JEEVAN REDDY: సీటు కన్ఫాం? ఓడినా జీవన్‌రెడ్డికి మంత్రి పదవి?

కాంగ్రెస్‌ పార్టీ తమ అభ్యర్థులకు మంత్రి పదవులు పంచుతోంది. సీనియర్‌ నేతలందరికీ క్యాబినెట్‌లో చోటు దక్కబోతోంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జీవన్‌ రెడ్డికి కూడా మంత్రి పదవి దక్కబోతోంది. నిజానికి జీవన్‌ రెడ్డి ఎమ్మెల్యేగా గెలవలేదు. మరి మంత్రి పదవి ఎలా ఇస్తారు..?

  • Written By:
  • Publish Date - December 5, 2023 / 04:25 PM IST

JEEVAN REDDY: మొత్తానికి తెలంగాణలో పంతం నెగ్గించుకుంది కాంగ్రెస్‌ పార్టీ. బీఆర్ఎస్‌ను కుర్చీ నుంచి దింపుతామని చెప్పి అన్నంత పనీ చేసింది. ప్రజల మద్దతుతో అధికారాన్ని దక్కించుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. ఇప్పటికే అసెంబ్లీ రద్దవ్వగా.. కాంగ్రెస్‌ పార్టీ తమ అభ్యర్థులకు మంత్రి పదవులు పంచుతోంది. సీనియర్‌ నేతలందరికీ క్యాబినెట్‌లో చోటు దక్కబోతోంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జీవన్‌ రెడ్డికి కూడా మంత్రి పదవి దక్కబోతోంది. నిజానికి జీవన్‌ రెడ్డి ఎమ్మెల్యేగా గెలవలేదు.

CONGRESS COUNCIL: కౌన్సిల్‌లో కాంగ్రెస్ సర్కార్‌కి కష్టాలే..! బిల్లులు ఆమోదం పొందేది ఎలా..?

మరి మంత్రి పదవి ఎలా ఇస్తారు అంటే.. ప్రస్తుతం జీవన్‌ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీకి ఏకైక ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. ఎమ్మెల్యేగా గెలవకపోయినా.. ఎమ్మెల్సీ కోటాలో మంత్రి పదవి ఇచ్చే వెసులుబాటు ఉంది. ఈ పద్దతిలోనే ఇప్పుడు జీవన్‌ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వబోతున్నారంటూ టాక్‌ నడుస్తోంది. కాంగ్రెస్‌ పార్టీలో ఉన్న సీనియర్‌ లీడర్స్‌లో జీవన్‌ రెడ్డి కూడా ఒకరు. పార్టీలో ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా జీవన్‌ రెడ్డి ఎప్పుడూ పార్టీని వీడలేదు. పదేళ్లు అధికారానికి దూరంగా ఉన్నా కూడా పార్టీలోనే కొనసాగారు. తెలంగాణలో పార్టీ పని ఐపోయింది అనుకున్న సమయంలో కూడా కాంగ్రెస్‌ నుంచి ఎమ్మెల్సీగా గెలిచారు.

పార్టీకి నమ్మిన బంటుగా ఉన్నారు కాబట్టే.. ఎమ్మెల్యేగా గెలవకపోయినా ఆయనకు మంత్రి పదవి ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్‌ సీఎం అభ్యర్థితో పాటు మంత్రుల పేర్లను కూడా కాంగ్రెస్‌ హైకమాండ్‌ ఖరారు చేసింది. జీవన్‌ రెడ్డిని ఏ శాఖ వరిస్తుందో చూడాలి మరి.