జగన్ బెయిల్ రద్దు: పేర్ని నానీ సంచలన కామెంట్స్

ఏపీలో వైఎస్ షర్మిల, వైఎస్ జగన్ మధ్య ఇప్పుడు లేఖల యుద్ధం తీవ్ర స్థాయిలో ఉంది. ఆస్తుల విషయంలో ఇప్పుడు పెద్ద పోరాటమే జరుగుతోంది.

  • Written By:
  • Publish Date - October 25, 2024 / 06:44 PM IST

ఏపీలో వైఎస్ షర్మిల, వైఎస్ జగన్ మధ్య ఇప్పుడు లేఖల యుద్ధం తీవ్ర స్థాయిలో ఉంది. ఆస్తుల విషయంలో ఇప్పుడు పెద్ద పోరాటమే జరుగుతోంది. ఈ తరుణంలో వైసీపీ నేతలు కాస్త ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. దీనిపై మాజీ మంత్రి పెర్ని నానీ స్పందించారు. టీడీపీ కుట్రలో షర్మిల పావుగా మారిందని ఆరోపించారు. హైకోర్టు స్టేటస్‌ కో ఉన్నా.. షేర్లను బదిలీ చేశారని ఆరోపించారు.

షేర్లను బదలాయించారు కాబట్టే.. జగన్‌ NCLTని ఆశ్రయించారన్నారు ఆయన. వాస్తవాలు చెప్పేందుకు NCLTని జగన్‌ ఆశ్రయించారని క్లారిటీ ఇచ్చారు. తల్లి, చెల్లిపై కేసులు వేయాలనే దురుద్దేశం జగన్‌కు లేదని స్పష్టం చేసారు. NCLTలో పిటిషన్‌ వేయకపోతే.. మళ్లీ టీడీపీ నేతలే జగన్‌ బెయిల్‌ రద్దు చేయాలని పిటిషన్లు వేస్తారన్నారు. జగన్‌ బెయిల్‌ రద్దు చేసే కుట్రలు జరుగుతున్నాయని ఆయన సంచలన వ్యాఖ్యలు చేసారు.