KA PAUL: తెలుగు రాజకీయాల్లో ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ శైలే వేరు. ‘తెలంగాణలో మాకు 80 సీట్లు వస్తున్నాయ్. నెక్ట్స్ గవర్నమెంట్ ఏర్పాటు చేసేది మేమే. మిగతా పార్టీ వాళ్ళు మా కాళ్ళ బేరానికి వస్తారు”.. ఇలా ఎన్నిమాటలైనా చెబుతాడు కేఏ పాల్. వినేవాడు వెర్రోడైతే.. చెప్పేటోడు కేఏ పాల్.. అన్నట్టుగా ఉంటుంది ఆయన వ్యవహారం. కొన్నేళ్ళుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయన హంగామా జనమంతా చూస్తూనే ఉన్నారు. ఒకసారి అభ్యర్థుల లిస్ట్ దొంగలెత్తుకెళ్ళారన్నాడు. ఇంకోసారి మాదే ప్రభుత్వం అంటాడు.
YS SHARMILA: కనిపించట్లేదు.. బెంగళూరులో మకాం పెట్టిన షర్మిల.. పార్టీ అంత వీజీ కాదని అర్థమైందా..?
బంపర్ మెజారిటీతో సీఎం అవుతానని చెబుతాడు. ఇన్ని చెప్పిన కేఏ పాల్.. అసలు తమ పార్టీ అభ్యర్థులను తెలంగాణ ఎన్నికల్లో నిలబెట్టాడా..? లేదు. ఇక్కడ ఎలక్షన్ జరుగుతుంటే విశాఖపట్నంలో ఏం చేస్తున్నట్టో. అంత అన్నాడు.. ఇంత అన్నాడు.. సరిగ్గా ఎన్నికల సమయానికి తెలంగాణ వదిలి పారిపోయాడు. ఇది కేఏ పాల్‌కి కొత్తమీ కాదు. ప్రతి ఎన్నికల్లోనూ చేసే తమాషానే. సినిమాలో కమెడియన్స్ ఉన్నట్టే.. పాలిటిక్స్‌లో ప్రతి ఎన్నికల్లో ఓ జోకర్ కావాలి. అది కేఏ పాల్. తెలంగాణలో గానీ, ఏపీలో గానీ.. హఠాత్తుగా ప్రత్యక్షమై ఏదో ఒక స్టేట్‌మెంట్ ఇస్తాడు. మళ్ళా కొన్నాళ్ళ దాకా కనపడడు. ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో 55 మంది అభ్యర్థులకు తన ప్రజాశాంతి పార్టీ తరపున బీఫామ్స్ ఇచ్చినట్టు చెప్పాడు.
LOCAL BOI NANI: నాని అరెస్ట్..? విశాఖ ప్రమాదం వెనక యూట్యూబర్ నాని.. అసలేం జరిగింది..?
వాళ్ళంతా ఈ ఎన్నికల్లో నిలబడ్డారా అంటే అదీ డౌటే. 55మందిని నిలబెట్టి.. 80 సీట్లతో తెలంగాణలో ప్రభుత్వం ఎలా ఏర్పాటు చేస్తాడో.. ఎలా ముఖ్యమంత్రి అవుతాడో ఎవరికీ అర్థం కాదు. సరే.. అది వదిలేయండి. తెలంగాణ సీఎం పోస్ట్ కాస్త పక్కనపెట్టేయండి.. ఇప్పుడు విశాఖపట్నం ఎంపీ కావాలని కలలు కంటున్నాడు కేఏ పాల్. వైజాగ్ జనం ఈసారి కేఏపాల్‌నే గెలిపిద్దాం అనుకుంటున్నారట. పార్లమెంట్‌లో నరేంద్రమోడీని ఎదుర్కొనే సత్తా అతనికే ఉందట. ప్రజలే కాదు పార్టీలు కూడా ఈసారి.. కేఏ పాల్‌కే మద్దతు ఇద్దాం.. అని ఆలోచిస్తున్నారట. ప్రస్తుత వైజాగ్ ఎంపీ MVV సత్యనారాయణ కూడా.. నెక్ట్స్ఎలక్షన్స్‌లో పాల్‌కే సపోర్ట్ చేస్తానని చెప్పుకుంటున్నారట. టీడీపీ ఎంపీ అభ్యర్థి భరత్ కూడా తన అనుచరులతో ఇదే మాట అన్నారట. ఈ సీక్రెట్స్ అన్నీ పాల్‌కి ఎలా లీక్ అయ్యాయో.. ఏమో.. మొన్నామధ్య ప్రెస్ మీట్ పెట్టి మరీ కేఏ పాల్ విశాఖపట్నంలో చెప్పారు. తెలంగాణ సీఎం అవ్వాలనుకొని.. వైజాగ్ ఎంపీగా పోటీ చేయడం ఏంటి..?
బీకామ్‌లో ఫిజిక్స్ చదివినట్టుగా.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంత చిత్ర విచిత్రమైన మనిషి ఎవరికీ తగలడు. అసలు పాల్ ఎందుకిలా చేస్తున్నాడో ఎవరికీ అర్థం కాదు. పిచ్చి మాటలు.. వెర్రి వాగుడు.. పూటకో మాట.. ఇవన్నీ చూస్తే పాల్ మైండ్ దొబ్బేసిందా.. అన్న అనుమానం ఎవరికైనా వస్తుంది. తెలంగాణకు ముఖ్యమంత్రి అవుతానని చెప్పి విశాఖలో కూర్చున్నాడు పాల్. రేపు మళ్లీ ఏపీ ఎలక్షన్‌లో ఇదే తంతు చేస్తాడు. అక్కడ ఎన్నికలు జరుగుతుంటే హైదరాబాద్ వచ్చి కూర్చుంటాడు. ప్చ్.. ఈ పాల్ ఎవరికీ అర్థం కాడు. మనం మాత్రం.. పరారీలో కేఏ పాల్.. విశాఖలో తెలంగాణ ఎన్నికల ప్రచారం అని వెరైటీగా హెడ్డింగ్ పెట్టుకోవాల్సిందే.