ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు మాజీ మంత్రుల అవినీతి వ్యవహారాలపై సీరియస్ గా ఫోకస్ చేసిన సర్కార్ ఇప్పుడు ఏ మార్గాన్ని వదలడం లేదు. గత ప్రభుత్వంలో రెచ్చిపోయి పిచ్చి పిచ్చిగా మాట్లాడిన అందరి లెక్కలు తేల్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా జోగి రమేష్ విషయంలో సీరియస్ గా ఉంది సర్కార్. ఇటీవల ఆయన కుమారుడ్ని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కేసుపై విచారణ ముమ్మరంగా సాగుతోంది. విచారణలో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా మరో కోణం బయట పడింది.
అగ్రిగోల్డ్ కుంభకోణం కేసులో కొత్త కోణం ఆశ్చర్యపరుస్తోంది. నేను అసలు జోగి రమేష్ ఫ్యామిలీ కి స్థలం అమ్మ లేదని ఈ కేసులో నిందితుడుగా ఉన్న పోలవరం మురళీమోహన్ సిఐడీ అధికారులకు చెప్పడం గమనార్హం. ఇదే కేసులో నిందితుడిగా ఉన్న పోలవరం మురళీమోహన్ ను అధికారులు రెండు రోజుల నుంచి విచారిస్తున్నారు. తాను జోగి ఫ్యామిలీకి ఎటువంటి భూమి విక్రయించలేదని సిఐడి కి మురళీమోహన్ వాంగ్మూలం ఇచ్చారు. అయితే మురళీమోహన్ కి భూమి సర్వే నెంబర్ 88 లో ఉందట.
మొదటి జోగి ఫ్యామిలీ సర్వే నెంబర్ 88 తో రిజిస్ట్రేషన్ చేయించుకొని… సర్వేనెంబర్ 87 గా అధికారాన్ని వినియోగించుకుని రెండోసారి రిజిస్ట్రేషన్ చేయించుకుంది అని అధికారులు గుర్తించారు. రిజిస్ట్రేషన్ సమయంలో పోలవరపు మురళీమోహన్ పేరుతో వచ్చిన డాక్యుమెంట్స్ గాని, ఆధార్ కార్డు గాని తనది కాదని సిఐడి కి మురళీ మోహన్ తెలిపారు. దీనితో జోగి ఫ్యామిలీపై ఫోర్జరీ కేసు నమోదు చేసేందుకు సిద్ధమైన సిఐడి అధికారులు… త్వరలోనే మరికొందరిని అరెస్ట్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ కేసులో వైసీపీ నేత ఒకరు ఉన్నారని కూడా తెలుస్తోంది. జోగి రాజీవ్ ప్రస్తుతం కస్టడీలో ఉన్నారు. త్వరలోనే జోగి రమేష్ ను కూడా అదుపులోకి తీసుకోవచ్చని భావిస్తున్నారు.