగుతూనే ఉంది.

  • Written By:
  • Publish Date - September 15, 2024 / 11:04 AM IST

బాలినేని వివాదం.. రచ్చ రేపుతోంది. ఈ లొల్లి ఇప్పుడు స్టార్ట్ అయింది కాదు. ఎన్నికల ముందు నుంచే రగడ మొదలైంది. ఎన్నికల ప్రచారానికి 4 నెలలు ముందు మొదలైన వివాదం.. ఎన్నికల ఫలితాలు వచ్చి 4 నెలలకు అయినా.. ఇంకా సాగుతూనే ఉంది. జగన్ మూర్ఖుడు అని.. వైసీపీ ఓడిపోతుందని ముందే చెప్పానంటూ ఘాటు కామెంట్లు చేస్తున్న బాలినేని.. కొత్త రచ్చకు దారి తీస్తున్నారు. బాలినేని వైసీపీని వీడతారని.. జనసేన జెండా పట్టుకుంటారని జరుగుతున్న ప్రచారం అంతా ఇంతా కాదు. బాలినేనిని బుజ్జగించేందుకు జగన్ చేయని ప్రయత్నం లేదు. ఇంటికి పిలిపించుకొని మరీ.. సముదాయించే ప్రయత్నం చేశారు.

ఐనా ఫలితం లేకుండా పోయింది. ఐతే ఇప్పుడు బాలినేనితో రాజీ ప్రయత్నాలకు మాజీ మంత్రి విడుదల రజనికి జగన్‌ రంగంలోకి దింపినట్లు ప్రచారం జోరందుకుంది. బాలినేనితో రజనీ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. బాలినేని పార్టీ మారుతున్నారనే వార్తలు వస్తున్న సమయంలో.. ఈ మీటింగ్ ప్రాధాన్యత సంతరించుకుంది. ఒంగోలు నుంచి కార్పొరేటర్లను హైదరాబాద్‌కు రప్పించుకొని మరీ బాలినేని మీటింగ్ పెట్టుకోగా… జగన్ వెంటనే అలర్ట్ అయి రజనీని పంపించారని తెలుస్తోంది. ఐతే ఇదే ఇక్కడ కొత్త చర్చకు కారణం అవుతోంది. రాజకీయంగా ఏ మాత్రం అనుభవం లేని.. రజనీలాంటి నాయకురాలిని రాజీ చర్చలకు పంపుంతారా.. జగన్‌కు ఫ్యూజ్ కొట్టేసిందా.. రాజకీయం మర్చిపోయాడా అంటూ.. సోషల్‌ మీడియాలో చర్చ మొదలైంది.

బాలినేనికి రాజకీయంగా చాలా అనుభవం ఉంది. జగన్ తండ్రి వైఎస్‌ఆర్‌కు కూడా ఆయన ఆప్తుడు. జగన్‌కు కష్టకాలంలోనూ తోడున్నారు కూడా. ఇలాంటి వ్యక్తి దగ్గరకు.. తన స్థాయికి ఏమాత్రం సరిపడని రజనీని జగన్ రాయబారానికి పంపుతారా అంటూ.. బాలినేని కేడర్‌తో పాటు రాజకీయం తెలిసిన ప్రతీ ఒక్కరు మాట్లాడుకుంటున్నారు. బొత్స, అవంతి, అంబటి, విజయసాయి, పెద్దిరెడ్డి, సజ్జలలాంటి సీనియర్లు చాలామంది ఉన్నా.. రజనీలాంటి జూనియర్ పొలిటిషన్‌ను పంపడం.. బాలినేని అవమానించడం కాదా అని ఇప్పుడు వాళ్లందరూ సంధిస్తున్న ప్రశ్న. ఈ మాత్రం చిన్న లాజిక్ జగన్ మర్చిపోయారా.. లేదంటే కావాలనే రజనీని పంపించారా.. కారణం ఏదైనా మాత్రం.. ఈ భేటీలో ఏం జరిగిందన్న విషయం కంటే.. ఈ భేటీకి వెళ్లిన రజనీ చుట్టే ఇప్పుడు రాజకీయ చర్చ జరుగుతోంది. ఇలా అర్థం లేని పనులు చేసే.. అధికారం కోల్పోయావ్‌. ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసుకున్నావ్‌ అంటూ జగన్‌ను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు.