అల్లు అర్జున్ మదం తగ్గించుకో: జనసేన నేత స్ట్రాంగ్ వార్నింగ్

అల్లు అర్జున్ కు జనసేన నేత వార్నింగ్ ఇచ్చారు. గన్నవరం జనసేన నియోజకవర్గ ఇంఛార్జి , చలమలశెట్టి రమేష్ మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేసారు. గతంలోనే మేం అల్లు అర్జున్ కు అల్టిమేటం ఇచ్చామన్నారు.

  • Written By:
  • Updated On - December 4, 2024 / 01:21 PM IST

అల్లు అర్జున్ కు జనసేన నేత వార్నింగ్ ఇచ్చారు. గన్నవరం జనసేన నియోజకవర్గ ఇంఛార్జి , చలమలశెట్టి రమేష్ మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేసారు. గతంలోనే మేం అల్లు అర్జున్ కు అల్టిమేటం ఇచ్చామన్నారు. అల్లు అర్జున్ పోకడ మెగా అభిమానులకు , జనసైనికులకు చాలా బాధ కలిగించిందని మెగా ఫ్యామిలీని ఎన్నికల సమయంలో వ్యతిరేకించావ్, ప్రాణాలను లెక్కచేయకుండా పవన్ రాష్ట్రంకోసం అహర్నిశలు పనిచేస్తున్నారన్నారు. అలాంటి పవన్ కళ్యాణ్ ను నువ్వు గుర్తించలేదు అల్లు అర్జున్ అంటూ మండిపడ్డారు.

మధమెక్కి …అహంతో వ్యవహరిస్తున్నావ్ అల్లు అర్జున్ అని ఫైర్ అయ్యారు. రేపు పుష్ప-2 సినిమాను రాష్ట్రవ్యాప్తంగా అడ్డుకుంటామని ఆయన హెచ్చరించారు. జనసైనికులు, మెగా అభిమానులంతా నీ సినిమాను ఆడకుండా అడ్డుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. అల్లు అర్జున్ నీ మదం తగ్గించుకో అని హితవు పలికారు. ఇప్పటికైనా నువ్వు క్షమాపణ చెప్పుకో అంటూ ఫైర్ అయ్యారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్ , నాగబాబుకు అల్లుఅర్జున్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసారు. చిరంజీవి కాళ్లు కడిగి ఆ నీళ్లను నెత్తిన పోసుకోవాలన్నారు. అలా చేయకపోతే కచ్చితంగా నీ సినిమాను విడుదల కానివ్వమని హెచ్చరించారు. విడుదల చేయాలని చూస్తే రాష్ట్రవ్యాప్తంగా అడ్డుకుంటామన్నారు.