JANASENA: జనసేనకు మళ్లీ గ్లాసు గుర్తు.. కేటాయించిన ఎన్నికల సంఘం..!

తాజాగా జనసేనకు గాజు గ్లాసు గుర్తును పునరుద్ధరిస్తూ నిర్ణ‍యం తీసుకుంది. దీనిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల సంఘానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. గత సార్వత్రిక, లోక్‌సభ ఎన్నికల్లో జనసేన అభ్యర్థులు తెలంగాణ, ఏపీల్లో గాజు గ్లాసుపైనే పోటీ చేశారని పవన్ గుర్తు చేశారు.

  • Written By:
  • Publish Date - September 19, 2023 / 03:03 PM IST

JANASENA: జనసేన పార్టీకి ఎన్నికల సంఘం గుడ్ న్యూస్ అందించింది. ఆ పార్టీకి తిరిగి గాజు గ్లాసు గుర్తు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. 2014లో స్థాపించిన ఈ పార్టీకి ఆ తర్వాత ఎన్నికల సంఘం గాజు గ్లాసు గుర్తు కేటాయించింది. కానీ, సరైన అర్హతలు లేని కారణంగా తిరిగి గుర్తును తొలగించింది. దేశవ్యాప్తంగా 26 రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన పార్టీల వివరాలను వెల్లడించిన సమయంలో జనసేన గ్లాస్ గుర్తును కోల్పోయింది. ఈ గుర్తును జనసేనకు తొలగించి, ఫ్రీ సింబల్ చేసింది.

అయితే, తాజాగా జనసేనకు గాజు గ్లాసు గుర్తును పునరుద్ధరిస్తూ నిర్ణ‍యం తీసుకుంది. దీనిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల సంఘానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. గత సార్వత్రిక, లోక్‌సభ ఎన్నికల్లో జనసేన అభ్యర్థులు తెలంగాణ, ఏపీల్లో గాజు గ్లాసుపైనే పోటీ చేశారని పవన్ గుర్తు చేశారు. ఏపీలోని 137 అసెంబ్లీ స్థానాల్లో, తెలంగాణలోని 7 పార్లమెంట్ స్థానాల్లో అభ్యర్థులు పోటీ చేసినట్లు వెల్లడించారు. రాబోయే ఎన్నికల్లో కూడా జనసేన గాజు గ్లాసు గుర్తుపైనే పోటీ చేయబోతుంది. ఏపీలో టీడీపీతో కలిసి పోటీ చేయాలని జనసేన నిర్ణయించుకుంది.

బీజేపీ కూడా కలిసొచ్చే అవకాశం ఉంది. గాజు గ్లాసు గుర్తుపై జనసేన కూడా ఫోకస్ చేసింది. ఈ గుర్తును పార్టీ జనంలోకి తీసుకెళ్లింది. వచ్చే ఎన్నికల్లో గ్లాసు గుర్తుపైనే పోటీ చేయనుండటం ఆ పార్టీకి కలిసొచ్చే అంశం. త్వరలోనే ఏపీలో సీట్ల పంపకాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.