Jharkhand MLAs: హైదరాబాద్‌లో ఝార్ఖండ్ ఎమ్మెల్యేలు.. భారీ భద్రత.. కలిసేందుకు నో ఛాన్స్

జేఎంఎం, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను హైదరాబాద్ తరలించారు. ప్రస్తుతం ఈ రెండు పార్టీల ఎమ్మెల్యేలు ఇక్కడి లియోనియా రిసార్టులో సేద తీరుతున్నారు. ఇక్కడ దాదాపు 43 మంది ఎమ్మెల్యేలున్నారు. వారిని కలిసేందుకు ఎవరికీ అనుమతి ఇవ్వడం లేదు.

  • Written By:
  • Publish Date - February 3, 2024 / 02:48 PM IST

Jharkhand MLAs: ఝార్ఖండ్ సీఎంగా ఉన్న హేమంత్ సోరెన్‌ను ఈడీ అరెస్టు చేయడంతో, అక్కడ రాజకీయ అనిశ్చితి తలెత్తిన సంగతి తెలిసిందే. సీఎం ఎంపిక, ప్రభుత్వ ఏర్పాటు విషయంలో సందిగ్ధత కొనసాగుతోంది. ఇప్పటికే సీఎం ప్రమాణ స్వీకారం జరిగింది. ఇద్దరు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే, బల నిరూపణకు మరో రెండు రోజుల గడువుంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలు ఎవరూ ఇతరపార్టీల వైపు మళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీనిలో భాగంగా జేఎంఎం, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను హైదరాబాద్ తరలించారు.

Poonam Pandey: నాకేం కాలేదు.. నేను బతికే ఉన్నా.. పూనమ్ పాండే సంచలనం

ప్రస్తుతం ఈ రెండు పార్టీల ఎమ్మెల్యేలు ఇక్కడి లియోనియా రిసార్టులో సేద తీరుతున్నారు. ఇక్కడ దాదాపు 43 మంది ఎమ్మెల్యేలున్నారు. వారిని కలిసేందుకు ఎవరికీ అనుమతి ఇవ్వడం లేదు. వారు ఉన్న రిసార్టు దగ్గర కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఝార్ఖండ్ అసెంబ్లీలో 81 మంది ఎమ్మెల్యేలున్నారు. అధికారం కోసం 41 మంది ఎమ్మెల్యేలు కావాలి. కానీ, అక్కడ ఏ పార్టీకీ మెజారిటీ రాలేదు. జేఎంఎం పార్టీకి 29, కాంగ్రెస్‌కు 17 సీట్లు దక్కాయి. మిగతా సీట్లు బీజేపీకి దక్కాయి. జేఎంఎం, కాంగ్రెస్ కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అయితే, సీఎం హేమంత్ సోరెన్‌పై అవినీతి ఆరోపణలు, మనీ లాండరింగ్ కేసులు నమోదు కావడంతో.. ఈడీ ఆయనను అరెస్టు చేసింది. ఈ నేపథ్యంలో చంపై సోరెన్ నేతృత్వంలో తిరిగి ప్రభుత్వం ఏర్పాటైంది. చంపై సీఎంగా ప్రమాణం చేశారు. మరో వారంలోగా బల నిరూపణ చేసుకోవాల్సి ఉంది. దీని ప్రకారం ఈ నెల 5, సోమవారం బలనిరూపణకు ప్రభుత్వం సిద్ధమైంది.

అయితే, ఆలోగానే ఎమ్మెల్యేల్ని బీజేపీ.. తనవైపు తిప్పుకొనే అవకాశం ఉండటంతో జేఎంఎం, కాంగ్రెస్ ముదు జాగ్రత్తకు దిగాయి. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో, అక్కడి ఎమ్మెల్యేల్ని ఇక్కడికి తరలించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో కాంగ్రెస్ ఇంచార్జి దీపాదాస్ మున్షీ, మంత్రి పొన్నం ప్రభాకర్.. వారి భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. అక్కడ వారి భద్రత కోసం దాదాపు 300 మంది పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. అనుమతి లేకుండా ఎవరినీ లోపలికి పంపించడం లేదు. మీడియాను కూడా అనుమతించడం లేదు. ఆదివారం సాయంత్రం లేదా సోమవారం ఉదయం.. ఎమ్మెల్యేలంతా ఝార్ఖండ్ తిరిగి వెళ్తారు.