JEEVAN REDDY: ఆర్మూర్.. కొద్దిరోజులుగా ఈ నియోజకవర్గం పేరు చర్చలోనే ఉంటోంది. మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి వ్యవహారంలో బయటపడుతున్న విషయాలు ఆసక్తి రేపుతున్నాయ్. జీవన్ రెడ్డికి వరుస షాక్‌లు తగులుతున్నాయ్. ఆర్టీసీ కాంప్లెక్స్ పెండింగ్ బిల్లులు చెల్లించాలని.. లేదంటే క్లోజ్ చేస్తామని అధికారులు హెచ్చరించిన రోజుల వ్యవధిలోనే.. తమ దగ్గర తీసుకున్న రూ.20 కోట్ల రుణంతో పాటు వడ్డీ రూ.25 కోట్లు.. మొత్తం కలిపి రూ.45 కోట్లు చెల్లించాలంటూ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ అధికారులు నోటీసులు జారీ చేశారు.
Praja Vani: ప్రజా దర్బార్ కాదు.. ప్రజా వాణి.. కొత్త రూల్స్ ఇవే..!
ఆర్మూర్‌లోని జీవన్ రెడ్డి ఇంటికి అధికారులు నోటీసులు అంటించారు. అయితే, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి రూ.20కోట్లు రుణం తీసుకున్నారు. 2017లో ఆయన సతీమణి రజిత రెడ్డి పేరుపై జీవన్ రెడ్డి ఈలోన్ తీసుకోగా ఇప్పటి వరకు డబ్బు చెల్లించలేదు. అంతకుముందు.. జీవన్‌రెడ్డికి ఆర్టీసీ, ట్రాన్స్‌కో అధికారులు ఏకకాలంలో బకాయిల వసూలుకు చర్యలు ప్రారంభిస్తూ షాక్ ఇచ్చారు. వీటన్నింటికి తోడు.. అటు రాజకీయంగానూ జీవన్‌రెడ్డికి ఇబ్బందులే ఎదురవుతున్నాయ్. ఈ ఎన్నికల్లో అక్కడి నుంచి బీజేపీ తరఫున గెలిచిన పైడి రాకేశ్ రెడ్డి వరుస సవాళ్లు విసురుతున్నారు. జీవన్‌రెడ్డిని కార్నర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. పార్టీపరంగా అయినా అంతా బాగుందా అంటే.. జీవన్‌రెడ్డికి ఆ ఆనందం కూడా లేకుండా పోయింది. ఆర్మూర్ బీఆర్ఎస్ పార్టీలో ముసలం మొదలైంది. మున్సిపల్ ఛైర్ పర్సన్‌కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ కౌన్సిలర్ల సమావేశం జరిగింది.
సుమారు 26మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు.. జిల్లా కలెక్టర్‌ను కలిసినట్లు తెలుస్తోంది. మున్సిపల్ చైర్ పర్సన్ వినీతపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు అనుమతి ఇవ్వాలంటూ కలెక్టర్‌కు బీఆర్ఎస్ కౌన్సిలర్లు విన్నవించారని సమాచారం. స్థానిక బీఆర్ఎస్ పెద్దగా, మాజీ ఎమ్మెల్యేగా ఇది కూడా జీవన్ రెడ్డికి ఒకరకంగా సవాల్‌లాంటిదే. ఇలా ఒకేసారి అన్ని ఇబ్బందులు జీవన్ రెడ్డిని ఇబ్బందిపెడుతున్నాయి.