కడప జనాలే షర్మిలను నమ్మడం లేదా?

ఇదీ పరిస్థితి. కడప (Kadapa) జిల్లా నుంచి షర్మిల ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు. ప్రతీచోట వివేకా కూతురు సునీతతో కలిసి.. హత్య కేసును హైలైట్‌ చేస్తున్న షర్మిల.. అవినాశే హంతకుడని.. ఆ హంతకుడిని జగన్‌ కాపాడుతున్నాడని.. అందుకే కుటుంబానికి ఎదురు తిరగాల్సిన పరిస్థితి వచ్చింది అంటూ.. చెప్తున్నారు. షర్మిల బస్సు యాత్రలకు జనాలు కూడా వస్తున్నారు.

 

 

 

ఇదీ పరిస్థితి. కడప (Kadapa) జిల్లా నుంచి షర్మిల ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు. ప్రతీచోట వివేకా కూతురు సునీతతో కలిసి.. హత్య కేసును హైలైట్‌ చేస్తున్న షర్మిల.. అవినాశే హంతకుడని.. ఆ హంతకుడిని జగన్‌ కాపాడుతున్నాడని.. అందుకే కుటుంబానికి ఎదురు తిరగాల్సిన పరిస్థితి వచ్చింది అంటూ.. చెప్తున్నారు. షర్మిల బస్సు యాత్రలకు జనాలు కూడా వస్తున్నారు. ఐతే వాళ్లంతా వైఎస్ బిడ్డగా షర్మిలను చూడ్డానికి మాత్రమే వస్తున్నారని.. కాంగ్రెస్ నాయకురాలిలా షర్మిలను చూడ్డానికి కాదు అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్. దువ్వూరు ప్రచారంలో జరిగిన సంఘటనే దానికి ఎగ్జాంపుల్ అంటూ.. స్ట్రాంగ్‌గా చెప్తున్నారు మరికొందరు. షర్మిల ముందే.. జనాలు జై జగన్ అంటూ నినాదాలు చేశారు. దమ్ము ధైర్యం అంటే తన దగ్గరకు వచ్చి మాట్లాడాలని షర్మిల సవాల్ విసరగా.. సీన్ రివర్స్ అయింది. ఓ యువకుడు మైక్ పట్టుకొని జగన్‌కు ఆకాశానికెత్తేశాడు.

దీంతో అవాక్కవడం షర్మిల వంతు అయింది. వైఎస్‌ఆర్ బిడ్డగా, జగన్‌ చెల్లిగా స్వాగతం చెప్తాం తప్ప.. కాంగ్రెస్ (Congress) నాయకురాలిగా ఆహ్వానించేది లేదు అంటూ తెగేసి చెప్పారు. ఐతే ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే.. రాబోయే రోజుల్లో ప్రచారంలో.. షర్మిలకు ఇలాంటి సంఘటనలు మరిన్ని ఎదురుకావడం ఖాయం అని జోస్యం చెప్పేవాళ్లు చాలామంది ఉన్నారు. ఉమ్మడి కడప జిల్లా.. వైఎస్ కుటుంబానికి కంచుకోట. షర్మిల మాటలను, ఆరోపణలను.. జిల్లా జనాలు పట్టించుకున్నట్లు కనిపించడం లేదు అనే చర్చ సోషల్‌ మీడియాలో జరుగుతోంది.

ఇక అటు వివేకా కేసుపై కోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో.. అవినాష్ రెడ్డిని హంతకుడు అనడం, ఈ విషయంలో జగన్‌ను కార్నర్‌ చేయడం వైఎస్ అభిమానులు పెదవి విరుస్తున్నారు. ఐతే దువ్వూరు సభలో జరిగిన సంఘటన.. వైసీపీ పక్కా ప్లాన్ అని.. ఐప్యాక్ బ్యాచ్ పని ఇదంతా అంటూ.. కాంగ్రెస్ శ్రేణులు కౌంటర్ ఇస్తున్నాయ్. ఏమైనా షర్మిల కడప జిల్లా ప్రచారం వ్యవహారం.. రాజకీయవర్గాల్లో కొత్త చర్చకు కారణం అవుతోంది.