Jagan comments on Pavan : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (AP CM Jagan) ఏ బహిరంగ సభల్లో అయినా పవన్ కల్యాణ్ (Pavan Kalyan) పెళ్ళి గొడవల గురించే మాట్లాడుతుండటం జనానికి బోరు కొట్టిస్తోంది. మూడు పెళ్ళిళ్ళు… ప్యాకేజీ స్టార్… దత్త పుత్రుడు లాంటి కామెంట్స్ కామన్ గా మారాయి. దాంతో ఏపీ జనానికి ఈ విమర్శలు వెగటు పుట్టిస్తున్నాయి. ఇంకా 3 నెలలే అసెంబ్లీ ఎన్నికలకు టైమ్ ఉంది. చదివిన స్క్రిప్ట్ నే మళ్ళీ మళ్ళీ ఎన్నిసార్లు చదువుతారు… ఏదైనా కొత్తగా ట్రై చేయండి అంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. విద్యార్థులు… ఆడ పిల్లలు… చిన్నపిల్లలు ఉన్న మీటింగ్స్ లో ఇలాంటి మాటలేంటి తల్లిదండ్రులు మండిపడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష పార్టీల నేతలైన చంద్రబాబు, పవన్ కల్యాణ్ ని తిట్టడానికి కొత్త తిట్లు ఏవీ ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి దొరకన్నట్టుగా ఉంది. మీటింగ్ ఏదైనా కానీ… పవన్ పెళ్ళిళ్ళ గురించిన గోలే ఉంటోంది. పార్టీ బహిరంగ సభల్లో ప్రతిపక్షాల మీద విమర్శలు చేస్తే ఓకే. కానీ బడి పిల్లలు… టెన్త్ లోపు విద్యార్థినీ విద్యార్థులు… వారి తల్లిదండ్రులు ఉన్న సమావేశాల్లో… ప్రభుత్వ కార్యక్రమాల్లో…పదే పదే పవన్ కల్యాణ్ పెళ్ళిళ్ళ గురించి ప్రస్తావించడం ఎవరికీ నచ్చడం లేదు… మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు… మూడు, నాలుగేళ్ళకోసారి పెళ్ళాలను మారుస్తాడు అంటూ శుక్రవారం నాడు జరిగిన బీమరం మీటింగ్ లోనూ జగన్ వెటకారాలు చేశారు. మన ఇంటి ఆడబిడ్డలకు రక్షణ లేదన్నట్టుగా కామెంట్స్ చేయడం… మరి ఇలాంటి వ్యాఖ్యలు విని పవన్ తో విడిపోయి …ఎవరి బతుకు వాళ్ళు బతుకుతున్న ఆ ఆడబిడ్డలకు ఎంత ఇబ్బందిగా ఉంటుందో జగన్ గానీ…. ఆయనకు స్క్రిప్ట్ రాసిచ్చిన లీడర్లు గానీ ఎప్పుడైనా ఆలోచించారా అని జనసేన కార్యకర్తలు, లీడర్లే కాదు… సొంత పార్టీ నేతలు కూడా ప్రశ్నిస్తున్నారు.
ప్యాకేజీ స్టార్, దత్తపుత్రుడు, మ్యారేజ్ స్టార్… ఈ మూడు పదాలు జగన్ నోటి వెంట వినీ… వినీ… ఆంధ్రప్రదేశ్ జనం విసుగెత్తిపోయారు. అందుకే నెటిజన్లు… జనసేన కార్యకర్తలు… జగన్…! ఏదైనా కొత్తగా ట్రై చేయి… పవన్ ని వ్యక్తిగతంగా విమర్శించడం కాదు… ముందు మీ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ కూడా చూసుకో అని కామెంట్స్ పెడుతున్నారు. తల్లి, చెల్లిని దూరంగా పెట్టి … మీ కుటుంబానికి నువ్ చేసింది ఏంటని ప్రశ్నిస్తున్నారు. అలాగే మీ పార్టీ నేతల లీలలు… సుకన్య ఆడియో లీకుల గురించి కూడా మాట్లాడాలి అని మండిపడుతున్నారు.
పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో విద్యాదీవెన నిధుల విడుదల కార్యక్రమంలోనూ… చదువుకునే బడి పిల్లల ముందు… పవన్ పెళ్ళిళ్ళ గురించి కామెంట్ చేయడాన్ని విద్యావేత్తలు తప్పుబడుతున్నారు. పవన్ పెళ్ళికీ… విద్యాదీవెన కార్యక్రమానికి సంబంధం ఏంటి… అసలు రాజకీయాల్లోకి వ్యక్తిగత విషయాలు ఎందుకు లాగుతున్నారని ప్రశ్నిస్తున్నారు. పదే పదే పవన్ పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడటం ఏంటి… పాలిటిక్స్ తో పర్సనల్ లైఫ్ ని ముడిపెట్టవద్దు.. కనీసం ఈసారి స్క్రిప్ట్ రాయించుకునేటప్పుడైనా … వ్యక్తిగత అంశాల జోలికి వెళ్ళొద్దని ఏపీ సీఎం జగన్ ను కోరుతున్నారు.