JANASENA: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేస్తున్న జనసేనకు మరో చిక్కు వచ్చి పడింది. జాతీయ జనసేన పేరుతో మరో పార్టీ బరిలో నిలవడం జనసేనకు ఇబ్బందిగా మారింది. పైగా ఆ పార్టీ గుర్తు జనసేన గ్లాసు గుర్తున పోలి ఉంది. అచ్చం గ్లాసును పోలిన బకెట్ గుర్తుతో ఆ పార్టీ ఎన్నికల బరిలోకి దిగుతోంది. పేరుతోపాటు, పార్టీ గుర్తులోనూ పోలిక ఉండటం పవన్ కల్యాణ్ జనసేనకు ఇబ్బందికర పరిణామమే. తెలంగాణలో జనసేన పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.
TS RTC good news : కార్తీక మాసం లో తెలుగు రాష్ట్రాల ప్రజలకు టీఎస్ ఆర్టీసీ శుభవార్త..
ఈ పార్టీ తరఫున రాష్ట్రవ్యాప్తంగా ఎనిమిది మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. అయితే, వీరికి జనసేన గుర్తైన గాజు గ్లాసు కేటాయించే అవకాశాలు లేవని తెలుస్తోంది. తెలంగాణలో ఈ పార్టీకి సరైన గుర్తింపు దక్కని కారణంగా.. ఈ పార్టీ అభ్యర్థులను స్వతంత్ర అభ్యర్థులుగా పరిగణించి, వేర్వేరు గుర్తులు కేటాయించే అవకాశం ఉంది. ఇది ఆయా అభ్యర్థులకు ఇబ్బందికరమే. దీనిపై పార్టీ నేతలు ఈసీని కోరి, తమకు గాజు గ్లాసు గుర్తు కేటాయించమని అడిగే వీలుంది. పార్టీ గుర్తు విషయంలో తగిలిన షాక్ నుంచి తేరుకునేలోపే.. జాతీయ జనసేన అనే పార్టీ తరఫున కూకట్‌పల్లి నుంచి అభ్యర్థులు బరిలోకి దిగుతుండటం సంచలనం కలిగిస్తోంది. ఇక్కడి నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులు బలమైన సామాజిక, ఆర్థిక నేపథ్యం కలిగిన వాళ్లే. అందువల్ల అందరిమధ్యా గట్టి పోటీ ఉంటుందని విశ్లేషకుల అంచనా. అయితే, అనూహ్యంగా జాతీయ జనసేన పార్టీ బరిలోకి దిగడంతో జనసేనకు సంబంధించి క్రాస్ ఓటింగ్ జరుగుతుందని భావిస్తున్నారు.
ఈ పార్టీ తరఫున బరిలో నిలిచింది బీఆర్ఎస్ వ్యక్తులేనని సమాచారం. జనసేన ఓట్లు చీల్చేందుకు.. బీఆర్ఎస్ పార్టీనే జతీయ జనసేన పార్టీని పోటీ చేయిస్తోందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ పార్టీ గుర్తు నీళ్ల బకెట్. అది గాజు గ్లాసును పోలి ఉంది. ఎలా చూసినా.. జనసేన అభ్యర్థికి ఈ విషయంలో చిక్కులు తప్పేలా లేవు. ఇక్కడ బీజేపీ మద్దుతతో జనసేన బరిలో ఉంది. సామాజికవర్గం మద్దతు, బీజేపీ మద్దతుతో, అభిమానుల అండతో ఇక్కడ గెలవొచ్చని జనసేన భావిస్తోంది. కానీ, జాతీయ జనసేన పార్టీ అడ్డు తగులుతుందేమో చూడాలి.